Guntur Karam: మహేష్ అభిమానులకు నిరాశ, త్రివిక్రమ్ మీద విమర్శలు

ABN , First Publish Date - 2023-08-09T12:52:48+05:30 IST

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతను చేస్తున్న సినిమా 'గుంటూరు కారం' నుండి మహేష్ బాబు స్టిల్ ఒకటి ఈరోజు విడుదల చేశారు. మహేష్ అభిమానులకు ఎందుకో ఇది అంతగా రుచించలేదు అనిపిస్తోంది, అందుకే వాళ్ళు ఈ సినిమా మీద అంతగా ఆసక్తి చూపించటం లేదు అని సాంఘీక మాధ్యమాల్లో అంటున్నారు. ఎందుకంటే ఒకే స్టిల్ వివిధ యాంగిల్స్ లో ఇస్తున్నారు అనే విమర్శ వస్తోంది అని కూడా తెలిసింది.

Guntur Karam: మహేష్ అభిమానులకు నిరాశ, త్రివిక్రమ్ మీద విమర్శలు
Mahesh Babu from Guntur Karam film

మహేష్ బాబు (MaheshBabu) పుట్టినరోజు అయిన ఆగస్టు 9 (August9) న అతని సినిమా ఏదైనా షూటింగ్ జరుగుతూ ఉంటే అతని అభిమానులు ఆ సినిమా నుంచి చాలా పెద్ద అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటారు. కానీ అదేంటో ఈసారి 'గుంటూరు కారం' #GunturKaram అనే ఒక పెద్ద బడ్జెట్ సినిమా ఒక అగ్ర దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) చేస్తున్నా కూడా, అభిమానుల్లో అంతగా సంతోషం లేదు, అంతగా ఎదురుచూసి ఎదో చేసేస్తారని కూడా లేదు. ఎందుకంటే ఈ 'గుంటూరు కారం' సినిమా షూటింగ్ అవుతుంది అనటం, మళ్ళీ వాయిదా పడటం, ఇలాంటివి గత సంవత్సర కాలంగా జరుగుతూ ఉండటమే అని అభిమానులు అంటున్నారు.

ఈ పుట్టినరోజుకి మాత్రం మహేష్ బాబు అభిమానులు చాలా నిరాశ పడ్డారని తెలుస్తోంది. ఎందుకంటే 'గుంటూరు కారం' నిర్మిస్తున్న నిర్మాతలే ముందురోజు సాయంత్రం రేపు ఎదో ఇవ్వాలి అన్నట్టుగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంటే నిర్మాతలకు కూడా ఈ సినిమా మీద ఆసక్తి పోయింది అని అభిమానులు వాపోతున్నారు. అదీ కాకుండా ఎదో ఒకటి విడుదల చెయ్యాలి కాబట్టి మహేష్ బాబు బీడీ కాలుస్తున్న చిత్రం ఒకటి విడుదల చేశారు. మొట్ట మొదటి మహేష్ బాబు లుక్ ఈ సినిమా నుండి విడుదల చేసింది కూడా ఇంచుమించు అలాంటిందే అని అభిమానులు ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని విమర్శిస్తున్నారు.

maheshbabulookgunturkaram.jpg

'గుంటూరు కారం' నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్ (SitharaEntertainments) వాళ్ళు కూడా ఈ సినిమా గురించి పట్టించుకోవటం లేదు అని అభిమానులు అంటున్నారు. ఎందుకంటే మొట్ట మొదట లుక్ మహేష్ బాబు నిలుచొని బీడీ కలుస్తున్న స్టిల్ ఇచ్చారు, తరువాత ఈ సినిమా ఏమైనా షూటింగ్ చేశారు అంటే అది కృష్ణ గారి పుట్టినరోజు అయిన మే 31న టీజర్ రూపంలో ఇచ్చేసారు. ఇక ఇవ్వడానికి ఈ సినిమా నిర్మాతల దగ్గర ఏమీ ఫుటేజ్ లేదు అని, ఈ సినిమా ఎందుకు ఇంత జాప్యం జరుగుతోందో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అలాగే విమర్శిస్తున్నారు కూడా.

కొందరు అభిమానులు సెటైరికల్ గా కూడా మాట్లాడుతున్నారు. "మొదటి సారి ఈ సినిమా నుండి ఒక లుక్ వచ్చింది అది మహేష్ నిలుచొని బీడీ కాలుస్తున్నట్టు ఇచ్చారు, ఇప్పుడు మహేష్ పుట్టిన రోజుకి అతను కూర్చొని బీడీ కాలుస్తున్నట్టు ఇచ్చారు, రాబోయే వినాయకచవితి పండగకి మహేష్ పడుకొని బీడీ కలుస్తున్నట్టు ఇస్తారని అనుకుంటున్నాను", అని ఒక అభిమాని సెటైరికల్ గా చెప్పాడు అంటే అభిమానవుల్లో కూడా ఈ సినిమా మీద అంత ఆసక్తి లేదు అని అనిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా ఆగష్టు 16 నుండి షూటింగ్ మొదలెడతాం అని అంటున్నారు. కానీ అది ఎంతవరకు అవుతుందో మాత్రం తెలియటం లేదు అని అభిమానులే అంటున్నారు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఈ 'గుంటూరు కారం' కన్నావేరే సినిమాల మీదే దృష్టి ఎక్కువ వుంది అని కూడా అభిమానులు అంటున్నారు. 'గుంటూరు కారం' లో శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (MeenkashiChaudhary) కథానాయికలుగా చేస్తున్నారు.

Updated Date - 2023-08-09T18:30:43+05:30 IST