Kisi Ka Bhai Kisi Ki Jaan Review: అనుకున్నంత లేనట్టుంది...

ABN , First Publish Date - 2023-04-21T18:51:38+05:30 IST

ఈ సంవత్సరం ఈద్ పండగకు సల్మాన్ ఖాన్ సినిమా ' కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' విదుదల అయింది. ఇందులో చాలామంది తెలుగు నటులు వెంకటేష్, రామ్ చరణ్, జగపతి బాబు, భూమిక, పూజ హెగ్డే వున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే...

Kisi Ka Bhai Kisi Ki Jaan Review: అనుకున్నంత లేనట్టుంది...

సినిమా: కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ #KisiKaBhaiKisiKiJaan

నటీనటులు: సల్మాన్ ఖాన్, పూజాహెగ్డే, వెంకటేష్, జగపతి బాబు, భూమిక ఇంకా అతిథి పాత్రలో రామ్ చరణ్

సినిమాటోగ్రఫీ: వి మణికందన్

పాటలు: రవి బస్రూర్, హిమేష్ రేషమ్మియా, సాజిద్ ఖాన్, సుక్బీర్, పాయల్ దేవ్, దేవిశ్రీ ప్రసాద్, అర్మాన్ మాలిక్

నేపథ్య సంగీతం: రవి బస్రూర్

నిర్మాత: సల్మాన్ ఖాన్

దర్శకత్వం: ఫర్హాద్ సమ్జీ

బాలీవుడ్ లో ప్రతి సంవత్సరం ఈద్ (Eid Festival) పండగకు ఒక పెద్ద స్టార్ సినిమా విడుదల అవుతూ ఉంటుంది. అది ముందే ఎవరి సినిమా రావాలో డిసైడ్ చేసుకుంటారు అక్కడ. ఈ సంవత్సరం సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించి, నిర్మించిన 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' #KisiKaBhaiKisiKiJaanReview సినిమా విడుదల అయింది. సుమారు 4500 స్క్రీన్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇందులో మన తెలుగు నటులు వెంకటేష్ (Venkatesh Daggubati), పూజహెగ్డే (Pooja Hegde), జగపతి బాబు (Jagapatbi Babu), భూమిక (Bhumika), రామ్ చరణ్ (Ram Charan) (చిన్న అతిధి పాత్రలో) వున్నారు. ఈసారి తెలుగు వాళ్ళకి ఈ సినిమా కొంచెం ఆసక్తి కరంగా ఉండటానికి పైన చెప్పిన నటులే కాకుండా, తెలంగాణ పండగ బోనాల (Bonala song) పాట కూడా వుంది ఇందులో. సల్మాన్ ఖాన్ 'భారత్' సినిమా తరువాత ఈ సినిమానే ఇలా ఈద్ పండగకు విడుదల కావటం.

Salman-Khan.jpg

ఈ సినిమా తమిళ సినిమా 'వీరం' (#Veeram)కి రీమేక్. అదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రీమేక్ చేసి 'కాటమరాయుడు' #Katamarayudu గా వచ్చింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా దీనిని 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' #KisiKaBhaiKisiKiJaanReview అనే పేరు మీద తీసాడు. అయితే ఈ సినిమా గురించి KBKJReview నెటిజన్లు పెద్దగా పట్టించుకోవటం లేదు అని తెలిసింది. ఈ సినిమా మీద చాలా బాడ్ రివ్యూస్ వచ్చాయి. సల్మాన్ ఖాన్ ని 'భాయ్' అని కూడా పిలుచుకుంటూ వుంటారు అభిమానులు, కానీ ఈసారి ఈ ఈద్ పండగకు సల్మాన్ ఖాన్ అంతగా తన సినిమాతో సత్తా చూపించలేదు అని చెప్తున్నారు. కొందరు అయితే ఈ సినిమా కేవలం సల్మాన్ ఖాన్ #KisiKaBhaiKisiKiJaan అభిమానులకి మాత్రమే అని అంటున్నారు.

Salman-Khan.jpg

ఇందులో పూజ హెగ్డే, సల్మాన్ ఖాన్ ల మధ్య కెమిస్ట్రీ అంత బాగోలేదని కూడా అంటున్నారు. దర్శకుడు ఫర్హాద్ సమ్జీ (Farhad Samji) రెండు సినిమాలు చూపించాడు అన్నట్టుగా వుంది అని కొందరు అంటున్నారు. ఎందుకంటే సెకండ్ హాఫ్ సినిమా అంతా హైదరాబాద్ (Hyderabad) లో జరిగినట్టుగా పెట్టేసారు అని అన్నారు. మాటలు కూడా చాలా వరకు తెలుగులోనూ, అలాగే తెలుగు, హిందీ మిక్స్ చేసి కొన్ని మాటలు ఇలా ఎవరికీ తోచినట్టు వాళ్ళు మాటల రగడ చేశారు అని అంటున్నారు. దానికితోడు తెలుగు పాట కూడా మనం ముందే చూసేసాం ఎందుకంటే అది ముందే విడుదల చేసేసారు కదా. అలాగే రామ్ చరణ్ వున్న పార్టు కూడా ముందే విడుదల చేశారు. అంతే అతను ఆ పాటలోనే కనపడతాడు అని అంటున్నారు.

kisikabhaikisikajaan.jpg

ఒక టైము లో అయితే ఇది తెలుగు సినిమా నా లేక హిందీ సినిమా, లేక డబ్బింగ్ సినిమా ఇలా అనేక అనుమానాలు ప్రేక్షకులకి వచ్చేస్తూ ఉంటుంది, అంతలా మిక్స్ చేసేసారు, దానికి తోడు తెలుగు నటులు కూడా వున్నారు కదా, అందుకే ఆలా అనిపిస్తూ ఉంటుంది అని అంటున్నారు. దానికి తోడు వెంకటేష్ పాత్రని దర్శకుడు సరిగ్గా తీర్చి దిద్దలేదని కూడా అంటున్నారు.

KisiKaBhaiKisiKiJaan.jpg

ఇక సల్మాన్ ఖాన్ ఇలాంటి పాత్రలు ఇంతకు ముందు చేసాడు కాబట్టి, ఇందులో #KisiKaBhaiKisiKiJaanReview పెద్దగా తేడా ఏమి కనిపించలేదు, కానీ అతను సిక్స్ ప్యాక్ ఫాన్స్ కి బాగుంటుంది అని అంటున్నారు. అలాగే తమ్ముళ్ళకి తనకి మధ్య వచ్చిన సన్నివేశాల్లో బాగా చేసాడు అని కూడా తెలుస్తోంది. ఇంకా పూజ హెగ్డే కి కూడా ఇదేమి కొత్త కాదు, #KBKJReview ఇలాంటి పాత్ర చేసింది ఇంతకు ముందు అని అంటున్నారు.

ఏమైనా కూడా 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' సినిమా అనుకున్నంతగా లేదు అని అంటున్నారు. సల్మాన్ ఖాన్ అభిమానులకి కొంచెం నచ్చుతుందేమో కానీ, మిగతా ప్రేక్షకులకు మాత్రం ఇది నచ్చకపోవచ్చు అని కూడా అంటున్నారు. మరి సల్మాన్ ఖాన్ హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అవుతోంది, ఇది కూడా చాల నిరాశ పరిచినట్టే. ఇంక పూజ హెగ్డే కి ఇది ఇంకో ప్లాప్ తన ఖాతాలో వేసుకుంది.

Updated Date - 2023-04-21T18:51:38+05:30 IST