Nandamuri Balakrishna: నవంబర్ 6 నుండి మొదలు, పెద్ద ఫైట్ తో

ABN , First Publish Date - 2023-10-28T12:14:25+05:30 IST

బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి తో చెయ్యబోయే సినిమా 'NBK109' షూటింగ్ నవంబర్ 6 నుండి, హైదరాబాదులో వేసిన ఒక పెద్ద సెట్ లో పోరాటసన్నివేశంతో మొదలవుతుందని తాజా సమాచారం.

Nandamuri Balakrishna: నవంబర్ 6 నుండి మొదలు, పెద్ద ఫైట్ తో
Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) 'భగవంత్ కేసరి' #BhagavanthKesari సినిమాతో వరసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఈ సినిమా వరసగా మూడో విజయం అతనికి. ఇప్పుడు తన తదుపరి సినిమా దర్శకుడు బాబీ కొల్లి (BobbyKolli) తో చేస్తున్న సగంతి తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ కూడా వెంటనే మొదలు పెడుతున్నట్టుగా తెలిసింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఒక పెద్ద పోరాట సన్నివేశంతో మొదలు పెడుతున్నట్టుగా తాజా సమాచారం. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 6వ తేదీ నుండి హైదరాబాదులో ఒక సెట్ వేసి, అందులో ఈ పోరాట సన్నివేశాన్ని కొన్ని రోజులు చిత్రీకరించనున్నట్టుగా సమాచారం.

balayya-bobby1.jpg

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలవ్వాలి, కానీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాల వలన బాలకృష్ణ అవసరం అక్కడ వుండవలసి వస్తుందని, ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిసింది. దర్శకుడు బాబీ కొల్లి (KSRavindra) ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) 'వాల్తేరు వీరయ్య' #WaltairVeerayya లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలకృష్ణ తో చేస్తున్న సినిమాకి ప్రస్తుతం 'NBK109' అనే టైటిల్ పెట్టారు. ఈ పోరాట సన్నివేశానికి బిహెచ్ఈఎల్ (BHEL) దగ్గర ఒక సెట్ వేసినట్టుగా తెలిసింది.

ఇక్కడ షూటింగ్ అయ్యాక, తరువాత ఊటీ వెళతారని తెలుస్తోంది. ఈ సినిమాని చాలా తొందరగా పూర్తి చెయ్యాలని అటు దర్శకుడు, ఇటు బాలకృష్ణ ఇద్దరూ వున్నారు. సితార ఎంటర్ టైనమెంట్స్ (SitharaEntertainments) ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాలో రాజకీయానికి సంబంధించి ఎటువంటి డైలాగులు కానీ, సన్నివేశాలు కానీ ఉండకపోవచ్చు అని తెలుస్తోంది.

Updated Date - 2023-10-28T12:14:25+05:30 IST