Sridevi Sobhan Babu Review: పేరు గొప్ప వూరు దిబ్బ

ABN , First Publish Date - 2023-02-18T16:12:59+05:30 IST

మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కుమార్తె, అల్లుడు సుష్మిత (Sushmitha Konidela), విష్ణు లు సినిమా నిర్మాణ రంగం లోకి ప్రవేశించి వెబ్ సిరీస్ లు, సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు తాజాగా వీరిద్దరూ సంతోష్ శోభన్ (Santosh Sobhan) కథానాయకుడిగా 'శ్రేదేవి శోభన్ బాబు' (Sridevi Sobhan Babu) అనే సినిమాను ఈ శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు.

Sridevi Sobhan Babu Review: పేరు గొప్ప వూరు దిబ్బ

నటీనటులు: సంతోష్ శోభన్, గౌరీ జి కిషన్, నాగబాబు, రోహిణి తదితరులు

ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ రామస్వామి

సంగీతం: కమ్రాన్

దర్శకత్వం: ప్రశాంత్ కుమార్ దిమ్మల

నిర్మాతలు: సుష్మిత కొణిదెల, విష్ణు

-- సురేష్ కవిరాయని

మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కుమార్తె, అల్లుడు సుష్మిత (Sushmitha Konidela), విష్ణు లు సినిమా నిర్మాణ రంగం లోకి ప్రవేశించి కొన్ని వెబ్ సిరీస్ లు, సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు తాజాగా వీరిద్దరూ సంతోష్ శోభన్ (Santosh Sobhan) కథానాయకుడిగా 'శ్రేదేవి శోభన్ బాబు' (Sridevi Sobhan Babu) అనే సినిమాను ఈ శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దీనికి దర్శకుడు కాగా, ఇందులో గౌరి కిషన్ (Gouri G Kishan) కథానాయకురాలుగా వేసింది. చిరంజీవి తమ్ముడు నాగబాబు (Nagababu) ఇందులో ఒక ప్రధాన పాత్రలో కనపడతారు.

sridevi1.jpg

కథ: ఇక కథ విషయానికి వస్తే, ఇదొక పాత కథ, ఇందులో కొత్తదనం ఇసుమంతయినా లేదు. శ్రీదేవి (గౌరి) హైదరాబాద్ లో ఒక ఫ్యాషన్ డిజైనర్, ఒకసారి అరకు వెళతా స్నేహితులతో అంటే, తండ్రి (నాగబాబు) వద్దు అని వారిస్తాడు. ఎందుకు అని అడిగితే, తండ్రి తన పాత జ్ఞాపకాలు చెప్తాడు.

#SrideviSobhanBabuReview అరకు తన సొంత వూరు అని, అక్కడ ఇల్లు కూడా ఉందని, చెల్లెలు అంటే ప్రాణమని, అటువంటి చెల్లెలు తో గొడవ జరిగి హైదరాబాద్ వచ్చేసాను అని చెప్తాడు. తండ్రికి జరిగిన అవమానానికి శ్రీదేవి పగ తీర్చుకుందుకు అరకు వెళ్లి అక్కడ తన అత్త (రోహిణి), బావ శోభన్ బాబు (సంతోష్ శోభన్) లను కలుస్తుంది. అక్కడ ఏమైంది, అసలు అన్న చెల్లెలుకి మధ్య ఏమి జరిగింది, శ్రీదేవి తన పగ తీర్చుకుందా, ఇదంతా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: మెగా ఫామిలీ నుండి వచ్చిన సుష్మిత కి అంతో ఇంతో సినిమా పరిజ్ఞానం ఉంటుంది. పైగా తన తండ్రి సినిమాలో కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పని చేసింది. ఒక సినిమా చేసేటప్పుడు ఆ దర్శకుడితో ఆ కథని మెగా ఫామిలీ లో ఎవరికీ వినిపించినా వాళ్ళు చెప్పేసేవాళ్ళు, ఆ కథ ఎలా ఉందొ, నడుస్తుందో నడవదు అని. మరి సుష్మిత ఇలాంటి 'శ్రీదేవి శోభన్ బాబు' కథ ఎలా ఎంచుకున్నారో అర్థం కావటం లేదు. దర్శకుడు ప్రశాంత్ కుమార్ ఒక పాసిపోయిన కథని తీసుకు వచ్చి చెప్పటం ఒక తప్పు అయితే, తెర మీద కూడా ఒక్క సన్నివేశం కూడా ఆసక్తికరంగా లేకుండా తీయడం ఇంకో పెద్ద తప్పు.

sridevi2.jpg

#SrideviSobhanBabuReview ఇలాంటి కథలు వున్న సినిమాలు పాతవి చాలా వున్నాయి. ఒక హాస్య సన్నివేశం లేదు, ఒక భావోద్వేగం లేదు, ఒక్కరి మొహం లో కూడా ఒక ఎమోషన్ లేదు, ఎదో కెమెరా ముందు నిలుచొని మాటలు చెప్పాలి అంటే చెప్పారు అన్నట్టుగా వుంది ఒక్కో సన్నివేశం. సినిమా మొదటి నుండీ చివరి వరకూ ఎంతసేపు అయిపోతుందా సినిమా అన్నట్టుగా ప్రేక్షకుడు చూస్తూ ఉంటాడు. #SrideviSobhanBabuReview

ఇక నటీనటుల విషయం లో సంతోష్ శోభన్ ఎదో ఒక సినిమాతో వస్తూనే వున్నాడు రెగ్యులర్ గా. కానీ అతను ఎదో సినిమా చేసేసాను అని కాకుండా, కథల విషయం లో జాగ్రత్త పడాలి. లేకపోతే కెరీర్ ప్రమాదంలో పడుతుంది. ఈమధ్య అతను చేసిన సినిమాలు విడుదల అయ్యాయి కానీ ఒక్కటి కూడా నడవలేదు, కనీసం అతనికి పేరు కూడా తెచ్చిపెట్టలేదు. ఈ 'శ్రీదేవి శోభన్ బాబు' కూడా అంతే. ఇంకో పరాజయం అతనికి. మంచి నటుడు, మనిషి కూడా బాగుంటాడు. అందుకని అతను చేస్తున్న సినిమా కథల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇంక గౌరి కథానాయికగా పరవాలేదు అనిపించింది. నాగబాబు, రోహిణి ల మధ్య ఆ అన్నాచెల్లెల అనుబంధం అంతగా ఆకట్టుకోలేదు. వాళ్ళిద్దరికీ ఇలాంటి పాటలు మామూలే, కొత్తగా ఏమి కనిపించలేదు. సంగీతం, ఛాయాగ్రహణం యావరేజ్ గా వున్నాయి. మాటలు కూడా. #SrideviSobhanBabuReview

చివరగా, 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా గురించి ఎవరూ అంతగా మాట్లాడుకోరు కూడా. ఈ సినిమా మీద ఏమి అంచనాలు లేవు, బజ్ కూడా అంత లేదు. ఇది త్వరగానే ఓ.టి.టి. లోకి వచ్చేస్తుంది. ఈ సినిమా 'పేరు గొప్ప వూరు దిబ్బ' అనే సామెతలా వుంది.

Updated Date - 2023-02-18T16:16:56+05:30 IST