Manu Charitra Film Review: ఈ సినిమా ఎలా ఉందంటే...

ABN , First Publish Date - 2023-06-23T15:31:13+05:30 IST

శివ కందుకూరి, మేఘా ఆకాష్ జంటగా నటించిన 'మను చరిత్ర' ఈరోజు విడుదల అయింది. భరత్ పెదగాని దీనికి దర్శకుడు. ఇందులో 'అర్జున్ రెడ్డి', 'ఆర్ఎక్స్ 100' షేడ్స్ వున్నాయి అని విడుదలకి ముందు అన్నారు, మరి సినిమా ఎలా ఉందొ చూద్దాం.

Manu Charitra Film Review: ఈ సినిమా ఎలా ఉందంటే...
Manu Charitra Film Review

సినిమా: మను చరిత్ర (ManuCharitra)

నటీనటులు: శివ కందుకూరి, మేఘా ఆకాష్, ధనుంజయ్, సుహాస్, ప్రగతి శ్రీవాత్సవ్, ప్రియా వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్ తదితరులు

ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ్!

సంగీతం: గోపీసుందర్

నిర్మాత: ఎన్. శ్రీనివాస రెడ్డి

రచన, దర్శకత్వం: భరత్ పెదగాని

-- సురేష్ కవిరాయని

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా రాజ్ కందుకూరి (RajKandukuri) అందరికీ సుపరిచితమే. అతను 'పెళ్లిచూపులు' (PelliChoopulu), 'మెంటల్ మదిలో' (MentalMadilo) అనే రెండు సినిమాలు నిర్మించారు, రెండూ మంచి పేరు, డబ్బులు తెచ్చి పెట్టాయి. రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి (ShivaKandukuri) 'చూసి చూడంగానే' (ChoosiChoodangane) అనే సినిమాతో లీడ్ యాక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆ తరువాత 'గమనం' (Gamanam) చేసేడు, ఇప్పుడు 'మను చరిత్ర' #ManuCharitraFilmReview అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భరత్ పెదగాని (BharathPedagani) ఈ సినిమాకి దర్శకుడు, కాగా మేఘ ఆకాష్ (MeghaAkash) కథానాయికగా చేసింది. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

manucharitrafilmreview.jpg

Manu Charitra story కథ:

ఈ కథ వరంగల్ (Warangal) నేపథ్యంలో సాగుతుంది. మను దుర్గరాజ్ లేదా మను (శివ కందుకూరి) వరంగల్‌లో రుద్ర(ధనుంజయ్) అనే రౌడీ దగ్గర పని చేస్తూ వుంటాడు. అందమైన అమ్మాయిల వెనకాల పడుతూ వాళ్ళకి ఐ లవ్ యు అని చెపుతూ, తిరిగి వాళ్ళు కూడా ఇతన్ని ఇష్టపడేసరికి మనిద్దరికీ పడదు అని ఏవో కారణాలు చెప్పి బ్రేక్ అప్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అందులో ఒకమ్మాయి (ప్రియా వడ్లమాని) మను ని చీటర్ అని తిడుతుంది. అప్పుడు మను స్నేహితుడు (సుహాస్) మను ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఎందుకు అతను ఆలా తయారయ్యాడో చెప్తాడు. మను వరంగల్ కాలేజీ లో టాప్ ర్యాంకర్, జెన్నీ (మేఘ ఆకాష్) అనే తన బ్యాచ్ మేట్ అయిన ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ అమ్మాయి వేరే అబ్బాయిని చేసుకొని వెళ్ళిపోతుంది. కానీ మను జెన్నీ ని మరచిపోలేక, తాగుడుకు, డ్రగ్స్ కి అలవాటు పడిపోతాడు. #ManuCharitraReview అలాగే ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే జాను (ప్రగతి శ్రీవాత్సవ్) పరిచయం అవుతుంది, అతని జీవితం కూడా ఇంకో వేపుకు తిరుగుతుంది. అతను జెన్నీని మరిచిపోయాడా, జెన్నీ తిరిగి వచ్చిందా లేక జానూని పెళ్లి చేసుకున్నాడా, అలాగే వరంగల్ మేయర్ జనార్దన్ (శ్రీకాంత్ అయ్యంగార్) తో పాటు మరికొందరి హత్యలకు, మనుకు సంబంధం ఏమిటి? రౌడీ అయిన రుద్ర.. మనుని ఏమి చేసాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే 'మను చరిత్ర' చూడండి. #ManuCharitraFilmReview

manucharitrafilmreview1.jpg

విశ్లేషణ:

దర్శకుడు భరత్ పెదగాని (BhrathPedagani) మను అనే అబ్బాయి గురించి చెప్పాలని అనుకున్నాడు అందుకని ఈ సినిమాకి 'మను చరిత్ర' #ManuCharitraFilmReview అనే టైటిల్ పెట్టాడు. అంతవరకు బాగానే వుంది, కానీ ఏమి చెప్పాలని అనుకున్నాడు అన్నది కొంచెం గందరగోళానికి గురయినట్టు కనపడుతోంది. ఎందుకంటే ప్రేమకథ, అందులోనే ఒక క్రైమ్, అలాగే ఇంకో సైడ్ నుండి ఒక పొలిటికల్ రైవల్రీ ఇలా అన్ని పెట్టాడు. చివరికి ఏదీ సరిగ్గా చూపించలేకపోయాడు. విజయ్ దేవరకొండ (VIjayDeverakonda) చేసిన 'అర్జున్ రెడ్డి' #ArjunReddy ప్రభావం తెలుగు పరిశ్రమలో ఇంకా పోలేదు అనుకుంటా, అందుకని మధ్యలో ప్రేమ విఫలం కాగానే కథానాయకుడు అర్జున్ రెడ్డిలా తయారవుతాడు. ప్రేమ చేసిన గాయానికి మందు వేరే ఏమీ అక్కరలేదు మళ్ళీ ప్రేమే దానికి విరుగుడు అని దర్శకుడు చెప్పాడు, కానీ సినిమాని ఆ తరహాలో ఎక్కడా తీర్చి దిద్దలేకపోయాడు.

ముఖ్యంగా రెండో సగంలో దర్శకుడు కథ మీద పట్టు కోల్పోయాడు. అందుకని ఒకదానితో ఒకటి లింక్ సరిగ్గా కుదరలేదు. కథ మొదలైంది 2014లో అంటే మను, జెన్నీల ప్రేమ కథ వాళ్ళు స్టూడెంట్స్ గా వున్నప్పుడు మొదలయింది. ప్రస్తుతం వచ్చేసరికి అంటే సుమారు పదేళ్ల తరువాత మను కాలేజీలో లెక్చరర్ గా పాఠాలు చెపుతూ ఉంటే, అదే కాలేజీలో చదివే అమ్మాయి జానుతో ప్రేమలో పడతాడు. అదెలా? అది సరిగ్గా సింక్ అవలేదు. #ManuCharitraFilmReview మను కథ ఇంటర్నెట్ లో పెడతారు, అది చదివి దుబాయ్ లో వున్న జెన్నీ వరంగల్ వస్తుంది, మనుని, జానూని చూస్తుంది. మను గురించి జానూకి చెప్పి అతను మంచివాడు అని చెప్తుంది. ఇక్కడే ఎదో సరిగ్గా లింక్ కుదరలేదు. ఇవన్నీ ఇలా ఉంటే, పొలిటికల్ రైవల్రీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఆ క్రైమ్ సన్నివేశాలకి మను కి వున్న లింక్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యలేకపోయాడు దర్శకుడు. కథ మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే, ఈ సినిమా కొంచెం ఆసక్తికరంగా వచ్చేది.

manucharitrafilmreview2.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, శివ కందుకూరి రెండు #ManuCharitraFilmReview షేడ్స్ లో కనపడ్డాడు. లవర్ బాయ్ గా చాలా బాగున్నాడు. అలాగే ప్రేమలో విఫలం అయి, గెడ్డలు, మీసాలు పెంచి రఫ్ గా కనపడే పాత్రను ఇంకా కొంచెం కసరత్తు చేసి ఉంటే బాగుండేది. మొత్తం మీద అతను ముందు సినిమాలతో పోలిస్తే ఇందులో బాగా పరిణితి సంపాదించాడు. #ManuCharitraReview మేఘా ఆకాష్ కి పెద్ద పాత్ర వచ్చింది, ఆమె బాగుంది కూడాను. అలాగే మిగతా అమ్మాయిలలో ప్రగతి శ్రీవాత్సవ్ బాగుంది కానీ మరీ చిన్నపిల్లలా నటించింది. రుద్ర గా ధనుంజయ్ బాగున్నాడు, అలాగే మేయర్ గా శ్రీకాంత్ అయ్యంగార్ ఒకే. సుహాస్, కథానాయకుడి స్నేహితుడిగా ఒప్పించాడు. మిగతావాళ్లందరూ ఒకే. గోపిసుందర్ సంగీతం బాగుంది, ముఖ్యంగా నేపధ్య సంగీతం. అలాగే ఛాయాగ్రహణం కూడా ఒకే. పోరాట సన్నివేశాలు బాగానే కొరియోగ్రాఫ్ చేశారు.

చివరగా, 'మను చరిత్ర' అటు రొమాంటిక్ కథలా కాకుండా, పోనీ ఏమైనా యాక్షన్ సినిమాగా అనుకుందామా అంటే అది కాకుండా, రెండింటికీ మధ్యలో ఉండిపోతుంది. 'అర్జున్ రెడ్డి' ఇంకా 'ఆర్ఎక్స్ 100' (RX100) కలిపి మిక్సీలో వేస్తె ఎలా ఉంటుందో, ఆలా తయారయింది ఈ సినిమా. అక్కడ అక్కడా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి, అంతే !

Updated Date - 2023-06-23T16:17:16+05:30 IST