సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

VBVK: కిరణ్ అబ్బవరానికి మరో హిట్ పడినట్టేనా?

ABN, First Publish Date - 2023-02-20T22:05:59+05:30

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)కు ఇంకో హిట్ పడినట్టేనా? అంటే అవుననే సమాధానమే బాక్సాఫీస్ వద్ద వినిపిస్తోంది. రీసెంట్‌గా..

Kiran Abbavaram
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)కు ఇంకో హిట్ పడినట్టేనా? అంటే అవుననే సమాధానమే బాక్సాఫీస్ వద్ద వినిపిస్తోంది. రీసెంట్‌గా మహాశివరాత్రి (Maha Shivratri) పర్వదినాన విడుదలైన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్రం మంచి కలెక్షన్స్ రాబడుతూ.. హిట్ దిశగా దూసుకుపోతోంది. దీంతో కిరణ్ అబ్బవరం అకౌంట్‌లో మరో హిట్ పడిందనేలా ఇండస్ట్రీలో టాక్ మొదలైంది.

‘రాజావారు రాణిగారు’ (Rajavaru Ranigaru) సినిమాతో హీరోగా కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువకాలంలోనే మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ‘SR కళ్యాణమండపం’ (SR Kalyana Mandapam)తో డీసెంట్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ (Allu Aravind) స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ (GA2 Pictures) బ్యాన‌ర్‌పై ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రం వచ్చింది. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు (Bunny Vas) ఈ సినిమాను నిర్మించారు. వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న జీఏ2 పిక్చ‌ర్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందనే వార్త వచ్చినప్పుడే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్స్‌తో రాబడుతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.

నెంబర్ నైబరింగ్ కాన్సెప్ట్‌తో మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు 2.75 కోట్ల గ్రాస్‌ను, రెండవరోజు 2.40 కోట్ల గ్రాస్‌తో... ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 5.15 కోట్ల గ్రాస్‌ను సాధించినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా.. ఈ సినిమాతో మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishore Abburu) దర్శకుడిగా పరిచయమవగా.. కిరణ్ సరసన కశ్మీర పరదేశి (Kashmira Pardeshi) హీరోయిన్‌గా నటించింది.

Updated Date - 2023-02-20T22:06:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!