Guntur Kaaram: మొత్తానికి బీడీ లేకుండా మహేష్ బాబు స్టిల్ వచ్చింది

ABN , First Publish Date - 2023-11-06T16:45:39+05:30 IST

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా 'గుంటూరు కారం' నుండి మొదటి పాటని రేపు విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడొచ్చినా మహేష్ బాబు బీడీ కాలుస్తున్న స్టిల్ తప్ప వేరేదే లేదన్నట్టుగా చేశారు, కానీ ఇప్పుడు...

Guntur Kaaram: మొత్తానికి బీడీ లేకుండా మహేష్ బాబు స్టిల్ వచ్చింది
Mahesh Babu from Guntur Kaaram

మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram మొదటి లుక్ అప్పుడెప్పుడో విడుదల చేశారు. అందులో మహేష్ బాబు ఒక బీడీ తాగుతూ కనపడతాడు. అదే లుక్ ని తిప్పి తిప్పి, ఒకటి నిలుచొని, ఇంకోసారి కూర్చొని, ఇంకోసారి పడుకొని, అదే బీడీ తాగుతున్న స్టిల్ ప్రతి ప్రకటనలోనూ ఇస్తూ వచ్చారు చిత్ర నిర్వాహకులు. మహేష్ బాబు అభిమానులు అయితే ఒకటే ఆందోళన చెందారు, సినిమాలో అసలు మహేష్ బాబు బీడీ లేకుండా స్టిల్ లేదా ఏంటి అని.

కొందరు అభిమానులు అయితే సాంఘీక మాధ్యమంలో నిర్మాతని టాగ్ చేసీ మరీ అడిగారు. సినిమాలో మహేష్ బాబు స్టిల్ ఒకటే ఉందా ఏంటి, అది కూడా బీడీ తాగుతూ వుండే స్టిల్, ఇంకా వేరే స్టిల్స్ లేనే లేవా అని. మొత్తానికి అభిమానుల ఆందోళన చిత్ర నిర్వాహకులకు అర్థం అయినట్టుంది ఈరోజు ఒక ప్రటకన వచ్చింది ఆ సినిమా నుండి ఫస్ట్ సింగల్ విడుదల చేస్తున్నాం అని.

gunturkaaram-firstsingle.jpg

ఆ ప్రకటనలో మహేష్ బాబు మామూలు స్టిల్ ఇచ్చారు. హమ్మయ్య బీడీ లేకుండా మొదటి సారి మహేష్ బాబు ని చూస్తున్నాం అని అభిమానులు కొంచెం ఆనంద పడ్డారు. ఎందుకంటే ఆ సినిమా మొదటి లుక్ కొన్ని నెలల క్రితం విడుదలైన దగ్గర నుండి, ఒకటే స్టిల్ ఇస్తూ వస్తున్నారు చిత్ర నిర్వాహకులు. రేపు దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి మొదటి పాటని విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాకి ఎస్ థమన్ (Thaman) సంగీతం సమకూరుస్తున్నారు, ఈ మొదటి పాట ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఉండగా ఈ పాటలో ఒక బిట్ ఇంతకు ముందే లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary) కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ (PrakashRaj), జగపతి బాబు (JagapathiBabu), రావు రమేష్ (RaoRamesh), మురళి శర్మ, రమ్య కృష్ణ (RamyaKrishna) ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

Updated Date - 2023-11-06T16:45:40+05:30 IST