Game Changer: నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ మధ్య విభేదాలు?

ABN , First Publish Date - 2023-07-12T10:55:58+05:30 IST

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా పోరాట సన్నివేశాల విషయంలో నిర్మాత దిల్ రాజు కి, దర్శకుడు శంకర్ కి మధ్య విభేదాలు వచ్చాయన్న వార్త పరిశ్రమలో గుప్పుమంది. 'హిట్' చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తో ఈ సన్నివేశాలను చిత్రీకరించటం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి

Game Changer: నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ మధ్య విభేదాలు?
Producer Dil Raju and director Shankar

ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar), రామ్ చరణ్ (RamCharan) కాంబినేషన్ లో వస్తున్న 'గేమ్ చేంజర్' #GameChanger షూటింగ్ ఒక యాక్షన్ సన్నివేశంతో మొదలెట్టారు అని వార్తలు వచ్చాయి. ఈ హై బడ్జెట్ సినిమా దిల్ రాజు (DilRaju) నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ (KiaraAdvani) కథానాయకురాలు కాగా, ఇంకొక కథానాయకురాలిగా అంజలి (Anjali) నటిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' #RRR సినిమాతో బాగా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్, ఈ 'గేమ్ చేంజర్' సినిమాకోసం ఎంతోమంది అతని అభిమానులు, అలాగే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా మొదటి లుక్ ఆమధ్య విడుదల చేశారు. ఆ తరువాత ఈ సినిమా గురించి అధికారిక ప్రచారాలు ఏమి రాకపోయినా, లీకులు ద్వారా కొన్ని వీడియోస్, ఫోటోస్ బయటకి వచ్చాయి. మొత్తం మీద ఈ సినిమా వార్తల్లో ఉంటూనే వుంది. ఈమధ్యనే రామ్ చరణ్, ఉపాసన (UpasanaKamineniKonidela) దంపతులు తల్లిదండ్రులు కూడా అయ్యారు, అందుకని రామ్ చరణ్ కొంచెం బ్రేక్ కూడా తీసుకున్నాడు.

gamechanger3.jpg

బ్రేక్ తరువాత రామ్ చరణ్ ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో పాల్గొన్నాడు. 'హిట్' #Hit చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ఆధ్వర్యంలో ఈ పోరాట సన్నివేశాలు చిత్రీకరణ ప్రారంభించినట్టుగా వార్తలు వచ్చాయి, ఫోటోస్ కూడా వచ్చాయి. దర్శకుడు శంకర్ చెన్నై లో కమల్ హాసన్ (KamalHaasan) తో చేస్తున్న 'భారతీయుడు 2' (Indian2) సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండటం వలన, శైలేష్ కొలను ఈ పోరాట సన్నివేశాలను చిత్రీకరించవలసి వచ్చింది అన్న వార్త కూడా వైరల్ అయింది.

అయితే మరి నిర్మాత దిల్ రాజు, ఈ విషయాన్నీ దర్శకుడు శంకర్ కి చెప్పారో లేదో అని కూడా అంటున్నారు. ఎందుకంటే శంకర్ ఈ సినిమా గురించి ట్వీట్ పెడుతూ మళ్ళీ ఇప్పుడు 'గేమ్ చేంజర్' కి జంప్ అయ్యాను అని పెట్టాడు. ఎందుకంటే శంకర్ ఈ సినిమా పాటల షూటింగ్ విషయంలో కూడా తను కూడా యూనిట్ తో వెళ్లి దగ్గరుండి పాటల సన్నివేశాలను కూడా పర్యవేక్షించారు. మామూలుగా అయితే కొందరు దర్శకులు అక్కడ వుండరు, కానీ శంకర్ విషయంలో మాత్రం ఆలా పనికిరాదు. సినిమాకి సంబంధించి ఎటువంటి సన్నివేశం చిత్రీకరణ జరిగినా తాను ఉండాల్సిందే అని అనుకుంటాడు. మరి ఆలా అనుకున్న శంకర్, అతను లేకుండా ఎలా పోరాట సన్నివేశాలను చిత్రీకరణకు దిల్ రాజు పూనుకున్నారు అని చర్చ నడుస్తోంది.

gamechanger1.jpg

ఇప్పుడు దర్శకుడు శైలేష్ కొలనుతో ఈ షూటింగ్‌ చేయిస్తున్నారు అనగానే ఎదో అయి ఉంటుంది అన్న వార్త ఒక్కసారిగా పరిశ్రమలో వైరల్ అయింది. శైలేష్ ఎక్కడ నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు? అతను వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు కదా, మరి 'గేమ్ చేంజర్' షూటింగ్ కి ఎందుకు వచ్చినట్టు. దిల్ రాజు దగ్గరుండి తనే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక రామ్ చరణ్ తో అడిగి చేయించారా? ఇలా చాలా ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.

ఇదిలా ఉండగానే, దర్శకుడు శంకర్ తన ట్విట్టర్ లో ఒక వార్త పోస్ట్ చేసాడు. ఒక మంచి పోరాట సన్నివేశ చిత్రీకరణలో వున్నాను. మళ్ళీ పని మీదకి వచ్చాను, అని అన్నాడు. అయితే చివర్లో 'నిజంగానే' అని ఒక్క మాట కూడా అన్నాడు. అంటే శైలేష్ కొలను ఎందుకు తీస్తున్నాడు అనే దాని మీద క్లారిటీ ఇవ్వడం కోసమేనా అది అని ఇంకో చర్చ నడుస్తోంది. ఎన్ని ట్వీట్ లు చేసిన, శైలేష్ కొలను రావటం, షూటింగ్ లో పాల్గొనటం మాత్రం నిజం అనే అంటున్నారు. అసలు దిల్ రాజు కి శంకర్ కి మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా? అని కూడా చర్చ నడుస్తోంది. ఎందుకంటే సినిమా ఇప్పటికే బాగా లేట్ అయింది, శంకర్ ఇలా రెండు సినిమాలు ఒకేసారి చెయ్యడంతో 'గేమ్ చేంజర్' అనుకున్న సమయానికి రాలేకపోతే కష్టం అని దిల్ రాజు వేరే దర్శకుడి పర్యవేక్షణలో ఇలా పోరాట సన్నివేశాలే కదా అని చేయించేశారు అని కూడా అంటున్నారు. ఏది నిజమో వాళ్ళు అధికారికంగా చెప్పేంతవరకు అయితే తెలీదు.

Updated Date - 2023-07-12T11:19:52+05:30 IST