Takkar Film Review: ప్రేక్షకులకు ఒకటే బాదుడు.. ఈ 'టక్కర్' ని అస్సలు భరించలేం !

ABN , First Publish Date - 2023-06-09T13:52:57+05:30 IST

తెలుగులో చాలా మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయిన నటుడు సిద్ధార్థ్, ఎందుకో తెలుగుకి దూరం అయి, తమిళ పరిశ్రమలో సెటిల్ అయ్యాడు. మళ్ళీ ఈమధ్య తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుదామని అనుకున్నాడేమో 'మహాసముద్రం' అని ఒక ఫ్లాప్ తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు అనువాద సినిమా 'టక్కర్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Takkar Film Review: ప్రేక్షకులకు ఒకటే బాదుడు.. ఈ 'టక్కర్' ని అస్సలు భరించలేం !
Takkar Film Review

నటీనటులు: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), అభిమన్యు సింగ్, మునీష్ కాంత్, యోగి బాబు తదితరులు

సంగీతం: నివాస్ కె ప్రసన్న

ఛాయాగ్రహణం: వాంచినాథన్ మురుగేశన్

నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్

రచన, దర్శకత్వం: కార్తీక్ జి క్రిష్

-- సురేష్ కవిరాయని

అప్పుడెప్పుడో తమిళ సినిమాలు చేస్తున్న సిద్దార్థ్ (Actor Siddharth) తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' #Nuvvostanante Nenoddantana తో పరిచయం అయ్యాడు. అది చాలా పెద్ద హిట్ అయింది, ఆ తరువాత తెలుగులోనే సెటిల్ అయిపోతాను అన్నాడు, తెలుగు సినిమాలు చేసాడు, ఇక్కడ తట్టుకోలేకపోయాడేమో, మళ్ళీ తమిళ పరిశ్రమకి వెళ్ళిపోయాడు. #TakkarFilmReview ఈమధ్యనే చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ తెలుగులో కనపడుతున్నాడు. ఇంతకు ముందు తెలుగు సినిమా 'మహా సముద్రం' (MahaSamudram) శర్వానంద్ (Sharwanand) తో కలిసి చేసాడు, కానీ అది డిజాస్టర్ అయింది. ఇప్పుడు అతను చేసిన తమిళ సినిమా ఒకటి 'టక్కర్' (TakkarFilmReview) అనే పేరుతో తెలుగులో విడుదల అయింది. తెలుగులో కూడా అతనికి ప్రేక్షకులు వున్నారు కాబట్టి, తెలుగులోనూ బాగానే ప్రచారం చేసాడు. 'మజిలీ' (Majili) లో నటించిన దివ్యాంశ కౌశిక్ (DivyanshaKaushik) కథానాయకురాలిగా నటించింది. ఇంతకీ ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

takkar5.jpg

Takkar Film Story కథ:

గుణ లేదా గుణశేఖర్ (సిద్ధార్థ్) ఒక పేద కుటుంబంలో పుట్టి, జీవనోపాధికి చాలా పనులు చేస్తూ ఉంటాడు, కానీ ఎవరూ అతనికి గౌరవం ఇవ్వరు. గౌరవంగా బతకాలంటే డబ్బు సంపాదించాలి అనుకుంటాడు, అందుకు విశాఖపట్నంలో మామూలు క్యాబ్ కి కాకుండా బెంజ్ కారు క్యాబ్ డ్రైవర్ గా ఉద్యోగం ప్రారంభిస్తాడు. అదే సిటీలో రాజ్ (అభిమన్యు సింగ్) (AbhimanyuSingh) అని ఒక మాఫియా క్రిమినల్ ఉంటాడు, అతను అమ్మాయిలను కిడ్నాప్ చేసి, డబ్బున్న వాళ్లకు అమ్మేయడం లాంటివి, అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర డబ్బు గుంజడం లాంటివి చేస్తూ ఉంటాడు. గుణ ఒకసారి లక్కీ లేదా మహాలక్ష్మి (దివ్యాంశ కౌశిక్) #TakkarFilmReview ని పిక్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఆమెని చూసి పెళ్లి చేసుకుంటే అలాంటివాళ్లనే చేసుకోవాలి అనుకుంటాడు. ఇంకోసారి రాజ్ గ్యాంగ్ వాళ్ళని ఎక్కించుకొని గొడవపడి వాళ్ళతో బాగా తన్నులు తింటాడు. అమ్మాయిల వేటలో రాజ్ గ్యాంగ్ లక్కీని కిడ్నాప్ చేసి ఆమె తండ్రికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇదిలా ఉండగా తన్నులు తిన్న గుణ చచ్చిపోవాలని అనుకుంటాడు, కానీ దానికి కూడా ధైర్యం చాలదు. రాజ్ గ్యాంగ్ వాళ్ళ చేతుల్లో చచ్చిపోవాలని అనుకొని వాళ్ళ ప్లేస్ కి వెళ్లి వాళ్ళతో గొడవపడతాడు. వాళ్ళు అతన్ని చితక్కొడతారు, కానీ అప్పుడు ఇంతకు ముందు గుణతో గొడవపడిన ఆ ఇద్దరు గ్యాంగ్ సభ్యులు కూడా అందులో వుంటారు. వాళ్ళని చూడగానే గుణకి పిచ్చికోపం వచ్చి ఆ గ్యాంగ్ మీద తిరగబడి వాళ్ళని చితకబాది, వాళ్ళ కారుని తీసుకుపోతాడు. ఆలా వెళ్లిన కారు డిక్కీలో చప్పుడవుతుంది? ఎవరా కారులో వున్నది? ఆ గ్యాంగ్ కి, గుణకి మధ్య ఏమి జరిగింది, కిడ్నాప్ అయిన లక్కీ ఎలా సేవ్ అయింది? లక్కీని వాళ్ళ నాన్న వేరే వాళ్ళకి ఇచ్చి ఎందుకు చేయాలనుకుంటాడు? ఇంతకీ గుణ డబ్బు సంపాదించాడా? ఇవన్నీ తెలియాలంటే 'టక్కర్' చూడాల్సిందే !

takkar3.jpg

విశ్లేషణ:

సిద్ధార్థ్ (Siddharth) మంచి నటుడు అని ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. అతని సినిమాలు తెలుగులో చాలా బాగా ఆడాయి, అందులో 'బొమ్మరిల్లు' #Bommarillu ఒకటి. అలాగే ఆ తరువాత తమిళ పరిశ్రమకి వెళ్లినా అక్కడ కూడా కొన్ని మంచి సినిమాలు చేసాడు, కానీ ఎందుకో ఈమధ్య సిద్ధార్థ్ ఎన్నుకునే సినిమాలు అంతగా ఆడటం లేదు. అతను సెలక్షన్ లో ఎక్కడో చిన్న తప్పిదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా సంవత్సరాల తరువాత తెలుగులో రీ ఎంట్రీ 'మహాసముద్రం' #MahaSamudram సినిమాతో ఇచ్చాడు. ఇందులో శర్వానంద్ కూడా ఇంకో కథానాయకుడు, కానీ సినిమా ఒక్కరోజు కూడా ఆడకుండానే వెళ్ళిపోయింది. అంత డిజాస్టర్ అయింది. మళ్ళీ ఇప్పుడు 'టక్కర్' #TakkarFilmReview అనే అనువాద సినిమాతో తెలుగులో మళ్ళీ వచ్చాడు. దీనికి దర్శకుడు కార్తీక్ జి క్రిష్. మామూలుగా అయితే సిద్ధార్థ్ సినిమాలు కొంచెం సెన్సిబుల్ గా ఉంటాయి అని ప్రేక్షకుల్లో చిన్న అంచనా ఉంటుంది. కానీ ఈ 'టక్కర్' సినిమాతో ఆ అంచనాలు పటా పంచలయిపోయాయి.

దర్శకుడికి తానేమి చెప్పదలచుకున్నాడో, ఏమి చెపుతున్నాడో, అసలు కథ ఏమైనా ఉందా, ఉంటే అది ఆసక్తికరంగా ప్రేక్షకుడికి చూపించాలి అని అనిపించాలి కదా. ఇవేమీ ఈ సినిమాలో లేవు. మొదటి నుండి చివరి వరకు సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ప్రేక్షకుడు చాలా చిరాకుగా చూస్తూ ఉంటాడు. చాలామంది అయితే భరించలేక మధ్యలోనే వెళ్లిపోయారు. అసలు ఈ 'టక్కర్' టైటిల్ కి కథకి ఏమైనా సంబంధం ఉందా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. తాను పెద్ద తెలివితేటలు వున్నవాడిగా అనుకునే సిద్ధార్థ్ ఎలా ఈ కథని ఒప్పుకున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్క సన్నివేశం కూడా ఆసక్తికరంగా ఉండదు, అనిపించదు.

takkar2.jpg

కథ, కథనం అన్నీతప్పు దారిలోనే వెళ్లాయి. దర్శకుడు ఆలోచన ఒక్కో సన్నివేశం తరువాత మారిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది యాక్షన్ సినిమాగా చేద్దాం అనుకున్నాడో లేక కామెడీ సినిమాగా చేద్దామంటూ అనుకున్నాడో, ఈ రెండూ కాకపోతే, రెండో రొమాంటిక్ సినిమా చేద్దాం అనుకున్నాడో, ఏమో మరి దర్శకుడు తను కన్ఫ్యూజ్ అయి, ప్రేక్షకులకు కూడా అదే చూపించాడు. ఆ యోగిబాబు పాత్ర అయితే చిరాకు తెప్పించేటట్టు చేసాడు. అలాగే మాఫియా డాన్ అంటాడు, వాడితో కామెడీ అది ఇంకో చిరాకు, సినిమా అంతా ఇంతే, అసలు ఈ సినిమా కథ ఏంటి, ఏమి చెయ్యాలనుకున్నాడు అన్నది ఆ దర్శకుడికే తెలియాలి, చేసిన సిద్ధార్థ్ కే తెలియాలి. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. పోరాట సన్నివేశాలు బాగున్నాయి అంతే.

takkar1.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, సిద్ధార్థ్ పరవాలేదు అనిపించాడు కానీ అతని పాత్ర బలమైనది కాదు. ఈ సినిమాలో అతను పోరాట సన్నివేశాలు చేసాడు, అది కొత్త అతనికి. అంతే. దివ్యాంశ కౌశిక్ బాగుంది, తన పాత్రకు తగ్గట్టుగా బాగా చేసింది. ఈ సినిమాలో ఏదైనా బాగుంది అంటే, ఆమె పాత్ర ఒక్కటే. ఆమె చాలా గ్లామరస్ గా కూడా వుంది. యోగిబాబు పాత్ర వేస్ట్, అభిమన్యు సింగ్ ఎన్ని సినిమాల్లో విలన్ గా కనిపించలేదు, ఇందులోనూ అంతే. అతని మొహం లో ఎటువంటి భావాలు వుండవు. డబ్బింగ్ చెప్పే వాయిస్ మాత్రం గట్టిగా వినపడుతూ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు అందరూ కూడా అంతే. పాటలు ఒకే, అలాగే నేపధ్య సంగీతం కూడా ఒకే గా వుంది.

చివరగా, ఈ 'టక్కర్' సినిమాతో మళ్ళీ తెలుగులోకి వద్దామని అనుకున్న సిద్ధార్థ్ కి ఈ సినిమా నిరాశ పరిచింది అనే చెప్పాలి. ఇంతకు ముందు సిద్ధార్థ్ చాలా ఫ్లాప్ సినిమాలు చేసాడు, కానీ ఈ సినిమాతో అంతని మీద వున్న గౌరవం ప్రేక్షకులకి తగ్గిపోతుంది అనే చెప్పాలి. ఎందుకంటే అంత బాదుడు బాదాడు ఈ సినిమాతో. ప్రేక్షకుడు సహనాన్ని పరీక్షించే సినిమా ఇది. దానికితోడు నేరేషన్ స్లో గా ఉంటుంది. ఈమధ్య పెద్ద సినిమాలు కూడా తొందరగానే వచ్చేస్తున్నాయి ఓటిటి లోకి, ఇది కూడా వచ్చేస్తుంది, వెయిట్ చెయ్యండి.

Updated Date - 2023-06-09T13:52:57+05:30 IST