Mahesh Babu: 'గుంటూరు కారం' నుండి 'మసాలా బిర్యానీ' పాట లీక్ అయింది, ఎలా ఉందంటే...

ABN , First Publish Date - 2023-11-04T12:12:56+05:30 IST

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' నుండి మొదటి పాట కోసం మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ఆ సినిమాలోంచి ఒక పాట లీక్ అవటం, అది వైరల్ అవటం జరుగుతోంది.

Mahesh Babu: 'గుంటూరు కారం' నుండి 'మసాలా బిర్యానీ' పాట లీక్ అయింది, ఎలా ఉందంటే...
Mahesh Babu still from Guntur Kaaram

మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'గుంటూరు కారం' #GunturKaaram నుండి ఒక పాట లీక్ అయింది. సాంఘీక మాధ్యమంలో ఈ పాటలో ఒక చిన్న బిట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకి థమన్ (SSThaman) సంగీతం సమకూరుస్తున్నాడు. ఎందుకో ఈ సినిమా మొదలైన దగ్గరనుంచీ వార్తల్లో ఉంటూ వస్తోంది. షూటింగ్ చాలాసార్లు పోస్టుపోన్ అవటం, మధ్యలో కథానాయకురాలి మారటం, తరువాత ఛాయాగ్రహకుడు మారిపోవటం, ఇలా ఈ సినిమా వార్తల్లో ఉంటూ వస్తోంది.

మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా నుండి ఎప్పుడు మొదటి పాట విడుదలవుతుందా అని ఎదురుచూస్తూ వున్న సమయంలో ఇందులోంచి ఒక పాట లీక్ అవటం, అందులో ఒక బిట్ వైరల్ అవటంతో మళ్ళీ ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకి సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత, శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary) కథానాయికలు కాగా, ఇందులో రమ్యకృష్ణ (RamyaKrishna), ప్రకాష్ రాజ్ (PrakashRaj), రావు రమేష్ (RaoRamesh), మురళి శర్మ (MuraliSharma) ఇంకా చాలామంది నటులు వున్నారు.

gunturkaram-maheshbabu.jpg

దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు ఈనెల 7వ తేదీన ఈ సినిమా నుండి ఏదైనా ఒకటి విడుదల చెయ్యాలని చిత్ర నిర్వాహకులు అనుకున్నారు, అందులో పాట అయితే బాగుంటుంది అని కూడా అనుకున్నారు. #GunturKaaramFirstSingle ఇంతలోపే ఇలా లీక్ అవటంతో ఈ పాటనే 7వ తేదీన విడుదల చేయొచ్చు అని కూడా ఒక వార్త నడుస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ (AnirudhRavichander) ఈ 'గుంటూరు కారం' లో ఓ పాట పాడాడు. ఇప్పుడు లీక్ అయిన పాట 'మసాలా బిర్యానీ' అనేది అతను పాడిందే. అయితే ఇలా లీక్ అయిన పాట 'మసాలా బిర్యానీ' బావుందని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు.

Updated Date - 2023-11-04T12:12:57+05:30 IST