Mr Pregnant film review: మగవాళ్ళు ప్రెగ్నంట్ అయితే ...

ABN , First Publish Date - 2023-08-18T15:29:53+05:30 IST

ప్రయోగాలు చేస్తూ కొత్త టాలెంట్ ని పరిచయం చేస్తున్న నిర్మాత అప్పిరెడ్డి ఈసారి 'మిస్టర్ ప్రెగ్నంట్' అనే ఇంకో వైవిధ్యం అయిన కథానేపధ్యంతో సినిమా నిర్మించారు. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు, బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ కథానాయకుడు. ఇంతకీ ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Mr Pregnant film review: మగవాళ్ళు ప్రెగ్నంట్ అయితే ...
Mr Pregnant Film Review

సినిమా: మిస్టర్ ప్రెగ్నెంట్

నటీనటులు: సొహెల్ (Sohel), రూపా కొడువయూర్ (RoopaKoduvayur), సుహాసిని మణిరత్నం (SuhasiniManiRatnam), బ్రహ్మాజీ (Brahmajee), వైవా హర్ష (VivaHarsha), రాజా రవీంద్ర (RajaRavindra), అభిషేక్ రెడ్డి (AbhishekReddy) తదితరులు

ఛాయాగ్రహణం: నిజార్ షఫీ

సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ (SravanBharadwaj)

రచన, దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి (SrinivasVinjanampati)

నిర్మాతలు: అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి (AppiReddy)

-- సురేష్ కవిరాయని

'బిగ్ బాస్' (BiggBoss) ఫేమ్ సోహెల్ (Sohel) కి వరసగా చిన్న సినిమాలు వస్తున్నాయి, అలాగే విడుదలవుతున్నాయి కూడా. ఇప్పుడు ఒక వైవిధ్యమైన కథతో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ #MrPregnantFilmReview అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రంగా చెప్పుకోవచ్చు. దీనికి శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు, మామూలుగా ఆడవాళ్లు గర్భం ధరిస్తారు, కానీ ఈ సినిమాలో ఒక మగాడు గర్భం ధరించటం అనే ఒక వైవిధ్యమైన నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. ఆమధ్య 'స్లమ్ డాగ్ హస్బెండ్' #SlumDogHusband అనే చిన్న సినిమాని నిర్మించిన అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

mrpregnant.jpg

Mr Pregnant story కథ:

గౌతమ్ (సొహెల్) ఒక అనాధ, టాటూలు వేసుకుంటూ డబ్బులు గడిస్తూ ఉంటాడు, అలాగే అతను టాటూలు వేసే పోటీల్లో మొదటి స్థానంలో నిలుస్తూ ఉంటాడు. మహి (రూపా కొడువయూర్) గౌతమ్‌ను ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుందాం అంటూ ఉంటుంది, కానీ గౌతం మొదట్లో ఆమెని అంతగా పట్టించుకోడు. గౌతమ్ పిల్లలు వద్దనుకుంటాడు అదే విషయాన్ని మహికి చెప్పి ఆలా అయితేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. అదే విషయాన్ని మహి చాలా సీరియస్‌గా తీసుకుని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధం అవుతుంది. అప్పుడు గౌతమ్ వచ్చి ఆపరేషన్ ఆపి మహికి తన మీద ఎంత ప్రేమ ఉందొ అర్థం చేసుకొని, ఆమెని పెళ్లి చేసుకుంటాను అంటాడు. MrPregnantReview మహి తల్లిదండ్రులు వీరి పెళ్లిని అంగీకరించరు, దానిత్ మహి ఇంట్లో నుంచి వచ్చేసి గౌతమ్‌ను పెళ్లి చేసుకుంటుంది. అసలు పిల్లలు వద్దనుకున్న గౌతమ్ గర్భాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది? అతను అసలు ఎందుకు పిల్లలు వద్దనుకున్నాడు, దాని వెనక ఏమైనా కారణం ఉందా? అలాగే డాక్టర్ వసుధ (సుహాసిని) ఎటువంటి పాత్ర పోషించింది, ఇవన్నీ తెలియాలంటే 'మిస్టర్ ప్రెగ్నంట్' సినిమా చూడాల్సిందే.

mrpregnant1.jpg

విశ్లేషణ:

దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఒక వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. ఎందుకంటే మగవాళ్ళు గర్భం దాల్చటం అనేది మామూలుగా తెలుగు సినిమాలలో రాలేదు. అయితే ఇలాంటి కథను చాలా సున్నితంగా, సరదాగా కూడా చెప్పాలి. లేదంటే వికటిస్తుంది. ఈ 'మిస్టర్ ప్రెగ్నంట్' కథ మొదలవ్వటం మామూలుగానే ఉంటుంది. కథానాయకురాలు అయిన మహి, టాటూలు వేసే గౌతమ్ ని ఇష్టపడుతుంది, అయితే ఎందుకు అంతలా అతని వెంట పడుతుంది అనే విషయం మాత్రం దర్శకుడు వద్దనుకున్నాడేమో చూపించలేదు. తరువాత టాటూ పోటీలు, ఒక విలన్ ఇవన్నీ కొంచెం సిల్లీ గా ఉంటాయి, అలాగే వైవా హర్ష హాస్య సన్నివేశాలు కూడా అంతగా పండకపోయినా ఎదో ఆలా నడిపించాడు దర్శకుడు. MrPregnantFilmReview

ఎప్పుడయితే మహి, గౌతమ్ పెళ్లి చేసుకొంటారో అప్పటి నుండి కథ కొంచెం సీరియస్ గా మారుతుంది. ఇక అక్కడ నుండి భావోద్వేగాలతో నడుస్తుంది. మహికి వచ్చే గర్భం తాను ఎందుకు దాల్చవలసి వచ్చింది, అది బయట వాళ్ళకి తెలియకుండా దాచుకోవటం ఇవన్నీ దర్శకుడు బాగానే చూపించాడు. అలాగే రెండో సగంలో బ్రహ్మాజీ ఎపిసోడ్ మొత్తం హిలేరియస్ గా వుంది, థియేటర్ లో నవ్వులు కురిపిస్తుంది. ఇది అసలు సినిమా అంతటికీ హైలైట్ గా నిలవటం, అలాగే క్లైమాక్స్, దాని ముందు వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలతో కూడినవై ఉండటం ఇవన్నీ దర్శకుడు బాగానే కథ మీద పట్టు సాధించాడు అని చెప్పాలి. ఎందుకంటే ఊరికే మగవాడు గర్భం దాల్చాడు అంటే ప్రేక్షకులకి ఏదోలా ఉంటుంది, కానీ ఈ సినిమాలో దర్శకుడు అది చూపించే విధానం ఆసక్తికరంగానే ఉండేట్టు చేసాడు. అలాగే మగవాడు గర్భం దాలిస్తే వచ్చే పబ్లిక్ రియాక్షన్, దానికి కథానాయకుడు చెప్పే సమాధానం ఇవన్నీ కూడా బాగా పండుతాయి. మొత్తం మీద మొదటి సగం సినిమా ఏదోలా నడిచినా, సినిమా అంతా రెండో సగంలో వుంది, దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఒక వైవిధ్యమైన కథ చెప్పడంలో సఫలీకృతుడు అయ్యాడనే చెప్పాలి. ఛాయాగ్రహణం బాగుంది, నేపధ్య సంగీతం బాగుంది.

mrpregnant2.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే సోహెల్ గౌతమ్ పాత్ర చాలా బాగా చేసాడు. అతని కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది, ఇటువంటి సమయంలో అతనికి ఇలా నటించడానికి అవకాశం వున్న పాత్ర రావటం, అతను దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని బాగా చేసి చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు, దాని ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి భావోద్వేగాలను పలికించాడు. అతనికిది మంచి సినిమా అవుతుంది అనటంలో సందేహం లేదు. #MrPregnantFilmReview అలాగే రూపా కొడువయూర్ ఇంకో తెలుగమ్మాయి మహి పాత్రలో బాగా చేసింది. ఏదో కథానాయకురాలిగా రెండు పాటలు, మూడు సన్నివేశాలు అని కాకుండా ఒక మంచి నటనకి ఆస్కారం వుండే పాత్రలో ఆమె మంచి అభినయాన్ని చేసి చూపించింది. ఆమెకి మంచి భవిష్యత్తు ఉందనే చెప్పాలి. MrPregnantReview అలాగే రెండో సగంలో బ్రహ్మాజీ చించేసాడు తన హాస్యంతో. అసలు బ్రహ్మాజీ ఎపిసోడ్ రెండో సగంలో హైలైట్ అయింది. ఆ ఎపిసోడ్ కనక లేకపోతే సినిమా చూడటం కూడా కష్టమే. అది ఒక రిలీఫ్ లా వుంది. సూపర్ ఫన్. బ్రహ్మాజీ చిన్నగా కనపడినా, చాలా పెద్ద ఇంపాక్ట్ ఇచ్చారు. వైవా హర్ష పాత్ర రెండో సగంలో బాగుంటుంది. అలాగే రాజా రవీంద్ర కూడా బాగా చేసాడు. డాక్టర్ గా సుహాసిని చెయ్యడం ఈ సినిమాకి ఒక గౌరవంలా ఉంటుంది. ఆమె చాలా హుందాగా నటించింది, మెప్పించింది. (Mr Pregnant Film Review)

చివరగా, 'మిస్టర్ ప్రెగ్నంట్' అనే సినిమాని దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి మొదటి సగం కొంచెం సాదా సీదాగా వున్నా, రెండో సగం మాత్రం చాలా భావోద్వేగాలతో కట్టి పడేసాడు. సోహెల్, రూపాల నటన, బ్రహ్మాజీ హాస్య సన్నివేశం ఆకట్టుకుంటుంది. కొంచెం వైవిద్యం కావాలనుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

Updated Date - 2023-08-18T15:30:29+05:30 IST