MaheshBabu: ఆ గాసిప్ వెబ్ సైట్ మీద మహేష్ బాబు అభిమానుల ఆగ్రహం, వైరల్ అవుతున్న గ్యాస్ ఆంధ్ర లీక్స్

ABN , First Publish Date - 2023-05-25T14:53:25+05:30 IST

మహేష్ బాబు అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఒక గాసిప్ వెబ్ సైట్ ను, అది నడిపే వ్యక్తిని, అందులో సినిమా వార్తలు రాసే వ్యక్తిని ట్రోల్ చేస్తూ వాళ్ళ మీద గంటకో వార్త గ్యాస్ఆంధ్ర పేరిట పోస్ట్ చేస్తున్నారు. ఆ వెబ్ సైట్ మహేష్ అభిమానులకి క్షమాపణ కూడా చెప్పింది.

MaheshBabu: ఆ గాసిప్ వెబ్ సైట్ మీద మహేష్ బాబు అభిమానుల ఆగ్రహం, వైరల్ అవుతున్న గ్యాస్ ఆంధ్ర లీక్స్
Mahesh Babu

మహేష్ బాబు (MaheshBabu) మీద చాలా నెగటివ్ వార్తలు వస్తున్నా, మహేష్ బాబు అభిమానులు (MBFans) ఎక్కువ పట్టించుకునే వారు కాదు. మనకెందుకులే, రాసుకోనీ, ఈ గాసిప్ వెబ్ సైట్ అంతే అని వూరుకుంటూ వుంటారు. అలాంటింది రెండు మూడు రోజులుగా మహేష్ బాబు అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఈ గాసిప్ వెబ్ సైట్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గ్యాస్ ఆంధ్ర లీక్స్ (#GasAndhraLeaks) అంటూ, ఆ వెబ్ సైట్ గురించి, అందులో సినిమా వార్తలు రాస్తే ఒక వ్యక్తి గురించి, వాళ్ళు ఎలా సినిమా పరిశ్రమ నుండి తమ గాసిప్ వెబ్ సైట్ ని వాడుకుంటూ, డబ్బులు, ఫామ్ హౌస్, ఇల్లు సంపాదించారో కూడా సాంఘీక మాధ్యమంలో గంటకో వార్త పెడుతున్నారు.

ఇంతకీ ఏమైంది అంటే ఆ గాసిప్ వెబ్ సైట్ మహేష్ బాబు మీద ఒక నెగటివ్ వార్త రాసింది. అందులో నిజాలు ఎంత ఉన్నాయో చెక్ చెయ్యకుండా ఎదో ఇష్టానుసారం రాసింది. దానికి మహేష్ బాబు అభిమానులు చాలా సీరియస్ గా తీసుకొని, ఆగ్రహించి ఆ వెబ్ సైట్ గురించి, అందులో చిత్రపరిశ్రమకి సంబంధించి వార్తలు రాస్తున్న వ్యక్తి గురించి సమాచారం సేకరించి, సాంఘీక మాధ్యమం లో గ్యాస్ ఆంధ్ర లీక్స్ #GasAndhraLeaks పేరిట పోస్ట్ చేస్తున్నారు. అభిమానులు ఇంతలా ఆగ్రహించడం చూసిన ఆ గాసిప్ వెబ్ సైట్ వెంటనే స్పందించి మహేష్ బాబు అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పింది. అది కూడా ఆ సైట్ లో పెట్టింది.

MBfansletter.jpg

మరి అలాంటి ఈ గాసిప్ వెబ్ సైట్ ఇప్పుడు మహేష్ బాబు #MBFans అభిమానులతో పెట్టుకుంది. వాళ్ళు ఈ వెబ్ సైట్ గురించి ఒక్కొక్కటి ఆరా తీసి పోస్ట్ చేస్తున్నారు. ఆ వెబ్ సైట్ నడిపే వ్యక్తి, ఆ వెబ్ సైట్ ని అడ్డం పెట్టుకొని సినిమా వార్తలు రాసే వ్యక్తి ఈ అభిమానులు చెపుతున్న దాన్ని బట్టి చూస్తే ఎంత సంపాదించారో అని ఆశ్చర్యం వేస్తోంది. ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే వుంది, రానున్న రోజుల్లో మహేష్ బాబు అభిమానులు ఈ విషయాన్నీ ఇంకా పెద్దది చేసి ఒక ఆశ్చర్యకరమైన రీతిలో కొత్తవిషయాలు బయటపెడతారని తెలుస్తోంది.

Mahesh-Babu.jpg

ఇదే కాదు, గతంలో చాలామంది నటీనటుల మీద ఇలాంటి గాసిప్ వార్తలే ఈ వెబ్ సైట్ రాసేది. ఆ వార్తలు రాసే వ్యక్తి కూడా చాలామంది నిర్మాతలకి, ప్రొడక్షన్ హౌస్ ల వాళ్లకి చాలా ఇబ్బంది పెట్టాడని పరిశ్రమలో అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ (TrivikramSrinivas) దర్శకత్వం లో ఒక సినిమా #SSMB28 చేస్తున్నారు, ఇది అయ్యాక రాజమౌళితో (SSRajamouli) సినిమా #SSMB29 చేస్తారు.

Updated Date - 2023-05-25T14:53:25+05:30 IST