Agent: తప్పు జరిగిపోయింది అంటున్నారు, కానీ ఇలా ఎన్నాళ్ళు, హిట్ వచ్చేది ఎప్పుడు

ABN , First Publish Date - 2023-05-01T18:03:26+05:30 IST

సినిమా పోయినప్పుడల్లా తప్పు జరిగిపోయింది అని చెప్పుకుంటూ పోతే, హిట్ సినిమా తీసేది ఎప్పుడు. నిర్మాత అనిల్ సుంకర ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో హిట్స్ కన్నా ఫ్లాపులే ఎక్కువ, మరి ఎప్పుడు నేర్చుకునేది అని ఒక చర్చ జరుగుతోంది...

Agent: తప్పు జరిగిపోయింది అంటున్నారు, కానీ ఇలా ఎన్నాళ్ళు, హిట్ వచ్చేది ఎప్పుడు

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటించిన 'ఏజెంట్' (Agent) సినిమా నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) చాలా ధైర్యమైన మనిషి, ఎందుకంటే సినిమా పోయినప్పుడు, దానికి నాదే బాధ్యత అని తప్పు ఒప్పుకోవటం, నిజాయితీతో కూడుకున్నది. అందుకే అనిల్ సుంకరని అందరూ ప్రశంసిస్తున్నారు. ఎన్నో సినిమాలు ప్లాప్ అయినా ఈరోజుకి కూడా చాలామంది నిర్మాతలు ఒప్పుకోరు, కానీ మొన్న విడుదల అయినా 'ఏజెంట్' విడుదల అయినా నాలుగో రోజే అనిల్ సుంకర తప్పు నాదే అన్నాడు. ఈ తప్పు నుండి నేర్చుకొని, ముందు ముందు హిట్ సినిమాలు తీస్తా అంటున్నాడు, కానీ నేర్చుకున్నాడా ఏమైనా తప్పుల నుండి అని ఒక చర్చ నడుస్తోంది.

anilsunkara1.jpg

'ఏజెంట్' ముందు, శర్వానంద్ (Sharwanand), సిద్ధార్థ్ (Siddharth) తో కలిసి 'మహాసముద్రం' (Mahasamudram) అనే సినిమా తీసాడు. అది మొదటి రోజే డిజాస్టర్ అయింది. దానికి ముందు మహేష్ బాబు (MaheshBabu) తో 'సరిలేరు నీకెవ్వరు' (Sarileru Neekevvaru) అనే సినిమా తీసాడు. అది ప్రాఫిటబుల్ వెంచర్ అవునో కాదో అతనే చెప్పాలి. దానికన్నా ముందు చాలా చిన్న, మిడిల్ బడ్జెట్ సినిమాలు చాలా తీసాడు. అవన్నీ అనిల్ తన స్వంత ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్ మీద తీసినవే, అందులో చాలా ప్లాప్ అయ్యాయి.

anilsunkara2.jpg

ఇలా తప్పు జరుగుతున్నప్పుడల్లా తప్పు జరిగిపోయింది, నేర్చుకోవాలి అంటూ చెప్పడమేనా, అసలు నిజంగా నేర్చుకునేది ఏమైనా ఉందా అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. ఎందుకంటే అనిల్ సుంకర, ఎవరినీ నొప్పించడు, తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోతాడు. మరి ఎందుకు ఈ ఫెయిల్యూర్స్ అన్నీ వస్తున్నాయి. దర్శకులను బాగా నమ్మడం వలన ఇదంతా జరుగుతోంది అని పరిశ్రమలో పేరు చెప్పని ఒక నిర్మాత చెప్పాడు. దర్శకుల దగ్గర ముందే స్క్రిప్ట్ చూసుకోవాలి, కథ వినాలి, అవసరం అయితే మార్పులు చేసుకోవాలి, షూటింగ్ లో ఏమి జరుగుతోందో తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ ని అంచనా వేస్తూ ఉండాలి, అని ఆ నిర్మాత అన్నాడు.

మరి ఇన్ని సినిమాల చేసిన అనుభవం వున్నా, అనిల్ ఎక్కడ పొరబడుతున్నాడో అని చర్చ జరుగుతోంది. లిక్కర్ మీద డబ్బులు పెట్టి, అందులో వచ్చిన లాభాలతో ఈ సినిమాలు అన్నీ చేస్తున్నాడు అని పరిశ్రమలో టాక్. ఇంకో టాక్ ఏంటంటే విదేశాల్లో అనిల్ కి ఏవో కంపెనీలు వున్నాయి అక్కడ నుండి తెచ్చిన డబ్బు పెడుతున్నాడు అని. ఏమైనా ఎన్ని సినిమాలు ఇలా ఫెయిల్యూర్ అవుతున్నా, అతను మాత్రం ఆలా నవ్వుతూనే ఉంటాడు, చాలా పాజిటివ్ గా ఉంటాడు.

Updated Date - 2023-05-01T18:03:26+05:30 IST