Agent Film Review: అయ్యగారి ఏజెంట్ ఎలా ఉందంటే...

ABN , First Publish Date - 2023-04-28T11:35:40+05:30 IST

అఖిల్ అక్కినేని సినిమా విడుదల అయి సుమారు రెండ్జ్ సంవత్సరాల పైనే అయింది. ఇప్పుడు 'ఏజెంట్' గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో అఖిల్ స్పై గా కనపడుతున్నాడు, దీనికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఎలా ఉందంటే..

Agent Film Review: అయ్యగారి ఏజెంట్ ఎలా  ఉందంటే...
Agent Movie Review

సినిమా: ఏజెంట్

నటీనటులు: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్మూట్టి, డినో మోరియా, సంపత్ రాజ్, విక్రమజిత్ విర్క్ తదితరులు.

ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్

సంగీతం: హిప్ హాప్ తమిజా

కథ: వక్కంతం వంశీ

నిర్మాత: సుంకర రామబ్రహ్మం

దర్శకత్వం: సురేందర్ రెడ్డి

-- సురేష్ కవిరాయని

అఖిల్ అక్కినేని సినిమా విడుదల అయి సుమారు రెండు సంవత్సరాల పైనే అయింది. ఇప్పుడు 'ఏజెంట్' గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో అఖిల్ స్పై గా కనపడుతున్నాడు, దీనికి సురేందర్ రెడ్డి దర్శకుడు. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా ప్రత్యేక పాత్రలలో నటించారు. ఈ సినిమా అఖిల్ కెరీర్ లో చాలా ముఖ్యమైనది. దీనికోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు కూడా, ఆలాగే దర్శకుడు సూరి కూడా కొన్ని నెలలపాటు సిక్ అయ్యాడు. సాక్షి వైద్య కథానాయకురాలిగా పరిచయం అవుతోంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది.. అఖిల్ కి బ్రేక్ ఇస్తుందో లేదో చూద్దాం #AgentReview

akhilakkineniagent1.jpg

Agent story కథ:

రామకృష్ణ అలియాస్ రికీ (అఖిల్)కి #AkhilAkkineni స్పై అవ్వాలని డ్రీమ్.. అందుకని RAW పరీక్షలు రాస్తూ ఉంటాడు. మూడు సార్లు ఫెయిల్ అవుతాడు. రా చీఫ్ మహాదేవ్ అలియాస్ డెవిల్ (మమ్ముట్టి) తనకి స్ఫూర్తి అని అతని ఫోటోస్ పెట్టుకొని ప్రైవేట్ గా తను కొంతమంది మీద ఇన్వెస్టిగేట్ చేస్తూ, హేకింగ్ కూడా చేస్తూ ఉంటాడు. అలా ఒకసారి రా సంస్థను కూడా హ్యాక్ చేస్తాడు. రా అధినేత మహదేవ్ ఎవరు హ్యాక్ చేశారని తెలుసుకొని అఖిల్ #AgentReview దగ్గరికి వస్తాడు. అఖిల్ తను ఏజెంట్ అవ్వాలనుకున్నట్టుగా అందుకే హ్యాక్ చేసినట్టు మహదేవ్ కి చెప్తాడు. మహదేవ్ రికీని ఏజెంట్ గా పనికిరావు అంటాడు. ఈ లోపు గాడ్ అలియాస్ ధర్మ (డినో మోరియా) భారత దేశంలో బాంబులు పెట్టి అది శాటిలైట్ ద్వారా పేల్చడానికి చూస్తాడు. పంపిన ఏజెంట్ లు అందర్నీ గాడ్ కనిపెట్టిస్తుంటాడు, అందుకని మహాదేవ్.. రికిని ఏజెంట్ గా నియమించి గాడ్ అలియాస్ ధర్మ ని పట్టుకోమని పంపిస్తాడు. రికి, గాడ్ ని పట్టుకున్నాడా లేక గాడ్ తో చేతులు కలిపాడా చివరికి ఏమైంది? తెలియాలంటే ఏజెంట్ చూడాల్సిందే.

Agent.jpg

విశ్లేషణ:

దర్శకుడు సురేందర్ రెడ్డి ఈసారి ఒక స్పై జానర్ ని ఎంచుకున్నాడు. దీనికి అఖిల్ అక్కినేనిని బాగానే ప్రిపేర్ చేశాడు కానీ కథలోనే కొంచెం తడబాటు పడ్డాడు. స్పై సినిమా అనగానే ట్విస్టులు, టర్నులు అవసరం లేదు.. మంచి కథ పట్టుకుని ఆసక్తికరంగా చూపిస్తే చాలు. దర్శకుడు అక్కడక్కడ సన్నివేశాలు బాగా రావాలని వాటి మీద దృష్టి పెట్టి కథని గాలికి వదిలేశాడని అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాగా చూస్తే కథలో చాలా లోపాలు ఉంటాయి. అక్కడక్కడా సన్నివేశాలు చూస్తే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని సీన్లు బాగుంటాయి. అయితే ఏ సినిమాకి అయిన కథ, కథనం ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టలేకపోయాడు సురేందర్ రెడ్డి. బహుశా సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ లు రావడం వల్లేమో సినిమా కూడా అలానే అనిపిస్తుంది. అందుకే ఏదో మిస్సయ్యామా! అన్నట్టుగా ఉంటుంది. మొదటి సగం సాదాసీదాగా సాగుతుంది, లీడ్ పెయిర్ మధ్యలో వచ్చే సన్నివేశాలు, అఖిల్ కుటుంబం అలా ఏదో చూపించాడు కానీ ఎక్కడా ఎమోషన్ ఉండదు, పోనీ అలా అని కామెడీ కూడా లేదు. అఖిల్ ఫిజిక్ చూపించటంలోనే ఎక్కువ నిమగ్నం అయ్యారా అనిపిస్తుంది. మొదటి సగం అయ్యాక మమ్ముట్టి కథానాయకుడేమో అని అనిపిస్తుంది కూడా. అలాగే రెండో సగంలో డినో మోరియా కూడా అలానే అనిపిస్తాడు.

akhilakkineniagent2.jpg

కథానాయకుడికి ఇవ్వాల్సిన ఎలివేషన్ సన్నివేశాలు చాలా తక్కువ. మమ్ముట్టిని పరిచయం చేసిన సన్నివేశం అదిరింది. అందుకే అతనే కథానాయకుడిలా అనిపించాడు. డినో మోరియా పాత్రని సరిగ్గా రాయలేకపోవటం వలన కథలో చాలా లోటుపాట్లు కనిపిస్తాయి. ఏమైనా ఇంత హైప్ ఇచ్చిన ఈ సినిమాకి దానికి తగ్గట్టుగా లేదు అని అనిపిస్తుంది. పాటలు కూడా అంతగా లేవు.

నటీనటులు ఎలా చేశారంటే..

అఖిల్‌ని స్క్రీన్ మీద చూసేటప్పుడు చాలా కష్టపడ్డాడని తెలుస్తోంది. కానీ బాడీ చూపిస్తే కాదు కదా దానికి తగ్గట్టుగా కథ కూడా ఉండాలి. యాక్షన్ సన్నివేశాలు ఇరగదీశాడు. మమ్ముట్టి సూపర్ స్టార్ అలాగే అనుభవము ఉన్న నటుడు, కాబట్టి రా చీఫ్ గా చాలా బాగా చేశాడు. అసలు చెప్పాలంటే అతనే సినిమాకి ఆయువుపట్టు. డినో మోరియా బాగున్నాడు. సాక్షి వైద్య కేవలం పాటలకు మాత్రమే. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉంది. మిగతా వాళ్లు అందరూ ఓకే.

చివరగా, ఈ 'ఏజెంట్' అనుకున్నంతగా ఉండడు. అక్కడక్కడా కొన్ని యాక్షన్ సన్నివేశాలు తప్పితే, సినిమాగా చూస్తే మాత్రం చాలా గందరగోళంగా ఉంటుంది.

Updated Date - 2023-04-28T14:47:19+05:30 IST