Guntur Karam: కొత్త సమస్య , షూటింగ్ మళ్ళీ వాయిదా, సినిమా ఎప్పటికి పూర్తవుతుందని మహేష్ అభిమానుల ఆందోళన

ABN , First Publish Date - 2023-08-02T12:07:04+05:30 IST

'గుంటూరు కారం' సినిమా మళ్ళీ వార్తల్లో వుంది. ఈరోజు అంటే ఆగష్టు 2 నుండి జరగాల్సిన షూటింగ్ మళ్ళీ వాయిదా పడింది. సినిమాటోగ్రాఫర్ వినోద్ తప్పుకున్నాడు, అతని స్థానంలో కొత్తవారిని తీసుకోవాలి అది ఈసారి చెప్పే కారణం. మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు విడుదల చేస్తారు అని మహేష్ అభిమానులు ఆందోళనలో వున్నారు అని తెలిసింది.

Guntur Karam: కొత్త సమస్య , షూటింగ్ మళ్ళీ వాయిదా, సినిమా ఎప్పటికి పూర్తవుతుందని మహేష్ అభిమానుల ఆందోళన
Mahesh Babu from Guntur Karam

మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaram సినిమా అసలు అవుతుందా అనే సందేహం వచ్చేట్టుగా ఆ సినిమా షూటింగ్ నత్తనడకలా సాగుతోంది. ఎప్పుడో గత సంవత్సరం మొదలెట్టిన షూటింగ్ ఇంతవరకు కనీసం పది శాతం కూడా కాలేదని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కథానాయకుడు మహేష్ బాబు (MaheshBabu) వెకేషన్ కి లండన్ వెళ్ళిపోయాడు. అతను ఆగష్టు 14న వస్తాడు అని అంటున్నారు. ఇందులో పూజ హెగ్డే (PoojaHegde) బదులు శ్రీలీల (Sreeleela) వచ్చింది, శ్రీలీల చెయ్యాల్సిన పాత్ర కోసం మీనాక్షి చౌదరి (MeenkashiChaudary) ని తీసుకున్నారు.

ఇప్పుడు ఈ సినిమాని నుండి సినిమాటోగ్రాఫర్ పీస్ వినోద్ (PSVinod) తప్పుకున్నాడు. అతను సినిమా షూటింగ్ నత్త నడకలా సాగుతూ ఉండటం చూసి వేరే సినిమాలు మిస్ అయిపోతున్నాను అనుకొని ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఈరోజు నుండి అంటే ఆగస్టు 2 నుండి కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈసారి కారణం సినిమాటోగ్రాఫర్ లేడు, కొత్త అతను వచ్చేంత వరకు షూటింగ్ లేదు అని తెలిసింది.

gunturkaram.jpg

ఇప్పుడు పీస్ వినోద్ స్థానంలో ఎవరిని తీసుకోవాలని చిత్ర నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ వస్తే గానీ షూటింగ్ జరిగే పరిస్థితి లేదు. అంటే ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తి చేస్తారు, ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో మహేష్ అభిమానులు ఆందోళనలో వున్నారు అని తెలిసింది. సినిమా నిర్మాతలు మాత్రం ఈ సినిమా గురించి మీ మాట్లాడటం లేదు, ఉంటుంది అని మాత్రమే చెపుతున్నారు. ఈ సినిమా మీద పరిశ్రమలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈ సినిమా మీద ఎవరికైనా ఆసక్తి ఉందా అని పరిశ్రమలో అనుకుంటున్నారు.

sreeleela-gunturkaram.jpg

ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ (SSThaman) ఎన్ని క్లారిటీ లు ఇచ్చినా, చెప్పినా ఈ సినిమాకి సంగీతం అతనే ఇస్తున్నాడా అని అందరికీ సందేహం వస్తోంది. ఇంతకీ థమన్ ఇలా వరస సినిమాలు వొప్పుకోవటంతో అతని పాటల్లో క్లారిటీ తగ్గిపోతోంది అని పరిశ్రమలో ఇంకో టాక్ నడుస్తోంది. అది అతని తప్పు కాదు. అతనికి టైము ఇవ్వకుండా అందరూ అతనే కావాలనుకుంటే అతను మాత్రం ఏమి చేస్తాడు, ఎదో ఒకటి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఈ 'గుంటూరు కారం' #GunturKaram సినిమాకి కూడా అందుకే థమన్ బదులు వేరే వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అని నిర్వాహకులు అనుకుంటున్నట్టుగా భోగట్టా!

Updated Date - 2023-08-02T12:07:04+05:30 IST