Bhaag Saale film review: పరుగో పరుగు...

ABN , First Publish Date - 2023-07-08T16:44:03+05:30 IST

ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహ కోడూరి సినిమా 'భాగ్ సాలె' విడుదల అయింది. ఇంకో కుమారుడు ఆస్కార్ గెలుచుకున్న 'నాటు నాటు' పాట పాడిన కాల భైరవ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. చిన్నాన్న రాజమౌళి ప్రపంచంలో పేరున్న దర్శకుడు. ఇన్ని పెద్ద పేర్లు ఈ చిన్న సినిమా వెనక వినపడుతున్నాయి తీరా సినిమాకి వెళితే ఏమి జరిగిందో తెలుసా...

Bhaag Saale film review: పరుగో పరుగు...
Bhaag Saale film review

సినిమా: భాగ్ సాలే

నటీనటులు: శ్రీ సింహ కోడూరి (SriSimhaKoduri), నేహా సొలంకి (NehaSolanki), జాన్ విజయ్ (JohnVijay), రాజీవ్ కనకాల (RajeevKanakala), వైవా హర్ష (VivaHarsha), వర్షిణి సౌందర్ రాజన్, నందిని రాయ్ (NandiniRai), సత్య (ComedianSatya), సుదర్శన్, పృథ్వీ రాజ్ (30YearsPrudhvi) తదితరులు

సంగీతం: కాల భైరవ (KalaBhairava)

ఛాయాగ్రహణం: రమేష్ కుషేందర్

నిర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల

కథ, కథనం, దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మాండపల్లి (Pranith Brahmandapalli)

-- సురేష్ కవిరాయని

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఎంఎం కీరవాణి రెండో కుమారుడు సింహ కోడూరి కథానాయకుడిగా 'మత్తు వదలరా' (MathuVadalara) సినిమాతో ఆరంగేట్రం చేసాడు. ఇప్పుడు అతనే కథానాయకుడిగా 'భాగ్ సాలె' #BhaagSaaleFilmReview అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమా మంచి ప్రసంశలు అందుకొంది, విజయం కూడా సాధించింది. అయితే ఆ తరువాత ఓ రెండు సినిమాలు చేసాడు కానీ ఆశించినంత పేరు రాలేదు. ఇప్పుడు ఈ 'భాగ్ సాలె' #BhaagSaale సినిమాకి కూడా ప్రచారాలు అవి బాగానే చేశారు, అలాగే కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ (KalaBhairava) ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ సినిమాకి దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి, నేహా సోలంకీ (NehaSolanki) కథానాయకురాలు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

bhaagsaale2.jpg

Bhaag Saale film story కథ:

ఈ సినిమా మొదలవడం సినిమా కథానాయకుడు అర్జున్ (సింహ కోడూరి) ఎవరో వెంట తరుముతున్నట్టు పరిగెడుతూ ఉంటాడు. ఎందుకు ఆలా పరిగెడుతూ ఉంటాడు, ఎవరు తరుముతున్నారు అనేది అతని మాటల్లో కథ నడుస్తుంది. అర్జున్ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు, ఒక రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేస్తూ ఉంటాడు. అతను మాయ (నేహా సోలంకి) అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు, కానీ ఆమెకి తనెక్కడ వుద్యోగం చేస్తున్నాడో నిజం చెప్పకుండా, తాను తాను ఒక పెద్ద బిజినెస్ మాన్ అని, తనకి కార్లు బంగళాలు ఉన్నాయని చెపుతూ ఉంటాడు. #BhaagSaaleFilmReview ఇంకో పక్క శామ్యూల్ (జాన్ విజయ్) అనే గ్యాంగ్ లీడర్ ఉంటాడు. అతనికి నళిని (నందిని రాయ్) అంటే ఇష్టం, ఆమెని పెళ్ళిచేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆమె ఒక కండిషన్ పెడుతుంది, డైమండ్ రింగ్ తెచ్చి ఇస్తే పెళ్లి చేసుకుంటాను అంటుంది. దాని కోసం మాయ తండ్రిని (సంజయ్ స్వరూప్) శామ్యూల్ కిడ్నాప్ చేస్తాడు. మాయ తండ్రిని విడిపించమని తన బాయ్ ఫ్రెండ్ అయిన అర్జున్ సహాయం కోరుతుంది. #BhaagSaaleReview అసలు ఇంతకీ ఆ ఉంగరం కథ ఏమిటి? అర్జున్, మాయకి సహాయం చేసినపుడు శామ్యూల్ గ్యాంగ్ అతన్ని ఏమి చేసింది? అర్జున్ చెప్పినవన్నీ అబద్ధాలు అని తెలిసాక, మాయ ఏం చేసింది? పోలీస్ ఆఫీసర్ ప్రామిస్ రెడ్డి (సత్య) ఎందుకు ఈ క్రైమ్ లోకి దూరాడు, ఇవన్నీ తెలియాలంటే 'భాగ్ సాలె' చూడాల్సిందే.

bhaagsaale4.jpg

విశ్లేషణ:

దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఒక క్రైమ్ కామెడీ ని ఎంచుకున్నాడు. ఎన్నో వందల సంవత్సరాల క్రితం కోహినూర్ వజ్రంతో పాటు ఇంకో వజ్రం దొరకటం అది తరాలు, ప్లేసెస్ మారి చివరికి అందులో ఒక ముక్క హైదరాబాద్ కి రావటం, ఇంతవరకు బాగానే వుంది. కానీ ఆ ఉంగరం కాజెయ్యడానికి ఎలా, ఏమిటి, ఎందుకు అనేదే కథ. ఇది సరదాగా చెప్పాలి అనుకున్నాడు, కానీ అందులోనే విఫలం అయ్యాడు. ఈ సినిమా కొంచెం 'స్వామి రారా' లాగా ఉంటుంది, అందులో కూడా వినాయకుడి విగ్రహం కోసం అందరూ పరిగెడుతూ వుంటారు. దర్శకుడు సుధీర్ వర్మ ఆ కథని బాగా సరదాగా చెప్పాడు, విజయం సాధించాడు. ఇందులో ఈ ఉంగరం కోసం అందరూ పరిగెడుతూ ఉండాలి, సరదా సన్నివేశాలు రావాలి, కానీ దర్శకుడు అది చూపించంటంలో ఫెయిల్ అయ్యాడు. చివరికి ఒక బి గ్రేడ్ సినిమా తీసాడు. ఏవో అక్కడక్కడా చిన్న చిన్న బూతులతో కూడిన కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయేమో కానీ, సినిమా అయితే మాత్రం అస్సలు నడవదు. అదీ కాకుండా దర్శకుడు ఈ కథలో చాలా మందిని ఇరికించేసి వాళ్ళ కథలు కి మెయిన్ కథకి అసలు లింక్ లేకుండా అంత కలగాపులగం చేసేసాడు. సత్య, వర్షిణి సన్నివేశాలు కథని పొడిగించడానికి పెట్టారు అనిపిస్తోంది, సత్య కామెడీ బాగా పడుతోంది ఈమధ్య అందుకని అతన్ని ఇందులో కావాలని ఇరికిచ్చినట్టుగా పెట్టారు, కానీ అతను కథకి అవసరం లేదు.

ఇంకో విషయం ఇక్కడ చెప్పుకోవాలి. శ్రీ సింహ కోడూరి ఒక పెద్ద ఫిల్మీ కుటుంబం నుండి వచ్చాడు. తండ్రి ఆస్కార్ అవార్డు #OscarAward అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MMKeeravani), చిన్నాన్న ప్రపంచవ్యాప్తంగా పేరున్న దర్శకుడు రాజమౌళి (SSRajamouli), అన్న ఆస్కార్ అవార్డు తెచ్చుకున్న 'నాటు నాటు' (NaatuNaatu) పాట పాడిన కాలభైరవ (Kalabhairava). ఇతను ఈ సినిమాకి సంగీతం కూడా సమకూర్చాడు. #BhaagSaaleReview ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే, ఇంత పెద్ద కుటుంబం నుండి వచ్చిన శ్రీ సింహ కోడూరి, సినిమాలో బూతు మాటలు ఎలా వొప్పుకున్నాడో అర్థం కావటం లేదు. మొదటి రోజు, మొదటి ఆట అతని కుటుంబ సభ్యులు కీరవాణి, వల్లి గారు, రాజమౌళి రమా గారు, ఇలా మొత్తం చాలామంది చూసారు. కంటెంట్ నమ్మితే ఏ సినిమా అయినా ఆడుతుంది అని నమ్మే వ్యక్తి రాజమౌళి. మరి అటువంటి కుటుంబం నుండి వచ్చిన శ్రీ సింహ కోడూరి కథని నమ్మకుండా, బూతు జోకులు ఏవో నాలుగు పెట్టేస్తే సినిమా ఎలా ఆడుతుంది అనుకుంటాడు, ఎలా ఒప్పుకున్నాడు అవన్నీ. ఆంగ్ల పదాలు 'దెన్ గొ' (Then go) అనేవి స్పిడుగా చెపితే వచ్చే బూతుని ఆలా ఎలా అంత డైరెక్ట్ గా పెట్టేస్తారు సినిమాలో. సెన్సారు బోర్డు ఏమి చేస్తోంది. అందుకే ఈ సినిమా ఒక 'బి' గ్రేడ్ సినిమాగా తయారయింది.

bhaagsaale5.jpg

నటీనటుల విషయానికి వస్తే సింహ కథానాయకుడిగా పరవాలేదనిపించాడు, కానీ ఇంకా పూర్తిగా నటుడిగా పరిపక్వతకు రాలేదు అనిపిస్తుంది. కథానాయకురాలు నేహా సోలంకి స్క్రీన్ మీద చూడటానికి బాగుంది, అంతే. నటన గురించి చర్చించడానికి ఏమి లేదు. రాజీవ్ కనకాల తండ్రిగా బాగా చేసాడు, అలాగే తల్లి బిందు చంద్రమౌళి కూడా. తెలుగు నటులు ఇంతమంది ఉండగా ఆ తమిళ నటుల్ని ఇక్కడికి ఎందుకు తెస్తారో తెలియదు. జాన్ విజయ్ సినిమాకి ఎటువంటి ఉపయోగం లేదు. అతన్ని తీసుకురావటం వలన నిర్మాతకి డబ్బులు వేస్ట్. అతనికి బదులు ఒక తెలుగు నటుడిని పరిచయం చేయొచ్చు, లేదా ఎంతోమంది వున్నారు వాళ్ళతో చేయించుకోవచ్చు. సత్య చివర్లో వస్తాడు, నవ్విస్తాడు. వైవా హర్ష ఒకే. మిగతా సాంకేతిక విలువలు అన్నీ సాధారణంగా వున్నాయి. మాటలు అన్నీ బూతులు, సరిగ్గా రాయలేదు.

చివరగా 'భాగ్ సాలె' అంటే థియేటర్ నుండి ప్రేక్షకులు పరుగో పరుగు #BhaagSaaleFilmReview అనే చెప్పాలి. ఇప్పటికైనా మన నిర్మాతలు, దర్శకులు చిన్న సినిమా అంటే 'సి' గ్రేడ్ సినిమా తీస్తున్నాం అని కాకుండా, కంటెంట్ మీద, నిర్మాణ విలువల మీద దృష్టి పెట్టి తీస్తే మంచిది. ఎన్ని చిన్నసినిమాలు మంచి సినిమాలుగా మారి, విజయం వీపుకి దూసుకుపోలేదు. అంతే కానీ, ఇలా మరీ 'భాగ్ సాలె' సినిమా వలె నాసిరకంగా కాకుండా మంచి సినిమాగా తీస్తే ప్రేక్షకులు చూస్తారు, హర్షిస్తారు.

Updated Date - 2023-07-08T16:44:03+05:30 IST