Guntur Kaaram: క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో మహేష్ సినిమా

ABN , First Publish Date - 2023-11-13T15:39:57+05:30 IST

'గుంటూరు కారం' షూటింగ్ ప్రస్తుతం నానక్ రామ్ గూడా దగ్గరలో వున్న ఒక బిల్డింగ్ లో జరుగుతోందని, ఇంకో నాలుగురోజులు చేసాక పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోతుందని తెలుస్తోంది. అనుకున్నట్టుగానే జనవరి 12న విడుదలకి సిద్ధం అవుతోందని తెలియవచ్చింది

Guntur Kaaram: క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో మహేష్ సినిమా
Mahesh Babu from Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు (SuperStarMaheshBabu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram షూటింగ్ చివరిదశకు చేరుకుంది. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) (Suryadevara Radha Krishna) నిర్మిస్తున్న ఈ సినిమా రానున్న జనవరి 12న సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలవుతోంది. ఇందులో శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary) కథానాయికలు కాగా, ప్రకాష్ రాజ్ (PrakashRaj), రావు రమేష్ (RaoRamesh), జయరాం, రమ్యకృష్ణ (RamyaKrishna), మురళి శర్మ (MuraliSharma) మున్నగువారు నటిస్తున్నారు.

sreeleela-gunturkaram.jpg

ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలియవచ్చింది. నవంబర్ 12 దీపావళి పండగ రోజు, ఈరోజు పతాక సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని, చాలామంది క్యారెక్టర్ నటులు ఈ సన్నివేశంలో కనిపిస్తారని తెలియవచ్చింది. నిన్న పండుగరోజు, ఆదివారం అయినా ఈ సినిమా షూటింగ్ జరిగిందని, ఈరోజు కూడా జరుగుతోందని తెలిసింది. నానక్ రామ్ గూడా దగ్గర వున్న ఒక బిల్డింగ్ లో ఈ షూటింగ్ జరుగుతోందని తెలిసింది.

ఈ రెండు రోజుల షూటింగ్ తో ఈ సినిమా మొత్తం పూర్తి అయిపోనుందని, ఇంకొక నాలుగురోజులు మాత్రం షూటింగ్ ఉందని, నవంబర్ 30 లోగా మొత్తం షూటింగ్ పూర్తి చేసి, తరువాత కేవలం పాటలు మాత్రమే షూటింగ్ చేస్తారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో అయినా, ఈ సినిమా జనవరి 12 న విడుదలకు సిద్ధం చెయ్యాలని దర్శకుడు, నిర్మాత, మిగతా సభ్యులు పని చేస్తున్నారని తెలిసింది.

Updated Date - 2023-11-13T15:39:58+05:30 IST