Machu Vishnu: ‘కన్నప్ప’ షూటింగ్‌లో చేతికి గాయాలు, అలాగే షూటింగ్ చేసిన విష్ణు

ABN , First Publish Date - 2023-10-30T11:54:33+05:30 IST

'కన్నప్ప' సినిమా పోరాట సన్నివేశం న్యూజిలాండ్ లో తీస్తుండగా మంచు విష్ణు కి గాయాలు. డ్రోన్ బ్లేడ్స్ చేతికి తగిలి గాయం అయిందని, ఆసుపత్రికి వెళ్లి కట్లు కట్టించుకొని తిరిగి షూటింగ్ కంటిన్యూ చేశారని తెలిసింది.

Machu Vishnu: ‘కన్నప్ప’ షూటింగ్‌లో చేతికి  గాయాలు, అలాగే షూటింగ్  చేసిన విష్ణు
Manchu Vishnu

మంచు విష్ణు (ManchuVishnu) చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా 'కన్నప్ప' #Kannappa. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో (NewZealand) జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని వందలమంది సిబ్బందితో రోజూ షూటింగ్ జరుగుతోంది అక్కడవున్న దట్టమైన అడవుల్లో. అలాగే విష్ణు తో పాటు చాలామంది నటీనటులు న్యూజిలాండ్ వెళ్లారు, షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే మొన్న జరిగిన ఒక సంఘటన అక్కడ పని చేస్తున్న టీము అందరినీ ఆశ్చర్యచకితుల్ని, భయకంపితులని చేసింది అని అక్కడ పని చేసిన యూనిట్ సభ్యులు తెలిపారు.

ఇంతకీ ఏమి జరిగింది అంటే, కన్నప్ప పాత్ర పోషిస్తున్న మంచు విష్ణు మీద ఒక పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలని డ్రోన్ సాయంతో తీస్తున్నారు, అందులో కొంచెం దగ్గరగా చూపించాలని డ్రోన్ ని కొంచెం కిందకి దించారు. అదే సమయంలో విష్ణు వెనక్కి జరగాలి, కానీ అనుకోకుండా ముందుకు వచ్చారని, అప్పుడు డ్రోన్ అతను మొహంమీదకి వచ్చేసిందని, వెంటనే విష్ణు రెండు చేతులను మొహానికి అడ్డం పెట్టారని తెలిసింది. అయితే డ్రోన్ చాలా వేగంగా తిరుగుతూ ఉండటంతో దానికున్న బ్లేడ్స్ విష్ణు రెండు చేతులకి తగిలి చాలా లోతుగా గాయం అయిందని తెలిసింది.

kannappa1.jpg

యూనిట్ మొత్తం భయపడింది ఆ హఠాత్పరిణామానికి. ఇంకొకరు విష్ణు ప్లేస్ లో వున్నట్టయితే వెంటనే స్పృహ తప్పి పడిపోయేవారని, కానీ విష్ణు రోజూ వ్యాయామం చేసే శరీరం అవటంతో తట్టుకున్నారు అని ప్రత్యక్షంగా చూసిన ఒక యూనిట్ సభ్యుడు చెప్పారు. రక్తం విపరీతంగా కారటంతో విష్ణు పెద్దగా అరుచుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఎవరినీ ఆ సమయంలో దగ్గరకి రానియ్యలేదని తెలిసింది. యూనిట్ సభ్యులు కంగారు పడుతూ ఉంటే, తన దగ్గరకి ఎవరూ రావద్దు అని చెప్పి, దూరంగా ఒక్కడూ నడుచుకుంటూ వెళ్లారని, అలా కంట్రోల్ చేసుకున్నారని తెలిసింది.

ఈ విషయం నాన్నకి (మోహన్ బాబు) తెలియనివ్వద్దు, ఎందుకంటే గాబరాపడి వచ్చేస్తారు, అలాగే కుటుంబ సబ్యులని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని వార్త బయటకి చెప్పలేదు అని తెలిసింది. వెంటనే దగ్గరలో వున్న ఆసుపత్రికి వెళ్లి రెండు చేతులకు కట్లు వేయించుకున్నారు విష్ణు. ఆరోజు షూటింగ్ రద్దు అని అందరూ అనుకున్నారు, కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ విష్ణు షూటింగ్ చెయ్యడానికి ఆసుపత్రి నుండి సరాసరి షూటింగ్ స్పాట్ కి వచ్చేసారు, షూటింగ్ కంటిన్యూ చేశారు అని యూనిట్ సభ్యులు చెప్పారు. అందరూ ఆశ్చర్య పోయారు అతని డెడికేషన్ చూసి అని తెలిసింది. మోహన్ బాబు (MohanBabu) కూడా ఇవాళో రేపో న్యూజిలాండ్ వెళ్లి షూటింగ్ లో పాల్గొంటారు అని తెలిసింది.

ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్ (MohanLal), శివ రాజకుమార్ (Shiv Rajkumar) లాంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. నయనతార (Nayanthara) కూడా చేస్తోంది అని ఒక వార్త. తెలుగు నటులు బ్రహ్మాజీ (Brahmaji), రఘుబాబు (Raghubabu), మధుబాల (Madhubala), సురేఖావాణి (SurekhaVani) ఇంకా చాలామంది కన్నడ, తమిళ నటులు కూడా వున్నారని తెలుస్తోంది. సినిమా చాలా బాగా వస్తోందని కూడా టాక్ నడుస్తోంది.

Updated Date - 2023-10-30T11:54:33+05:30 IST