Asvins Film Review: భయపెట్టిందో లేదో చదవండి...

ABN , First Publish Date - 2023-06-23T17:45:59+05:30 IST

ఈమధ్య మళ్ళీ హర్రర్ జానర్ వేపు కొన్ని సినిమాలు వెళుతున్నాయి. 'విరూపాక్ష' అలంటి కోవలోకే వస్తుంది, ఆ సినిమా ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ ఇప్పుడు ఇంకో సైకాలాజికల్ హర్రర్ సినిమా 'అశ్విన్స్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇది తమిళ సినిమా, కానీ తెలుగులోకి అదే పేరుతో విడుదల చేశారు. తరుణ్ తేజ దీనికి దర్శకుడు. వసంత్ రవి, విమలా రామన్ ఇందులో తెలిసిన నటులు.

Asvins Film Review: భయపెట్టిందో లేదో చదవండి...
Asvins Film Review

సినిమా: అశ్విన్స్

నటీనటులు: వసంత్ రవి (VasanthRavi), విమల రామన్ (VimalaRaman), సరస్వతి మీనన్ (SaraswathiMenon), మురళీధరన్, ఉదయదీప్ తదితరులు

ఛాయాగ్రహణం: ఏ ఎం ఎడ్విన్ సాకే (AM Edwin Sakay)

సంగీతం: విజయ్ సిద్ధార్థ్ (Vijay Siddharth)

దర్శకుడు: తరుణ్ తేజ (TarunTeja)

నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్ (BVSN Prasad)

-- సురేష్ కవిరాయని

'విరూపాక్ష' #Virupaksha సినిమా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఒక తమిళ సినిమా 'అశ్విన్స్' #AsvinsFilmReview ప్రొడ్యూస్ చెయ్యగా, అదే సినిమాని అదే పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలామంది తమిళ పరిశ్రమకి చెందినవారే అనిపిస్తుంది. అయితే దర్శకుడు, నిర్మాత మాత్రం తెలుగువారు. అందుకని ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేశారు. #AsvinsFilmReview ఇది ఒక సైకాలాజికల్ హార్రర్ సినిమా, అందుకే ఈ సినిమా ప్రచార చిత్రాల్లో ముందుగా 18 ఏళ్ల లోపు వారికి ఈ సినిమా చూడటానికి ప్రవేశం లేదు అని చెప్పేసారు. అది కూడా ప్రచారానికి ఉపయోగపడి అసలు ఈ సినిమాలో అంత భయం కల్పించే సన్నివేశాలు ఏమున్నాయి అని చూడటానికి ఆసక్తి చూపిస్తారు. తరుణ్ తేజ దర్శకుడు కాగా, వసంత్ రవి ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు.ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

asvinsfilmreview.jpg

Asvins story కథ:

ఈ కథ లండన్ శివార్లలో ఒక భవంతిలో జరుగుతుంది. అర్జున్ (వసంత్ రవి), రీతూ (సరస్వతి మీనన్), వరుణ్ (మురళీధరన్ సుబ్రమణియన్), రాహుల్ (ఉదయ దీప్), గ్రేస్ (మలినా అతుల్) వీళ్ళందరూ పాపులర్ యూట్యూబర్స్. వీళ్ళు పాడుపడిన భవంతులను చూసి వాటిలో దెయ్యాలు ఉన్నాయని వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు. వీళ్ళు చేసిన వీడియోలు చూసి లండన్ లో బ్లాక్ టూరిజం ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. లండన్ నగర శివార్లలో ఓ పాడుపడిన భవంతిలో ఏముందో రికార్డ్ చేయాలి. #AsvinsFilmReview అందులోనే ఒక పేరున్న ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్ (విమలా రామన్) ఉంటూ ఉండేది. ఆ భవంతిలో చాలా శవాలు దొరికాయి, కానీ ఆర్తి రాజగోపాల్ శవం మాత్రం దొరకలేదు. అది ఒక బూత్ బంగ్లాలా వదిలేస్తారు, ఇప్పుడు ఈ యూట్యూబర్స్ అందులోకి వెళ్లి అందులో ఏముందో డాక్యుమెంటరీ తీయాలి. అయితే ఆలా వెళ్లినవాళ్ళకి ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి, ఇంతకీ అందులో దెయ్యాలు ఉన్నాయా? ఆ ఆర్కియాలజిస్ట్ శవం దొరికిందా? ఇవన్నీ తెలియాలంటే ఈ 'అశ్విన్స్' సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు తరుణ్ తేజ అసలు సినిమా ప్రారంభానికి పురాణాల్లో వున్నా అశ్విని దేవతల గురించి చెప్తాడు. అశ్విని దేవతలు ఇద్దరుంటారు, ఒకేలా వుంటారు అంటే కవలలు. ఆరోగ్యానికి వాళ్ళు దేవతలు. ఇక భూమ్మీద చాలా ఏళ్ల క్రితం ఒక గ్రామంలో ఒక రైతు ఉంటాడు, అతనికి ఇద్దరు కవలపిల్లలు. కొంచెం పెద్దయ్యాక ఇద్దరూ మరణిస్తారు. ఆ రైతు వారిని మళ్ళీ బతికించటం కోసం తపస్సు చేస్తాడు, అతని తపస్సుకి మెచ్చి అశ్విని దేవతలు ప్రత్యక్షమవుతారు. ఇద్దరిలో ఒకరిని బతికిస్తామని చెప్పి ఒకడిని బతికిస్తాడు. అతనికి రెండు శక్తివంతమైన గుర్రాల బొమ్మలు ఇచ్చి ఎప్పుడూ అవి అతని దగ్గర పెట్టుకోమని చెప్తారు, అవి రెండూ కలిసి ఉన్నంత కాలం అతనికి అసహజ మరణం ఉండదు అని చెప్తారు. ఈలోగా పాతాళంనుండి ఒక రాక్షసుడు ఈ బొమ్మల గుర్రాల శక్తి తెలుసుకొని, ఈ బాలుడు దగ్గరికి వస్తాడు. మరణించిన ఇంకో తమ్ముడిని కూడా బతికిస్తాను, రెండు గుర్రాల బొమ్మలో ఒకటి ఇమ్మంటాడు. సరే అని ఇచ్చేస్తాడు ఆ బాలుడు. అది రాక్షసుడికి శక్తినిస్తుంది.

asvinsfilmreview1.jpg

ఈ పురాణ కథ చెప్పి ఇప్పుడు వున్న కథలోకి వస్తాడు దర్శకుడు. అయిదుగురు యూట్యూబర్స్ ఆ ఇంగ్లండ్లో వున్న భవంతిలోకి వెళ్ళటం, అందులో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా భయంగొలిపే సంఘటనలు జరగటం ఇవ్వన్నీ బాగా తీసాడు దర్శకుడు.బ్లాక్ టూరిజం ప్రమోట్ చెయ్యడానికి డాక్యుమెంటరీ తీయాలని వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఇస్తాడు.#AsvinsFilmReview ఇలా ఒక 20 నిముషాల వరకు ఆసక్తికరంగా ఉంటుంది, ఆ తరువాత గాడి తప్పుతుంది. ఎందుకంటే కథ తెలిసిపోతూ ఉంటుంది, అలాగే కెమెరాని, ప్రేక్షకుడు వ్యూ పాయింట్ లో చూపించడం కొంచెం బాగోలేదు. ఇందులో అర్జున్ పాత్రని రెండు రకాలుగా చూపిస్తాడు.

రెండో సగంలో మళ్ళీ కథ కొంచెం ఆసక్తికరంగా సాగుతుంది. విమలా రామన్ ఈ రెండో సగంలో సినిమాని కాపాడింది అని చెప్పొచ్చు. ఆమె పాత్ర చిన్నదయినా ఆసక్తికరంగా వుంది, సినిమాకి ప్రత్యేకంగా నిలుస్తుంది, ఆమె బాగా చేసింది కూడా. #AsvinsFilmReview అలాగే మొదట్లో కనిపించే చిక్కులన్నీ రెండో సగంలో ఇప్పుకుంటూ వెళతాడు. ఇలాంటి హర్రర్ సినిమాలకి నేపధ్య సంగీతం చాలా ముఖ్యం, అది ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. కొన్ని సన్నివేశాలు భయపెడతాయి. అలాగే దర్శకుడు పురాణాల్లో అశ్వినీ దేవతలకి, ఇక్కడ ప్రస్తుతం కథకి సరిగ్గా కనెక్షన్ చూపించలేకపోయారు. అవి కొంచెం అర్థం అయ్యే విధంగా చూపిస్తే బాగుండేది.

ఇందులో నటించే నటీనటులు అందరూ బాగా చేశారు. విమల రామన్ తో సహా వసంత్ రవి, ఉదయదీప్, సరస్వతీ మీనన్ అందరూ బాగా నటించారు. అక్కడక్కడా భయపెట్టిన, ఈ సైకాలాజికల్ హర్రర్ 'అశ్విన్స్' సినిమా హర్రర్ జానర్ చూసే ప్రేక్షకులకి నచ్చుతుంది అని అనుకుంటున్నా.

Updated Date - 2023-06-23T17:45:59+05:30 IST