Keedaa Cola film review: తరుణ్ భాస్కర్ క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే...

ABN , First Publish Date - 2023-11-03T16:42:09+05:30 IST

దాదాపు ఐదు సంవత్సరాల తరువాత దర్శకుడు తరుణ్ భాస్కర్ 'కీడా కోలా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది ఒక క్రైమ్ కామెడీ. ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Keedaa Cola film review: తరుణ్ భాస్కర్ క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే...
Keedaa Cola movie review

సినిమా: కీడా కోలా

నటీనటులు: తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, జీవన్ కుమార్, రవీంద్ర విజయ్, విష్ణు తదితరులు

సంగీతం: వివేక్ సాగర్ (VivekSagar)

ఛాయాగ్రహణం: ఎ జె ఆరోన్ (AJAaron)

నిర్మాతలు: సాయి కృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్, నందిరాజ్

రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్ దాస్యం (TharunBhasckerDhaassyam)

విడుదల తేదీ: 3-11-2023

రేటింగ్: 3 (మూడు)

-- సురేష్ కవిరాయని

'పెళ్లి చూపులు' #PelliChoopulu, 'ఈ నగరానికి ఏమైంది' #EeNagaranikiEmaindi సినిమాలు దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కి (TharunBhascker) మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ ఆ తరువాత అతను ఎక్కువగా నటుడిగా చాల సినిమాల్లో కనిపించాడు. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత 'కీడాకోలా' (Keedaa Cola movie review) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది ఒక క్రైమ్ కామెడీ అని విడుదలకి ముందు చెప్పాడు. దర్శకుడిగానే కాకుండా, ఇందులో ఒక ముఖ్య పాత్ర కూడా పోషించాడు తరుణ్ భాస్కర్. దగ్గుబాటి రానా (RanaDaggubati) ఈ సినిమాని సమర్పించడం ఆసక్తికరం. ఇందులో జీవన్ కుమార్, బ్రహ్మానందం (Brahmanandam), రవీంద్ర విజయ్, రఘు నటించారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. #KeedaaColaReview

tharunbhascker3.jpg

Keedaa Cola story కథ:

వాస్తు (చైతన్య రావు) కి అంగవైకల్యం, అదే కొంచెం నత్తి ఉంటుంది, చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, తాతయ్య వరదరాజు (బ్రహ్మానందం) అతన్ని పెంచి పెద్ద చేస్తాడు. వాస్తు షాపులో పని చేస్తూ ఉంటాడు, అయితే ఒక చైనా బొమ్మ విషయంలో కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వమని ఆ షాపు యజమాని వాస్తు మీద కోర్టులో కేసు వేస్తాడు. వాస్తు స్నేహితుడు ఒక లాయర్ (రాగ్ మయూర్), వాస్తు తరపున ఈ కేసును వాదిస్తాడు. వాస్తు, అతని స్నేహితుడు లాయర్ డబ్బులు సంపాదించడానికి మార్గాలు వెతుకుతూ ఉంటే 'కీడా కోలా' అనే కూల్ డ్రింక్ లో బొద్దింక (కాక్రోచ్) కనపడుతుంది. #KeedaaColaReview లాయర్, కీడాకోలా తయారు చేసిన కంపెనీ మీద దావా వేసి కోట్ల రూపాయలు రాబట్టవచ్చు అని పథకం వేస్తాడు. భక్త నాయుడు (తరుణ్ భాస్కర్) 20 ఏళ్ళ తర్వాత జైలు నుంచి బయటకు వస్తాడు. అతని తమ్ముడు జీవన్ (జీవన్ కుమార్) కార్పొరేటర్ కావాలని అనుకుంటాడు, దానికి డబ్బు కావాలి, భక్తని సహాయం చెయ్యమంటాడు. ఆ అన్నదమ్ములు ఇద్దరూ చివరికి ఒక పథకం ఆలోచిస్తారు. అందరూ ఈ బొద్దింక పడిన కీడాకోలా సీసా దగ్గరే ఆగిపోతారు. ఇంతకీ భక్త, జీవన్ కి కీడా కోలా బాటిల్ కి సంబంధం ఏంటి? కీడాకోలా కంపెనీ సీఈవో (రవీందర్ విజయ్), అతని దగ్గర పనిచేసే షాట్స్ ('రోడీస్' రఘురామ్) ఈ బాటిల్ కోసం ఏం చేశారు? చైనీస్ బొమ్మ కథ ఏంటి? అందరి ప్రయత్నం ఎంతవరకు ఫలించింది చివరికి ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. #KeedaaColaMovieReview

KeedaacolaReview2.jpg

విశ్లేషణ:

తరుణ్ భాస్కర్ సుమారు ఐదు సంవత్సరాల తరువాత ఈ 'కీడా కోలా' సినిమాతో వచ్చాడు. విడుదలకి ముందు చెప్పిన ప్రకారం అతను ఈ సినిమాని ఒక క్రైమ్ కామెడీగా రూపొందించాడు. అతను ముందు చేసిన రెండు సినిమాలకి దీనికి అస్సలు సంబంధం ఉండకుండా, వేరే జానర్ ని ఎంచుకున్నాడు. కేవలం నవ్వించడమే ప్రధానంగా పెట్టుకొని ఈ సినిమా చేసాడు, అందులో అతను సఫలం అయ్యాడనే చెప్పాలి. ఇంతకు ముందు 'జాతిరత్నాలు' #JaathiRatnalu అనే సినిమా ఎలా అయితే లాజిక్స్ లేకుండా కేవలం హాస్యమే ప్రధానంగా వచ్చిందో ఈ 'కీడా కోలా' కూడా అంతే అని చెప్పాలి.

ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సినిమాలో కథానాయకురాలు (ఫిమేల్ లీడ్) కనిపించదు. అంటే కథకి అవసరం అయిన పాత్రలు మాత్రమే ఉంటాయి. లాయరు డబ్బు కోసం బొద్దింక వున్న కూల్ డ్రింక్ బాటిల్ కీడాకోలా ని చూడటంతో అసలు కథ మొదలవుతుంది. జీవన్ ని కార్పొరేటర్ చిన్నబుచ్చటం, జీవన్ అన్న భక్త నాయుడు జైలు నుంచి బయటకి రావటంతో కథ ఇంకా ఆసక్తికరంగా సాగుతుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఒక్కో పాత్రని వైవిధ్యంగా చూపిస్తూ కథని వినోదాత్మకంగా నడిపాడు. గంట సేపు ఇంగ్లీష్ మాట్లాడాలని, అలాగే భక్త గ్యాంగ్, వాస్తు గ్యాంగ్ ముఖాముఖీ కలుసుకోవటం లాంటి సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే కోలా కంపెనీ యజమాని, భక్త గ్యాంగ్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా నవ్విస్తాయి.

KeedaacolaReview3.jpg

రెండో సగంలో కీడా కోలా యజమాని బొద్దింక వున్న బాటిల్ ని సొంతం చేసుకోవడానికి షాట్స్ ని రంగంలోకి దించటం, అలాగే ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా చేస్తున్న హీరో గా గెటప్ శీను వచ్చే సన్నివేశాలు కూడా నవ్విస్తాయి. షాట్స్ షూటర్లు ని రంగంలోకి దించటం, వాళ్ళకి భక్త గ్యాంగ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. #KeedaaColaReview దర్శకుడు తరుణ్ భాస్కర్ నటీనటులతో వైవిధ్యంగా నటింపచేసాడు. అలాగే బ్రహ్మానందం కుర్చీకే పరిమితమైనా అతనికి ఇందులో ఒక విచిత్రమైన పాత్ర ఇచ్చి అతని చేత కూడా నవ్వించాడు. తరుణ్ నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకొని చేసిన సినిమా ఇది, అందులో అతను సఫలం అయ్యాడనే చెప్పాలి. కథ ఏమి జరుగుతూ ఉంటుందో తెలిసిపోతూ ఉంటుంది, కానీ వినోదాత్మకంగా ఉంటుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ నాయుడు పాత్రలో బాగా రాణించాడు. అతను తెర మీదకి వచ్చిన దగ్గరనుంచి ప్రేక్షకుల్లో ఉత్సాహం వస్తూ ఉంటుంది. వెయ్యికి పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందంకి ఈ సినిమాలో ఇంతవరకు చెయ్యని పాత్ర వరదరాజులు పాత్ర. చిన్న పాత్రే కానీ, మొదటి నుండి చివరకు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో నవ్విస్తాడు కూడా. జీవన్ కి మంచి పాత్ర లభించింది, అతను బాగా సద్వినియోగం చేసుకున్నాడు. చైతన్య రావు అంగవైకల్యం వున్న వ్యక్తిగా బాగా చేసాడు, కొన్ని మాటల ముందు నత్తి పలుకుతూ నవ్విస్తూ ఉంటాడు. ఇక రాగ్ మయూర్, రవీంద్ర, విష్ణు, రఘు అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు, నవ్వించారు కూడా. వివేక్ సాగర్ ఈ సినిమాకి సగం బలం అనే చెప్పాలి. ఎందుకంటే అతని నేపధ్య సంగీతం సినిమాకి ఆయువు పట్టు అయింది. అలాగే ఛాయాగ్రహణం కూడా బాగుంది. మాటలు బాగున్నాయి, నవ్వు తెప్పిస్తూ ఉంటాయి, పంచ్ లు కూడా.

చివరగా, తరుణ్ భాస్కర్ రచించి, దర్శకత్వం వహించి, నటించిన 'కీడాకోలా' వినోదాత్మకమైన సినిమా. అందరినీ నవ్విస్తుంది. కథ ఏమి జరుగుతుందో ముందుగా తెలిసిపోతున్నా, కథ అంత బలంగా లేకపోయినా, నవ్వించడమే ప్రధాన ఉద్దేశంతో తీసిన సినిమా కాబట్టి, సరదాగా ఒకసారి చూడొచ్చు. #KeedaaColaReview

Updated Date - 2023-11-03T16:42:11+05:30 IST