Rudrangi Film Review: దొరల పాలన ఎట్లున్నదో ఎరుకేనా...

ABN , First Publish Date - 2023-07-07T17:21:37+05:30 IST

'రుద్రంగి' సినిమా తెలంగాణలో నిజాం, దొరల పాలనలో ప్రజలు ఎట్లున్నారు, దొరలు ప్రజలని ఎటువంటి ఇబ్బందులకు గురిచేసేవారు చెప్పే సినిమా. అజయ్ సామ్రాట్ దర్శకుడు, రసమయి బాలకిషన్ నిర్మాత. జగపతి బాబు, మమతా మోహన్ దాస్, విమల రామన్ నటించారు.

Rudrangi Film Review: దొరల పాలన ఎట్లున్నదో ఎరుకేనా...
Rudrangi Film Review

సినిమా: రుద్రంగి

నటీనటులు: జగపతి బాబు (Jagapathi Babu), మమతా మోహన్ దాస్ (MamtaMohanas), విమలా రామన్ (VimalaRaman), ఆశిష్ గాంధీ (AshishGandhi), గానవి లక్ష్మణ్, కాలకేయ ప్రభాకర్ (KalakeyaPrabhakar), ఆర్ఎస్ నంద (RS Nanda) తదితరులు

ఛాయాగ్రహణం: సంతోష్ శనమోని

సంగీతం: నాఫల్ రాజా

నిర్మాత: రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan)

కథ, కథనం, మాటలు, దర్శకత్వం: అజయ్ సామ్రాట్ (Ajay Samrat)

-- సురేష్ కవిరాయని

కొన్ని రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) 'రుద్రంగి' #RudrangiFilmReview అనే సినిమా ప్రచారానికి ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లారు. అప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. బీఆరెస్ ఎమ్మెల్యే (BRSMLA) రసమయి బాలకిషన్ ఈ సినిమాకి నిర్మాత కాగా, అజయ్ సామ్రాట్ దర్శకుడు. అజయ్ ఇంతకు ముందు రాజమౌళి (SSRajamouli) దగ్గర పని చేసాడు, అలాగే 'రాజన్న' అనే సినిమాకి కూడా పని చేసాడు అని తెలిసింది. ఈ 'రుద్రంగి' లో జగపతి బాబు, మమత మోహన్ దాస్, విమల రామన్ ప్రధాన పాత్రలు పోషించారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు జరిగిన కథ గా ఈ సినిమాలో చెప్పారు. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం పాలనా ఉండేది, దొరల అరాచకత్వం, గడీల లో జరిగే భాగోతాలు ఈ సినిమా నేపధ్యంగా తీశారు. ఇక ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Rudrangi.jpg

Rudrangi film story కథ:

భీమ్ రావ్ (జగపతి బాబు) రుద్రంగి గ్రామానికి దొర. అతని భార్య మీరాబాయి (విమలా రామన్). ఈలోగా ఇంకో ఆమెని కూడా పెళ్లిచేసుకొని గడీకి తీసుకు వచ్చి ఆమె కూడా దొరసాని అనే చెప్తాడు వూర్లో అందరికీ. ఆమె పేరు జ్వాలాబాయి దేశ్ ముఖ్ (మమతా మోహన్ దాస్), ఆమె దొరల కుటుంబం నుండి వచ్చింది కాబట్టి ఆమె కత్తి పడుతుంది, తుపాకీ పేలుస్తుంది, కుస్తీ పడుతుంది. ఇలాంటివి అన్నీ చెయ్యడంతో ఆమెకి ఆడతనం లేదని దొర ఆమెని పక్కన పెడతాడు. చిన్నప్పుడు తన తాతని చంపిన దొర (కాలకేయ ప్రభాకర్) మీద పగ తీర్చుకున్న మల్లేష్ (ఆశిష్ గాంధీ) అనే అతన్ని భీమ్ రావ్ దొర తన దగ్గర నమ్మిన బంటుగా పెట్టుకుంటాడు. అలాంటి నమ్మిన బంటు అయిన మల్లేష్ మీద మనసు పడుతుంది దొరసాని జ్వాలాబాయి. #RudrangiFIlmReview అడవికి వేటకి వెళ్ళిన భీమ్ రావ్ కి రుద్రంగి (గానవి లక్ష్మణ్) అనే అమ్మాయి కనపడుతుంది, ఆమెని గడీకి తీసుకొచ్చి అనుభవించాలని అనుకుంటాడు. ఆమె తప్పించుకుంటుంది, నమ్మిన బంటు అయిన మల్లేష్ ని పంపించి ఆమెని వెతికి పట్టుకురమ్మంటాడు. మల్లేష్ ఆమెని తీసుకువస్తాడు, కానీ రుద్రంగి తన భార్య అని వదిలేయమని దొరని వేడుకుంటాడు. #RudrangiReview దొర వినడు, వినకపోగా ఎలా అయినా రుద్రంగిని తన పాన్పు చేర్చుకోవాలని రుద్రంగి గ్రామ ప్రజలకు ఎటువంటి కష్టాలు పెడతాడు, ఏమి చేస్తాడు? మల్లేష్, ఆ ఊరి ప్రజలు, దొర మీద తిరగబడ్డారా, ప్రజలు బాధలు చూడలేక రుద్రంగి ఏమి చేసింది? మల్లేష్ మీద మనసు పడ్డ దొరసాని మల్లేష్ ని ఏమి చేసింది, దొర చివరికి ఏమయ్యాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'రుద్రంగి' చూడాల్సిందే.

rudrangi-jagapathibabu.jpg

విశ్లేషణ:

ఈమధ్య తెలంగాణ నేపథ్యంలో చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా మంచి పరిణామం అది. ఎందుకంటే తెలంగాణ నేపధ్యం, అప్పటి సంస్కృతి, అప్పుడు దొరల పాలనలో ప్రజలు ఎంతగా నలిగిపోయారు, అప్పటి సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఇప్పటి తరానికి చెప్పడం బాగుంది. దర్శకుడు అజయ్ సామ్రాట్ కి తెలంగాణ దొరల, గడీల మీద మంచి పట్టు ఉన్నట్టు కనపడుతోంది. అందుకే 'రుద్రంగి' సినిమాలో కొన్ని సన్నివేశాలు కళ్ళకి కట్టినట్టుగా కనపడతాయి. #RudrangiFilmReview ఈ సినిమా నేపధ్యం కూడా నిజాం పాలనలో, దొరల అరాచకాలు, ప్రజల బాధలు, వారి తిరుగుబాటు ఇవన్నీ చూపించాడు. కథ కొత్తగా ఉంటుంది, ప్రతి సన్నివేశం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఎక్కడా సాగతీత కనిపించదు.

అయితే దర్శకుడు దృష్టి ఎక్కువగా గడీ లలో దొరసానిల జీవితాలు, అంత పెద్ద భవనంలో ఏమి జరుగుతుంది, ఎలా ఉంటుంది ఇవన్నీ బాగా చూపించాడు. అలాగే మాటలు కూడా చాలా బాగా రాసాడు, అందరూ బాగా తమ తమ పాత్రల్లో మెప్పించారు కూడా. ముఖ్యంగా కరణం పాత్ర చేసిన నటుడికి మాటలు తూటాల్లా పేలాయి. #RudrangiFilmReview ఇవన్నీ బాగున్నాయి, కానీ ఒక్కటే లోపం. ఏంటంటే సినిమాకి ఇంకా కొంచెం బడ్జెట్ పెట్టి సాంకేతికంగా మెరుగు పరిస్తే, ఇంకో లెవెల్లో ఉండేది. లేకపోతే కొన్ని సన్నివేశాలలో సహజత్వం లోపించింది ఎందుకంటే నాసిరకం సెట్స్, గ్రాఫిక్స్ వలన. ఛాయాగ్రహణం పరవాలేదు, అలాగే సంగీతం కూడా. నేపధ్య సంగీతం ఒక్కోసారి చాలా ఎక్కువయినట్టుగా అనిపించింది, కానీ కొన్ని సన్నివేశాలకు ఆ సంగీతమే ప్రాణం. మొత్తం మీద అజయ్ మంచి సినిమా చేసాడు అనిపిస్తుంది.

mamtamohandas-rudrang.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, జగపతి బాబు సినిమాకి ఆయువుపట్టు. అతని కెరీర్ లో ఈ 'రుద్రంగి'లో చేసిన దొర పాత్ర నిలిచిపోయేలా ఉంటుంది. అంతలా తన ప్రతిభతో మెప్పించాడు జగపతిబాబు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో అయితే బాబోయ్ అనేటంతగా చేసాడు. అయితే అతను ప్రతి దగ్గర తన గొంతు గట్టిగా అరుస్తున్నటుగా చెప్పాడు, ఆలా కాకుండా కొన్ని సన్నివేశాల్లో దానికి అవసరం అయినంత మేరకే గొంతు తగ్గించి మాట్లాడటం లాంటివి చేస్తే బాగుండేది. కానీ అతనికి ఈ సినిమా కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక మమతా మోహన్ దాస్ చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించింది. జ్వాలాభాయ్ పాత్రలో ఇమిడిపోయింది. మమతా మోహన్ దాస్ 75 ఏళ్ల క్రితం తెలంగాణా ప్రాంతానికి చెందిన ఒక దొరసానిలా అద్భుతమైన నటన కనపరిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

rudrangi-jagapathibabu1.jpg

వీరిద్దరితో సరి సమానంగా విమలా రామన్ కూడా మీరాబాయి పాత్రలో మంచి నటన కనపరచి అబ్బురపరిచింది. ఆశిష్ గాంధీ అయితే మన తెలుగు 'రాకీ భాయ్' అని చెప్పొచ్చు. చాలా బాగున్నాడు, అంతే బాగా చేసాడు. రుద్రంగిగా గానవి లక్ష్మణ్ (GanaviLakshman) చూపించిన ప్రతిభ, ఆమెకి ఆ పాత్ర మీద వున్న పట్టు, అది ఆకళింపు చేసుకున్న విధానం అంత బాగా చేసింది. దొర దగ్గర కరణంగా ఆర్ ఎస్ నందా (RSNanda) అనే తను చేసాడు. అతను అయితే తన మాటలతో, చేష్టలతో కడుపుబ్బా నవ్వించాడు. #RudrangiFilmReview అతనికి మంచి మాటలు రాసారు. నటీమణులనే కాకుండా తెలుగు నటులు కూడా దొరకటం లేదు అని చెప్పి అందరూ మలయాళం, హిందీ, తమిళ భాషల నుంచి దిగుమతి చేస్తున్నారు. కానీ వెతికితే నందా (RSNanda) లాంటి నటులు ఎందుకు దొరకరు, తప్పక దొరుకుతారు. మన ఫిలిం మేకర్స్ వెతకరు, వెతికితే ఎందరో నందా లాంటి నటులు దొరుకుతారు. రసమయి బాలకిషన్ కూడా పాటలో కనిపిస్తాడు. కాలకేయ ప్రభాకర్ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా చేసాడు.

చివరగా, ఏమీ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్లి 'రుద్రంగి' సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త కథ, సాగదీత లేని సన్నివేశాలు, మాటలు, నటీనటుల అద్భుత ప్రతిభ కలగలిపి ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ ఎందుకో ఈ సినిమాకి మంచి ప్రచారం చేసుకోలేదు, అలాగే ఇంకా కొంచెం సాంకేతిక మీద దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా టాప్ లెవెల్లో ఉండేది. అజయ్ సామ్రాట్ కి దర్శకుడిగా పాసయ్యాడు. అన్నిటిలోనూ మంచి పట్టున్న దర్శకుడు ఇతను. ఈ సినిమా ఒక్కసారి చూడొచ్చు.

Updated Date - 2023-07-07T17:21:37+05:30 IST