KGF: యష్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్ అయ్యారా..?

ABN , First Publish Date - 2023-02-13T20:48:52+05:30 IST

‘కెజియఫ్’ (KGF) ప్రాంచైజీతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన నటుడు యష్ (Yash). ఈ ప్రాంచైజీతో రాకింగ్ స్టార్ యష్ ఇండియన్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశారు. భారీ స్థాయిలో రూ.1400కోట్ల వసూళ్లను రాబట్టారు.

KGF: యష్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్ అయ్యారా..?

‘కెజియఫ్’ (KGF) ప్రాంచైజీతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన నటుడు యష్ (Yash). ఈ ప్రాంచైజీతో రాకింగ్ స్టార్ యష్ ఇండియన్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశారు. భారీ స్థాయిలో రూ.1400కోట్ల వసూళ్లను రాబట్టారు. గతేడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ‘కెజియఫ్ 2’ (KGF 2) రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. యష్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మించి రాణించాలని యష్ అనుకుంటున్నారు. డైరెక్టర్స్ నుంచి వరుసగా కథలు వింటున్నారు. అయినప్పటికీ ఏ స్క్రిఫ్ట్‌కు ఒకే చెప్పలేదు. అయితే, యష్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ కోలీవుడ్ మీడియాలో విపరీతంగా షికార్లు కొడుతుంది. అదేంటంటే..

PS-Mithran.jpg

‘సర్దార్’ (Sardar), ‘డిటెక్టివ్’ చిత్రాలతో ఫేమ్ సంపాందించుకున్న దర్శకుడు పీఎస్. మిత్రన్ (PS Mithran). ఓ కథను యష్‌కు వినిపించారట. రాకింగ్ స్టార్ కూడా ఆసక్తి చూపించినట్టు సమాచారం. ఆయన మాత్రం తన అంగీకారాన్ని తెలపలేదని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాలంటే ఓ చిక్కుంది. పలు భాషలకు చెందిన అనేక మంది స్టార్ డైరెక్టర్స్ యష్‌కు కథలు వినిపించారు. అందులో ఆయన ఐదింటిని ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. కానీ, ఒక్క స్క్రిఫ్ట్‌కు కూడా సై అనలేదు. ఒకవేళ మిత్రన్ స్క్రిఫ్ట్ కనుక ఒకే అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చిత్రబృందం నుంచి త్వరలోనే రానుంది. యష్‌ తన తర్వాతి సినిమాను కెవిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో చేయనున్నారు. రాకింగ్ స్టార్ ఏ స్క్రిఫ్ట్‌కు ఒకే చెప్పిన భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఉంది.

Updated Date - 2023-02-13T20:48:53+05:30 IST