Sapta Sagaralu Dhaati Side B movie review: సప్త శోకాలు దాటి, సాగదీసి...

ABN , First Publish Date - 2023-11-17T14:18:58+05:30 IST

రక్షిత్ శెట్టి నటించి, నిర్మించిన 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది రెండో భాగం, ఈ సినిమా ఎలా వుందో చదవండి

Sapta Sagaralu Dhaati Side B movie review: సప్త శోకాలు దాటి, సాగదీసి...
Sapta Sagaralu Dhaati Side B movie review

సినిమా: సప్త సాగరాలు దాటి సైడ్ బి

నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, చైత్ర అచార్, అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిర తదితరులు

ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి

సంగీతం: చరణ్ రాజ్ (CharanRaj)

నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వప్రసాద్!

రచన, దర్శకత్వం: హేమంత్ ఎం రావు (Hemanth M Rao)

విడుదల తేదీ: నవంబర్ 17, 2023

రేటింగ్: 2 (రెండు)

-- సురేష్ కవిరాయని

ఈమధ్య పరభాషా సినిమాలు తెలుగులో ఎక్కువగా విడుదలవుతున్నాయి, అందులో ఒకటి ఈ 'సప్తసాగరాలు దాటి సైడ్ బి'. రక్షిత్ శెట్టి (RakshithShetty) కథానాయకుడు, రుక్మిణి వసంత్ (RukminiVasanth), చైత్ర (ChaithraAchar) కథానాయికలు. ఈ సినిమా ఇంతకు ముందు విడుదలైన 'సప్తసాగరాలు దాటి సైడ్ ఎ' #SaptaSagaraluDhaatiSideBReview రెండో భాగంగా వచ్చిన సినిమా ఇది. కన్నడ సినిమా ఇది, కన్నడంతో పాటుగా తెలుగులో కూడా ఈరోజే విడుదలైంది. (Sapta Sagaralu Dhaati Side B movie review)

Sapta Sagaralu Dhaati Side B story కథ:

మొదటి భాగంలో మను (రక్షిత్ శెట్టి) తను చెయ్యని నేరానికి జైలులోనే ఉండిపోతాడు. అతని ప్రియురాలు ప్రియ (రుక్మిణి వసంత్) జైలుకు తరచూ వస్తూ అతన్ని కలిసేది, రాను రాను ఆమెకూడా జైలుకి రాదు. ఇప్పడు రెండో భాగంలో అంటే కొన్నేళ్ల తరువాత మను జైలు నుండి బయటకి వస్తాడు. ప్రియ వివాహం చేసుకొని, భర్త, పిల్లవాడితో ఎక్కడో ఒక మారుమూల చిన్న ఇంట్లో జీవనం సాగిస్తూ ఉంటుంది. మను స్నేహితుడు ప్రియ ని మర్చిపోయి, వేరే జీవితం మొదలెట్టు అని సలహా ఇస్తాడు. ఆ క్రమంలోనే వేశ్య అయిన సురభి (చైత్ర) తో పరిచయం అవుతుంది. కానీ ప్రియని మర్చిపోలేకపోతాడు, ఎలా వుందో చూడాలని అనుకుంటాడు, సురభి సహాయంతో చూస్తాడు. ఆమె సంతోషంగా లేదని గ్రహిస్తాడు, ఆమె పేదతనంతో జీవిస్తోంది, భర్త కూడా తాగుబోతు అని తెలుసుకుంటాడు. ప్రియ తమ్ముడిని కలుసుకుంటాడు. ప్రియా పాటలు పాడటం ఆపేసింది అని కూడా తెలుసుకుంటాడు. ప్రియకి సహాయం చెయ్యాలని అనుకుంటాడు. మను, ప్రియలు కలిసారా, ప్రియకి ఎటువంటి సహాయం చేసాడు, మను పాత పగలు మర్చిపోయాడా, తనని జైలుకు పంపిన వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడా? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. #SaptaSagaraluDhaatiSideBReview

విశ్లేషణ:

దర్శకుడు హేమంత్ రావు రెండో భాగంలో ఏదైనా కొత్తదనం చూపిస్తాడేమో అని అనుకుంటే ఏమీ ఉండదు. ప్రేక్షకులకి తీవ్ర నిరాశకు గురి చేస్తాడు. సప్త సాగరాలు దాటి అని కాకుండా సప్త సాగరాలు సాగదీసి అన్నట్టుగా కథ నడుస్తుంది. అసలు ఒక సమయంలో ప్రేక్షకుడు ఈ రెండో భాగం మొదటి సగం మిస్ అయినా కూడా రెండో సగం నుండి చూడొచ్చు. అంటే మొదటి సగంలో కథ పూర్తిగా నత్తనడక సాగుతుంది. కథానాయకుడు అయిన మను ఎంతసేపు ప్రియ చెప్పిన మాటల కేసెట్ పెట్టుకొని వినటం, ప్రియని దూరంగా చూడటం ఇవే ఎక్కువ సాగుతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా తీయడమే పెద్ద తప్పిదమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆసక్తికరమైన కథ వుండి రెండు భాగాలుగా తీయ్యడంలో అర్థం వుంది. మొదటి భాగంలో సాగదీత వున్నా అదే బాగుంటుంది, కానీ రెండో భాగం కోసం ఆ సాగదీత దర్శకుడు పెట్టాడు అనిపిస్తుంది. పోనీ రెండు భాగంలో ఏదైనా విషయం వుంది అనుకుంటే, ఏమీ ఉండదు. సన్నివేశాలను కేవలం సాగదీసి రెనో భాగం చూపించాలి అని అనుకోని మాత్రమే తీసినట్టుగా ఉంటుంది.

రక్షిత్ శెట్టి, చైత్ర ల మధ్య వచ్చే సన్నివేశాలు, అలాగే ప్రియ భర్తని కలిసినప్పుడు కొన్ని సన్నివేశాలు బాగుంటాయి. మిగతా సినిమా అంతా సాగదీతగా ఉంటుంది. జైలు నుంచి బయటకి వచ్చాక, తన ప్రియురాలికి వివాహం అయి, పిల్లవాడు వున్నాడు అని తెలిసి, ఆమెకి సహాయం చేద్దామని అనుకుంటాడు, అంతవరకు బాగానే వుంది కానీ, ఆమెనే ఊహించుకుంటూ, ఆమె మీద ఇంకా ప్రేమని చంపుకోలేకపోవటం ఇవన్నీ కొంచెం అసహజత్వంగా ఉంటుంది. మొదటి భాగం కన్నా ఈ రెండో భాగం చాలా స్లో గా వుండి, పాటలు, నేపధ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోవు. క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదు. #SaptaSagaraluDhaatiSideBReview

ఇక నటీనటుల విషయానికి వస్తే రక్షిత్ శెట్టి రూపురేఖలు మారుతాయి ఇందులో. కొంచెం రఫ్ గా కనిపిస్తాడు, భావోద్వేగాలు బాగున్నాయి. రెండో భాగంలో హైలైట్ మాత్రం చైత్ర అనే చెప్పాలి. ఆమె చాలా బాగా చేసింది, ఆమె పాత్ర డిజైన్ కూడా బాగా చేసాడు దర్శకుడు. ఇక రుక్మిణి వసంత్ పాత్ర పెద్దగా ఉండదు, గృహిణిగా కనిపిస్తుంది, అందులో మెచూరిటీ చూపించింది. మిగతా పాత్రల్లో అందరూ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. #SaptaSagaraluDhaatiSideBReview

చివరగా, ఈ 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' లో విషయం లేదు, సాగదీత ఎక్కువుంది. చైత్ర పాత్ర మాత్రం చాలా బాగుంటుంది, రక్షిత్ శెట్టి లుక్స్ లో తేడా కనిపిస్తుంది అంతే. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తప్పితే సినిమా బోర్ గా అనిపిస్తుంది. ఓటిటి లోకి త్వరగానే వచ్చేస్తుంది, అక్కడ చూసుకోవచ్చు. #SaptaSagaraluDhaatiSideBReview

Updated Date - 2023-11-17T14:18:59+05:30 IST