Sankranti Box-Office: దిల్ రాజు భయపడ్డాడా, భయపెట్టారా

ABN , First Publish Date - 2023-01-09T17:26:04+05:30 IST

ఎటువంటి పరిస్థితి లో అయినా నా థియేటర్స్ లో నా సినిమాని నేను వేసుకుంటాను అని భీష్మించుకు కూర్చున్న నిర్మాత దిల్ రాజు తన సినిమా 'వారసుడు' ని ఎందుకు వాయిదా వేసాడు. ఇదే విషయం ఇప్పుడు పరిశ్రమలో చర్చ నడుస్తోంది.

Sankranti Box-Office:  దిల్ రాజు భయపడ్డాడా, భయపెట్టారా

ఎటువంటి పరిస్థితి లో అయినా నా థియేటర్స్ లో నా సినిమాని నేను వేసుకుంటాను అని భీష్మించుకు కూర్చున్న నిర్మాత దిల్ రాజు తన సినిమా 'వారసుడు' ని ఎందుకు వాయిదా వేసాడు. ఇదే విషయం ఇప్పుడు పరిశ్రమలో చర్చ నడుస్తోంది. విజయ్, రష్మిక మందన్న నటించిన (Vijay and Rashmika Mandanna is the lead pair) ఈ సినిమాకి వంశీ పైడిపల్లి (Director Vamshi Paidipally) దర్శకుడు. సోమవారం అత్యవసరంగా జరిగిన మీడియా కాన్ఫరెన్స్ లో దిల్ రాజు తన సినిమా 'వారసుడు' విడుదలను మూడు రోజులపాటు వాయిదా వేసినట్టు చెప్పాడు. కానీ తమిళ సినిమా యధాతధంగా జనవరి 11 న విడుదల అవుతుంది.

'వారసుడు' (Varasudu bookings opened and sold tickets) బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు, టికెట్స్ అమ్ముడుపోయాయి, ఇంత అయినా చివరి నిముషం లో దిల్ రాజు ఎందుకు వెనక్కి తగ్గాడు అనే ప్రశ్న చిత్ర పరిశ్రమలో అందరూ చర్చిస్తున్నారు. కొందరు దిల్ రాజు స్నేహితులు, ఎందుకు ఇద్దరు పెద్ద నటులతో పెట్టుకుంటావ్, వెనక్కి తగ్గిపో అని సలహా ఇచ్చారు అని కూడా తెలిసింది. ఒకవేళ దిల్ రాజు అనుకున్న తేదీకి విడుదల చేస్తే కొంతమంది నిర్మాతలు ముందు ముందు దిల్ రాజు కి ఎటువంటి సహాయ సహకారాలు ఉండకుండా చెయ్యాలి అని అనుకున్నారని, ఆ విషయం దిల్ రాజు కి తెలిసి ఎందుకు లేనిపోని గొడవలు అని సినిమా విడుదల వాయిదా వేసినట్టుగా తెలిసింది. ఏమైనా కూడా అంత మొండి పట్టు పట్టి, ఒక్కసారిగా తన సినిమా వాయిదా అంటే, ఎదో జరిగి ఉండాలి అని మాత్రం అంటున్నారు పరిశ్రమలో. తనని టార్గెట్ చేసారు పరిశ్రమలో కొంతమంది అని అన్నాడు దిల్ రాజు, కానీ ఎవరు టార్గెట్ చేశారు, ఎందుకు చేసారు?

vijay1.jpg

సోమవారం దిల్ రాజు ఇంకో సినిమా 'శాకుంతలం' (Shakuntalam) ప్రమోషన్స్ కి కూడా వచ్చాడు, కానీ ఎందుకో చాలా ఆందోళనగా ఉన్నట్టు కనపడ్డాడు. దిల్ రాజు చాల ఆలస్యంగా రావటం వాళ్ళ 'శాకుంతలం' సినిమా ప్రెస్ మీట్ కూడా అనుకున్న టైం కి కాకుండా, చాలా ఆలస్యంగా మొదలయింది. తమిళ వెర్షన్ 11న విడుదల అవటం వలన, ఆ సినిమా ఫలితం ప్రభావం తెలుగు వెర్షన్ మీద కచ్చితంగా ఉంటుంది అని పరిశ్రమలో అంటున్నారు. తేడాలొస్తే ఇక్కడ తెలుగు వెర్షన్ దెబ్బతింటుంది. దానికి తోడు ఈ సినిమా మీద దిల్ రాజు చాలా భారీగా ఖర్చుపెట్టాడు అని తెలిసింది. అందుకనే దిల్ రాజు ఆందోళన పడుతున్నాడని కూడా అంటున్నారు. 'వాల్తేరు వీరయ్య', (Waltair Veerayya) 'వీరసింహ రెడ్డి' (Veerasimha Reddy) సినిమాలకు ఎక్కువ థియేటర్స్ ఇచ్చినట్టుగా కూడా చెప్పాడు.

Updated Date - 2023-01-09T17:39:48+05:30 IST