BholaaShankar: చిరంజీవి మీదే ఆశలు పెట్టుకున్న అనిల్ సుంకర, కానీ టైం బాగోలేదేమో

ABN , First Publish Date - 2023-05-24T12:26:57+05:30 IST

ఈమధ్య కాలంలో ఒక్క హిట్ కూడా లేకపోయినా వరసగా సినిమాలు చేస్తూ వున్న నిర్మాత అనిల్ సుంకర ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న 'భోళా శంకర్' మీదే ఆశలు అన్నీపెట్టుకున్నాడు. ఆమధ్య 'ఏజెంట్' చాలా పెద్ద డిజాస్టర్ అయింది, దానికి ముందు కూడా చాల సినిమాలు నడవలేదు. ఇప్పుడు ఆశలు అన్నీ ఈ రీమేక్ మీదే వున్నాయి, కానీ టైమే బాగోలేదు అంటున్నారు పరిశ్రమలో.

BholaaShankar: చిరంజీవి మీదే ఆశలు పెట్టుకున్న అనిల్ సుంకర, కానీ టైం బాగోలేదేమో
Chiranjeevi from 'Bholaa Shankar' filmfilm

నిర్మాత అనిల్ సుంకరకి (AnilSunkara) టైము అస్సలు కలిసిరావడం లేదనే అంటున్నారు పరిశ్రమలో. ఎందుకంటే ఈమధ్య ఎంతో ఆశలు పెట్టుకొని విడుదల చేసిన 'ఏజెంట్' #Agent సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తుడిచిపెట్టుకుపోయింది. ప్రభాస్ (Prabhas) కి 'బాహుబలి' (Baahubali) ఎలానో, ఈ 'ఏజెంట్' అఖిల్ అక్కినేనికి (AkhilAkkineni) ఆలా అని చెప్పి ఎంతో భారీ బడ్జెట్ తో తీసిన సినిమాకి కనీసం ఆ సినిమా ప్రచారానికి ఖర్చుపెట్టే డబ్బులు కూడా రాలేదు మరి. సురేందర్ రెడ్డి (SurenderReddy) దర్శకుడు ఆ సినిమాకి.

Agent-Akhil.jpg

సినిమా విడుదల అయిన మూడు నాలుగు రోజులకే అనిల్ సుంకర ఆ సినిమాకి ఒక పెద్ద తప్పు జరిగింది, బౌండ్ స్క్రిప్ట్ లేకుండా వెళ్లాం అందుకే ఫెయిల్ అయింది అని దర్శకుడిమీద తోసేసాడు. 'ఏజెంట్' #Agent వదిలేద్దాం, అసలు అనిల్ సుంకర తీసిన సినిమాలు ఈమధ్య ఏమైనా హిట్ అయ్యాయా. దీనికి ముందు 'మహా సముద్రం' #MahaSamudram అని ఒక సినిమా ఇద్దరు లీడ్ యాక్టర్స్ అందులో శర్వానంద్ (Sharwanand), సిద్ధార్థ్ (Siddharth) తో తీశారు. మొదటి రోజు మొదటి షో కె బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడిపోయింది ఆ సినిమా. ఆ సినిమాకి అయితే కనీసం ఒక్క నయాపైసా కూడా రాలేదు, అంత ఘోరంగా విఫలం అయింది.

Mega-1.jpg

దాని ముందు కూడా ఏవో రెండు మూడు సినిమాలు 'చాణక్య', 'బంగారు బుల్లోడు', 'సీత', 'రాజుగాడు', 'కిర్రాక్ పార్టీ', 'లై' ఇలా వరసగా చెప్పుకుంటూ పోతుంటే ఇందులో ఒకటైన పెద్ద హిట్ సినిమా ఉందా అసలు. ప్రతి సారీ ఎక్కడ తప్పు జరిగింది అని పోనీ తరువాత సినిమాకైనా అది సరిదిద్దుకోవటం ఏమైనా ఉందా అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అదీ కాకుండా ఇప్పుడు 'ఏకె ఎంటర్ టైన్ మెంట్స్' అంటేనే డిస్ట్రిబ్యూటర్లకు కొంచెం భయం వేస్తోంది అని కూడా పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

ఇప్పుడు అదే బ్యానర్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న 'భోళా శంకర్' #BholaaShankar కి కూడా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కధ రెండు మూడు సార్లు మార్చారు అని కూడా పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. దీనికి మెహెర్ రమేష్ (MeherRamesh) దర్శకుడు, అతని సినిమా ఏది హిట్ అయిందో ఎవరికీ తెలీదు. అలాగే ఈ సినిమాకి కూడా అనుకున్నదానికంటే చాలా ఎక్కువ బడ్జెట్ అయింది అని కూడా అంటున్నారు. ఇది తమిళ్ సినిమా 'వేదాళం' (Vedhalam) కి రీమేక్. అజిత్ కుమార్ (AjithKumar) తమిళం లో నటించాడు, మరి తెలుగులో ఈ రీమేక్ చూస్తారా. ఎందుకంటే తమిళ సినిమా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు చూసేసారు. అలాగే ఇంతకు ముందు మలయాళం సినిమా 'లూసిఫెర్' (Lucifer) చిరంజీవి 'గాడ్ ఫాదర్' (GodFather) అని తీశారు. మరి ఆ సినిమా ఎంతవరకు ఆడిందో ట్రేడ్ అనలిస్ట్స్ ని అడిగితే తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈ 'భోళాశంకర్' #BholaaShankar సినిమా బిజినెస్ అవుతుందా అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఒకవేళ నడిచినా ఇప్పటికే ఓవర్ బడ్జెట్ అయినా ఈ సినిమా మీద అంత కలెక్షన్స్ వస్తాయా అని పరిశ్రమలో టాక్. ఎందుకంటే అనిల్ సుంకర టైం ఇప్పుడు అసలు బాగోలేదు అని అంటున్నారు పరిశ్రమలో.

Updated Date - 2023-05-24T12:30:18+05:30 IST