Mega Star Chiranjeevi: ఆ సినిమాలో చిరంజీవి పక్కన రెండో హీరోగా....

ABN , First Publish Date - 2023-09-11T16:59:48+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాతగా ఒక సినిమా ప్రకటించారు. అయితే అది బెజవాడ ప్రసన్నకుమార్ చెప్పిన కథ, అది తండ్రీకొడుకుల కథ, అందులో చిరంజీవి తండ్రిగా చేస్తే, అతని కొడుకుగా ఒక యువ కథానాయకుడు కూడా నటిస్తున్నాడు, ఇంతకీ అతను ఎవరంటే...

Mega Star Chiranjeevi: ఆ సినిమాలో చిరంజీవి పక్కన రెండో హీరోగా....
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) 'భోళా శంకర్' #BholaaShankar అంతగా విజయం సాధించకపోవడంతో తాను చెయ్యబోయే సినిమాల మీద ఇంకా కొంచెం ఎక్కువ దృష్టి పెట్టారని ఒక టాక్ నడుస్తోంది. 'భోళాశంకర్' విడుదలకి ముందు తాను రెండు సినిమాలు చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు, అందులో ఒకటి 'బింబిసార' #Bimbisara దర్శకుడు వశిష్ట (MalladiVassishta) తో ఒక సినిమా, అలాగే తన కుమార్తె సుష్మిత కొణిదెల (SushmithaKonidela) నిర్మాతగా ఇంకో సినిమా చేయనున్నారని ప్రకటించారు.

అయితే ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో చెయ్యబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలయ్యింది, దీనికి యూవీ క్రెయేషన్స్ (UVCreations) నిర్మాతలు, కాగా తన కుమార్తె తో చెయ్యబోయే సినిమా మాత్రం ప్రకటించారు కానీ, దానికి దర్శకుడు ఎవరనేది వెయ్యలేదు. ముందుగా ఆ సినిమా కళ్యాణ్ కృష్ణ (KalyanKrishna) దర్శకత్వం చేస్తున్నాడు అని ఒక వార్త వచ్చింది. అదే ఖరారు అయింది కూడా. అయితే ఎప్పుడయితే 'భోళాశంకర్' బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిందో ఆ సినిమా కేవలం ఉంటుంది అని మాత్రమే చెపుతున్నారు కానీ, దానికి దర్శకుడు ఎవరు, అందులో ఇంకో కథానాయకుడు ఎవరు అనేది మాత్రం ప్రకటించలేదు.

chiranjeevi-naveenpolishett.jpg

ఆ కథ బెజవాడ ప్రసన్నకుమార్ (BezawadaPrasannaKumar) రాసినది అని, అందులో తండ్రీకొడుకుల పాత్రలుంటాయని, తండ్రిగా చిరంజీవి, కొడుకుగా ముందుగా సిద్ధూ జొన్నలగెడ్డ (SiddhuJonnalagadda) పేరు వినపడింది. కానీ సిద్ధూ వరస సినిమాలతో బిజీ గా ఉండటంతో తప్పుకున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. తర్వాత శర్వానంద్ (Sharwanand) పేరు బయటకి వచ్చింది. అయితే ఇప్పుడు శర్వానంద్ కూడా కాదు, అది ఒక హైపర్ యాక్టివ్ రోల్ కాబట్టి దానికి నవీన్ పొలిశెట్టి (NaveenPolishetty) అయితే బాగుంటుంది అని భావిస్తున్నారు అని కూడా ఒక టాక్ నడుస్తోంది.

నవీన్ ఈమధ్యనే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' #MissShettyMrPoliShetty సినిమాతో మంచి విజయాన్ని అందుకోవటమే కాకుండా, అతని కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుటుంది అని అందరూ ప్రశంసించారు. అదీ కాకుండా ఆ సినిమాకి మొదటి ప్రేక్షకుడు కూడా చిరంజీవి కావటం ఆసక్తికరం, అతను ఆ సినిమాని ఎంతగానో మెచ్చుకోవటమే కాకుండా, నవీన్ నటనని కూడా ప్రశంసించారు. అందుకని చిరంజీవి పక్కన, రెండో కథానాయకుడిగా నవీన్ ని ఎంపిక చేయొచ్చు అని అంటున్నారు. అయితే మరి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఉంటాడా, లేక వేరే అతను దర్శకత్వం చేస్తాడో అనేది చూడాలి.

Updated Date - 2023-09-11T16:59:48+05:30 IST