సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Veerasimha Reddy: సెన్సార్ వాళ్ళు ఎలా వదిలేశారు? అందరి మదిలో ఇదే ప్రశ్న!

ABN, First Publish Date - 2023-01-12T19:07:06+05:30

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన సినిమా ‘వీరసింహ రెడ్డి’ (Veera Simha Reddy) చిత్రం సంక్రాంతి (Sankranthi) స్పెషల్‌గా థియేటర్లలోకి..

Veera Simha Reddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన సినిమా ‘వీరసింహ రెడ్డి’ (Veera Simha Reddy) చిత్రం సంక్రాంతి (Sankranthi) స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా చూసి బయటకి వచ్చిన ప్రేక్షకుల మదిలో మెదులుతోన్న ప్రశ్న ఒక్కటే! ఈ సినిమాలో ఇంత హింస వుంది, తలలు ఎగిరి పడిపోతున్నాయి, రక్తం ఏరులా ప్రవహిస్తోంది, అయినా ఈ సినిమాకి పిల్లల్ని ఎలా లోపలి వదిలేశారు. అయితే అక్కడే కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ చూశారు. దాని మీద U/A అని వుంది. అదేంటి? అలా ఎలా ఇస్తారు దీనికి కచ్చితంగా ‘A’ ఇవ్వాలి కదా అన్నారు.

ఈ సినిమాలో హింస ఎంత వుంది అంటే, చాలామంది ఆ తలలు తెగి.. రక్తం ఏరులై పారే సన్నివేశాలు వచ్చినప్పుడు, థియేటర్‌లో పెద్దవాళ్ళు సైతం చూడలేక తలలు దించుకున్నారు. మరి పిల్లలు ఎలా చూస్తారు అటువంటి సన్నివేశాల్ని. సెన్సార్ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు ఇలాంటి సన్నివేశాలు చూపించడానికి. అంటే సెన్సార్ వాళ్ళకి ఈ సన్నివేశాలు చూపించలేదా, లేక చూపించినా, వాళ్ళు చూసి కావాలనే వదిలేసి U/A ఇచ్చారా?. సెన్సార్ బోర్డు అంటూ ఒకటి వున్నది సినిమాలో అతి హింస, అతి శృంగారం.. ఏదీ అతి లేకుండా నిరోధించడానికే కదా. మరి ఈ సినిమాలో అవన్నీ ఎలా వదిలేశారు? అని ప్రేక్షకులు అడుగుతున్నారు. ‘దువ్వాడ జగన్నాధం’ (Duvvada Jagannadham) సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde).. కాస్త గ్లామర్‌గా కనిపించినందుకే సెన్సార్ (Censor) వాళ్లు బ్లర్ చేశారు. అలాగే చాలా సినిమాల్లో బ్లర్ చేయమన్నారు. మరి ఈ ‘వీరసింహా రెడ్డి’ సినిమాకి ఎందుకు సెన్సార్ వాళ్ళు బ్లర్ చెప్పలేదు.

ఇంకా ఇదిలా ఉంటే, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అభిమానుల ఫాలోయింగ్ ఒక్క తెలుగు నటులకు మాత్రమే వుంది. అందుకే వాళ్ళు 60 ఏళ్ళు పైబడినా కూడా బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్ కలెక్షన్స్ బాగుంటాయి. అంతటి ఫాలోయింగ్ వున్న నటులకి కొంచెం సమాజం మీద బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళనే చాలామంది రోల్ మోడల్‌గా చూస్తారు. మరి అటువంటి నటులు కొంతమంది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మహేష్ బాబు (Mahesh Babu) లాంటి వాళ్ళు కొన్ని సినిమాలు చేసాక ఈ సామాజిక బాధ్యత గుర్తు పెట్టుకొని సిగరెట్ తాగటం, మద్యం తాగటం లాంటి సన్నివేశాల్లో నటించటం మానేశారు.

మరి బాలకృష్ణ ఒక మాస్ ఫాలోయింగ్ వున్న నటుడే కాదు, బాధ్యతాయుతమైన ఎం.ఎల్.ఏ (MLA) పదవిలో కూడా వున్నారు, అంటే, ఆ బాధ్యత మరికొంచెం ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి బాలకృష్ణ తన సినిమాలో ఇంత హింస (Violence) ఎలా పెడతారు. సమాజానికి, తన అభిమానులకి ఏమి చెప్పాలని. అతనికి బాధ్యత లేదా?

ఇంకో మాట కూడా వినపడుతోంది పరిశ్రమలో. ఈ సినిమాకి ‘A’ సర్టిఫికెట్ ఇస్తే, ఆంధ్రాలో ఈ సినిమానికి చాలా కఠిన నియమనిబంధనలు అమలు చేస్తారని భయపడి, సెన్సార్ వాళ్ళని వేడుకొని ‘U/A’ ఈ సినిమా నిర్వాహకులు తెచ్చుకున్నారని పరిశ్రమలో వినపడుతోంది. అది ఎంతవరకు నిజమో తెలీదు, కానీ సెన్సార్ బోర్డు (Censor Board) మాత్రం కచ్చితంగా కళ్ళు మూసుకొని సెన్సార్ చేసిందని థియేటర్ నుండి బయటకి వచ్చిన ప్రేక్షకులు అంటున్న మాట.

Updated Date - 2023-01-12T19:51:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!