Mark Antony film review: ఇదొక శబ్ద కాలుష్యం

ABN , First Publish Date - 2023-09-15T15:59:28+05:30 IST

విశాల్, ఎస్ జె సూర్య నటించిన 'మార్క్ ఆంటోనీ' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది తమిళ సినిమా, తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. దీనికి అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Mark Antony film review: ఇదొక శబ్ద కాలుష్యం
Mark Antony film review

సినిమా: మార్క్ ఆంటోనీ

నటీనటులు: విశాల్, ఎస్ జె సూర్య, రీతూ వర్మ, సునీల్, సెల్వ రాఘవన్, అభినయ, వైజీ మహేంద్రన్ తదితరులు

ఛాయాగ్రహణం: అభినందన్ రామానుజం

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ (GVPrakashKumar)

రచయిత, దర్శకుడు: ఆధిక్ రవిచంద్రన్

నిర్మాత: ఎస్ వినోద్ కుమార్

-- సురేష్ కవిరాయని

ఈమధ్య ఈ టైమ్ ట్రావెల్ అదే కాలంలో వెనక్కి, ముందుకి వెళ్లడం నేపథ్యంలో సినిమాలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు విశాల్ (Vishal), ఎస్ జె సూర్య (SJSuryah) నటించిన సినిమా 'మార్క్ ఆంటోనీ' #MarkAtonyReview కూడా ఇలాంటి నేపథ్యంలో వచ్చిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమానే. దీనికి అధిక్ రవిచంద్రన్ (AdhikRavichandran) దర్శకుడు కాగా, ఎస్ వినోద్ కుమార్ నిర్మాత. ఇందులో రీతూ వర్మ కథానాయకురాలు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Mark Antony film review)

markantony1.jpg

Mark Antony story కథ:

ఆంటోనీ (విశాల్), జాకీ (ఎస్ జె సూర్య) ఇద్దరూ ప్రాణ స్నేహితులు, అలాగే గ్యాంగ్‌స్టర్స్ కూడాను. ఏకాంబరం (సునీల్) తన తమ్ముడిని ఆంటోనీ చంపాడని, అతని మీద పగ తీర్చుకోవడానికి ఆంటోనీ ని ఒక క్లబ్ లో ప్లాన్ వేసి చంపేస్తాడు. జాకీ గాడ్ ఫాదర్ అయిపోతాడు, ఆంటోనీ కొడుకు మార్క్ (విశాల్) ని కూడా తన కొడుకుతో పాటు పెంచుకుంటాడు. ఒక శాస్త్రవేత్త (సెల్వ రాఘవన్) ఒక ఫోన్ ని కనిపెడతాడు, దాని ద్వారా కాలంలో వెనక్కి వెళ్లొచ్చు (Time travel machine). ఈ ఫోన్ మార్క్ కి దొరుకుతుంది. #MarkAntonyReview మార్క్ ఎప్పుడూ తన తండ్రి ఒక పెద్ద రౌడీ అని, తన తల్లిని చంపిన నరరూప రాక్షసుడు అని నమ్ముతూ ఉంటాడు. అయితే ఈ ఫోన్ ద్వారా 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి తన తల్లితో (అభినయ) మాట్లాడుతాడు. అప్పుడు మార్క్ కి ఒక నిజం తెలుస్తుంది. ఏమాటా నిజం? ఇంతకీ 20 ఏళ్ల క్రితం చనిపోయిన మార్క్ ఎలా బతికాడు? అసలు ఆంటోనీని చంపింది ఏకాంబరమేనా లేదా వేరేవాడా? మరి బతికున్న జాకీ ఏమవుతాడు? ఇవన్నీ తెలియాలంటే 'మార్క్ ఆంటోనీ' సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈమధ్య ఈ టైమ్ ట్రావెల్ మీద చాల సినిమాలే వచ్చాయి. అటు హిందీలోనూ, ఇటు తమిళంలో అప్పుడెప్పుడో సూర్య (Surya) నటించిన '24', ఈమధ్యనే శర్వానంద్ (Sharvanand), ప్రియదర్శి (Priyadarshi), వెన్నెల కిషోర్ (VennelaKishore) నటించిన 'ఒకే ఒక జీవితం', ఇలా చాలానే వచ్చాయి. అయితే ఇలాంటివి తీసినప్పుడు కొంచెం ఆసక్తికరంగా, సరదాగా, నమ్మపలికేటట్టు ఉండాలి. కొన్ని దశాబ్దాల కిందట సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో బాలకృష్ణ (NandamuriBalakrishna) నటించిన 'ఆదిత్య 369' #Aditya369 కూడా వచ్చింది. ఇవన్నీ అలాంటివే. అయితే ఇప్పుడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్ (AdhikRavichandran) కూడా ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమా 'మార్క్ ఆంటోనీ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. #MarkAtonyReview

MarkAntony.jpg

ఈ 'మార్క్ ఆంటోనీ' సినిమాని దర్శకుడు కేవలం వినోదం పండించడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు. మొట్ట మొదట ఫోన్ లో వెనక్కి వెళ్లడం అనేదే నమ్మబుద్ధి కాదు. సరే ఇదొక కల్పిత కథే అనుకుంటే, దానికితోడు అర్థం పర్థం లేని సన్నివేశాలు, పోరాటాలు, వీటన్నికితోడు ఆ సంగీత నేపధ్యం అసలు చెవులు చిల్లులు పడతాయా అనేట్టుగా వున్నాయి. ఇవే ఇలా ఉంటే ఇక ఇది డబ్బింగ్ సినిమా కూడాను, ఒక్కొక్కరు మాట్లాడుకోరు, అరుస్తూ వుంటారు. టోటల్ గా ఈ సినిమా ఒక సౌండ్ పొల్యూషన్, అంటే శబ్ద కాలుష్యం అన్నమాట. దర్శకుడు ఏమి చెయ్యాలనుకున్నాడో, ఏమి చూపించాలని అనుకున్నాడో, ఏమి చెప్పాలని అనుకున్నాడో, ఏమీ అర్థం కాదు.

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు తప్పితే ఈ సినిమాలో ఎటువంటి ఆసక్తికర సన్నివేశం కూడా ఉండదు. పూర్వం నుండి తమిళ ప్రేక్షకులకి ఓవర్ యాక్టింగ్ బాగా నచ్చుతుంది, తెలుగువాళ్లకు అది నచ్చదు. అందుకే ఈ సినిమాలో ఎక్కువ గోలలు, అరుపులు తప్పితే సినిమాలు కథ ఏమీ ఉండదు, కథనం ఏమీ ఉండదు. జీవీ ప్రకాష్ నేపధ్య సంగీతం మరీ లౌడ్ గా వుంది. ఇందులో విశాల్, ఎస్ జె సూర్య తప్పితే తెలిసిన మొహాలు ఏమీ కనపడవు. అందరూ తమిళ నటులే, అందులోకి ఓవర్ యాక్షన్. అలాగే ఇంటర్వెల్ వరకు ఒక సినిమా, ఇంటర్వెల్ తరువాత ఇంకో సినిమాలా కనిపిస్తుంది. ఒక సూర్య, ఒక విశాల్ కాకుండా, ఇద్దరు సూర్యలు, ఇద్దరు విశాల్ లు ఇందులో, స్క్రీన్ అంతా వాళ్లే కనపడతారు. #MarkAntonyReview రెండో సగంలో ఎవరు బతుకుతుంటారో, ఎవరు చచ్చిపోతుంటారో కూడా అర్థం కాదు. కల్పితం అయినా కొంచెం నమ్మేట్టు ఉండాలి కదా. అదీ లేదు. టోటల్ గా ఇదొక శబ్ద కాలుష్యం సినిమా.

Mark-Antony.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే ఇందులో సూర్య బాగా డామినేట్ చేసాడు అనే చెప్పాలి. అయితే అతను ముసలి పాత్ర బాగుంది. అలాగే విశాల్ రెండో సగం లో ముసలి పాత్ర బాగుంది. అది సూపర్ గా చేసాడు. సెల్వ రాఘవన్ (SelvaRaghavan) శాస్త్రవేత్త గా పరవాలేదు అనిపించాడు. ఇది 1975 లో జరిగిన కథ కాబట్టి, అందరికీ జుట్టు బాగా పెరిగి ఉంటుంది. అప్పట్లో ఆలా ఉంటుంది అని దర్శకుడు అనుకున్నాడేమో మరి. సునీల్ (Sunil) పాత్ర అక్కడక్కడా కనిపిస్తుంది. రీతూవర్మ (RituVarma) పాత్ర ఒక మూడు నాలుగు సన్నివేశాల్లో కనిపిస్తుంది, అంతే. ఇక మిగిలిన వాళ్ళందరూ వస్తూ వుంటారు, వెళ్ళిపోతూ వుంటారు.

చివరగా, 'మార్క్ ఆంటోనీ' సినిమాలో కొత్తదనమ్ ఏమీ ఉండదు. ఇటువంటి కథలు ఇంతకు ముందు వచ్చాయి. అదే టైమ్ ట్రావెల్ మీద వచ్చిన మరో సినిమా. నేపధ్య సంగీతం చాలా ఓవర్ గా వుంది, అందరూ ఓవర్ యాక్షన్ చేస్తూ వుంటారు, అలాగే సినిమాలో శబ్ద కాలుష్యం వలన చెవులు చిల్లులు పడే ప్రమాదం కూడా వుంది.

Updated Date - 2023-09-15T15:59:28+05:30 IST