Shiva Vedha film reivew: ఇదొక యాక్షన్ డ్రామా

ABN , First Publish Date - 2023-02-09T16:49:14+05:30 IST

కన్నడ లెజెండరీ నటుడు దివంగత రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar) కన్నడం లో బాగా పేరున్న కథానాయకుడు. అతను నటించిన 125వ సినిమా 'వేద' (Vedha) కన్నడంలో గత ఏడాది డిసెంబర్ 23న విడుదలైంది. అదే సినిమాని శివవేద (Shiv Vedha) అనే పేరుతో తెలుగులో ఈరోజు, అంటే ఫిబ్రవరి 9 న విడుదల చేశారు.

Shiva Vedha film reivew: ఇదొక యాక్షన్ డ్రామా

Cinema: శివ వేద

నటీనటులు: శివరాజ్ కుమార్, గానవి, భరత్ సాగర్, శ్వేతా చంగప్ప, ఉమాశ్రీ, వీణా పొన్నప్ప, అదితి సాగర్ తదితరులు

ఛాయాగ్రహణం : స్వామి జె. గౌడ

సంగీతం : అర్జున్ జన్యా

నిర్మాత : గీతా శివరాజ్ కుమార్, జీ స్టూడియోస్

రచన, దర్శకత్వం : హర్ష

-- సురేష్ కవిరాయని

ఇప్పుడు 'కె.జి.ఎఫ్' (KGF), 'కాంతారా' (Kantara) సినిమాలు మిగతా భాషల్లో కూడా విజయం సాధించాక, కన్నడ సినిమాలు ఇప్పుడు తెలుగులో విడుదల చెయ్యడానికి ఉద్యుక్తులవుతున్నారు. అందులో భాగంగా కన్నడ లెజెండరీ నటుడు దివంగత రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar) కన్నడం లో బాగా పేరున్న కథానాయకుడు. అతను నటించిన 125వ సినిమా 'వేద' (Vedha) కన్నడంలో గత ఏడాది డిసెంబర్ 23న విడుదలైంది. అదే సినిమాని శివవేద (Shiv Vedha) అనే పేరుతో తెలుగులో ఈరోజు, అంటే ఫిబ్రవరి 9 న విడుదల చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ కి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాత కూడా శివరాజ్ కుమార్ కావటం ఆసక్తికరం. అయితే తెలుగులో నిర్మాత ఎంవిఆర్ కృష్ణ (MVR Krishna) విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఎలావుందో ఏంటో చూద్దాం. (Shiv Vedha Review)

vedha4.jpg

Shiva Vedha story శివవేద కథ:

'కె.జి.ఎఫ్' విజయం చాల సినిమాల మీద ప్రభావం చూపించిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ తరువాత చాలా సినిమాలు ఎక్కువగా పీరియడ్ డ్రామా, అలాగే కలర్ గ్రేడింగ్, అంటే నేపధ్యం అంత గ్లామర్ గా కాకుండా, కొంచెం నలుపు ఉండేట్టు, అలాగే కథని ఎవరో నేరేట్ చెయ్యడం కూడా ఇవన్నీ 'కె.జి.ఎఫ్' సినిమాలో ఎలావుందో ఆలా అన్నమాట. ఈ 'శివ వేద' కథ కూడా అంతే, మనవరాలు కి బామ్మ కథ చెపుతుంది. మనవరాలు బస్సు లో ఆఫీస్ కి వెళుతుంటే, వెనకాల ఒక పోకిరీ కుర్రాడు ఆమెని ఇబ్బంది పెడతాడు. ఇంటికొచ్చి బామ్మకి చెపుతుంది, తాను ఇంక ఆఫీస్ కి వెళ్ళను అని. దానికి బామ్మ ఆమెకి పాత పుస్తకాలు చదవమని చెప్పి ఈ కథ నెరేట్ చేస్తుంది. కథ ప్రస్తుతం, 1965, 1985 ప్రాంతాల కాలంకి వెళుతూ ఉంటుంది.

వేద (శివరాజ్ కుమార్) కుమార్తె కనక (అదితి సాగర్) జైలు నుంచి విడుదల అవుతుంది. తండ్రి, కూతురు ఇద్దరూ కలిసి పోలీస్ అధికారి రుద్ర ను (భరత్ సాగర్) అతి దారుణంగా చంపుతారు. మహిళా పోలీస్ అధికారి రమా (వీణా పొన్నప్ప) చంపింది ఈ ఇద్దరూ అని తెలిసినా, వాళ్ళ మీద చర్యలు తీసుకోదు. అక్కడితో ఊరుకోకుండా తండ్రి కూతురు ఇద్దరూ ఇంకా కొంత మందిని చంపుకుంటూ పోతారు. వీళ్ళకి ఎవరు ఎక్కడ వున్నారు అన్నది తండ్రి కూతురు తో ఉంటున్న అతనే చెపుతూ ఉంటాడు. ఎందుకు తండ్రీ కూతుళ్ళు ఇద్దరూ ఆఅతి దారుణంగా ఇంతమందిని చంపుకుంటూ వెళుతున్నారు. దీని వెనక వున్న కథ ఏంటి, అసలు కనక ఎందుకు జైలుకు వెళ్ళవలసాయి వచ్చింది? వేద భార్య పుష్ప (గానవి లక్ష్మణ్)కి ఏమైంది? తండ్రి కూతుళ్ళకి సహాయం చేస్తున్న వ్యక్తిని ఒక వేశ్య (శ్వేతా చంగప్ప) చంపాలని అనుకుంటూ ఉంటుంది. ఎందుకు, ఎవరు, ఏమిటి అన్న విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

vedha3.jpg

విశ్లేషణ:

దర్శకుడు హర్ష (Director Harsha) ఇంతకు ముందు శివరాజ్ కుమార్ తో పని చేసాడు, ఇది వాళ్లిద్దరూ కలిపి చేసిన నాలుగో సినిమా. అందుకని వీరిద్దరి మధ్య మంచి అవగాహనా ఉన్నట్టుండి. హర్ష ఈసారి ఈ 'శివ వేద' లో ఒక యాక్షన్ డ్రామా తీసుకున్నాడు. అయితే ఇందులో అంతర్లీనంగా ఒక చిన్న సందేశం కూడా పెట్టాడు. ఆడపిల్లల మీద అత్యాచారాలు ఇప్పుడే కాదు, అప్పట్లో కూడా ఉండేవి అని చెపుతూ, ఆలా అత్యాచారాలు చేసేవాళ్ళని కొంతమంది అవినీతిపరులు ఆదుకుంటూ వుంటారు. వేద అనే అతనికి కూడా అటువంటి సందర్భం ఎదురయినప్పుడు అతను ఏమి చేసాడు, చట్టాన్ని ఎందుకు తన చేతుల్లోకి తీసుకున్నాడు అన్న నేపధ్యం లో కథ సాగుతుంది.

అయితే దర్శకుడు కథ మొదట్లో ఏమి చెప్పకుండా తండ్రి కూతురు ఇద్దరూ కొంతమంది అవినీతి పరులని చంపుకుంటూ వెళతారు. ఎందుకు అనే విషయం చివర్లో చెప్తారు. దర్శకుడు చివరి వరకు ఆ విషయాన్ని ఆసక్తికరంగా తీసుకువెళ్లాడు. బాగుంది. ఆడపిల్లలు మీద అత్యాచారాలు చేసి జైలు శిక్ష కొన్నాళ్ళు అనుభవించి మళ్ళీ విడుదలయి వచ్చేస్తున్నారు, అది సరి అయినా పద్ధతి కాదు, వాళ్ళకి భయం కలగాలంటే వాళ్ళకి శిక్ష పెద్దగా ఉండాలి అని వేద ఏమి చేసాడు అన్న ఇతి వృత్తం మీద ఈ కథ అంత యాక్షన్ నేపధ్యంలో సాగుతుంది. కానీ మధ్య మధ్యలో కన్నడ వాసనలు, వాళ్ళ ఓవర్ యాక్షన్ కామెడీ తెలుగు వాళ్ళకి ఎక్కక పోవచ్చు కానీ, యాక్షన్ దానికి తోడు చిన్న సందేశం వుంది కాబట్టి, సినిమా ఆసక్తికరంగానే ఉంటుంది. లీడ్ పెయిర్ మధ్య వచ్చే ఆ ప్రేమ సన్నివేశాలు కొంచెం సాగ దీసాడు, బోర్ గా ఉంటాయి. అయితే శివరాజ్ కుమార్ లేదా శివన్న గా పిలుచుకునే అతను స్టార్ స్టేటస్ వుంది కాబట్టి కన్నడ లో ఇవన్నీ అభిమానుల కోసం పెట్టరేమో అనిపిస్తుంది.

vedha1.jpg

ఇంక నటీనటుల విషయానికి వస్తే శివరాజ్ కుమార్ (Shiv Raj Kumar) వేద గా బాగా చేసారు. అతను 125 సినిమాలు చేసాడు అంటే అతని అనుభవం చాలా ఎక్కువ, కానీ ఆ పాత్రని ముఖ్యంగా మిడిల్ ఏజ్ లో పాత్ర బాగా చేసాడు. అతనికి తక్కువ మాటలే వున్నాయి, కానీ యాక్షన్ మాత్రం ఎక్కువ. పోరాట సన్నివేశాలు అన్నీ బాగా కోరియోగ్రఫీ చేశారు. గానవి లక్ష్మణ్ (Ganavi Lakshman) వేద భార్యగా చక్కగా చేశారు, ఆ పాత్రకు సరిపోయినట్టుగా అద్భుత నటన కారపరిచారు. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో కూడా చాలా భావోద్వేగంతో చేశారు. వేద కూతురు గా అదితి సాగర్ (Aditi Sagar) చాల పరిణితి చెందిన పాత్రలో కనిపించింది. చిన్నమ్మాయి అయినా చాల అనుభవం వున్నా నటి లా చాలా బాగా చేసింది. ఆమె కూడా యాక్షన్ సన్నివేశాలు ఇరగదీసింది. చాలామంది కన్నడ నటులే ఇందులో వున్నారు, అందరూ బాగానే చేశారు. సినిమాటోగ్రఫీ, నేపధ్యం అంత ఒకరకమయిన ఎరుపు, నలుపు కల గలిపిన రంగులో కనిపిస్తూ ఉంటుంది. అంటే కె.జి.ఎఫ్ సినిమాలో నేపధ్యం ఉంటుంది చూడండి ఆలా. సినిమాటోగ్రఫీ బాగుంది, అలాగే నేపధ్య సంగీతం కూడా ఒకే.

చివరగా, 'శివ వేద' సినిమా ఒక భావోద్వేగంతో కూడిన యాక్షన్ డ్రామా. ఇంతకు ముందు వచ్చిన 'కె.జి.ఎఫ్' లాంటి సినిమా తల్లి సెంటిమెంట్ అయితే, ఈ 'శివ వేద' లో కూతురు సెంటిమెంట్. చిన్న సందేశం కూడా ఉంటుంది. చాలామట్టుకు కన్నడ సినిమాల అనిపించినా, యాక్షన్ ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చవచ్చు.

Updated Date - 2023-02-09T16:49:16+05:30 IST