సినిమా చూశాకే.. ఆ సంగతి తెలుస్తుంది
ABN , First Publish Date - 2023-10-31T06:02:18+05:30 IST
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. సాయి కిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది...

శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. సాయి కిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోమవారం హైదరాబాద్‌లో టీజర్ విడుదల చేశారు. ‘‘కేవలం రెండు నెలల్లో సినిమా పూర్తయిపోయింది. దర్శకుడు చాలా క్లారిటీగా ఈ కథని తెరకెక్కించారు. ఇంత మంచి నిర్మాతని నా జీవితంలో చూడలేద’’న్నారు శ్రీకాంత్ శ్రీరామ్. ‘‘ఇదొక ఇంటెన్స్ హారర్ సినిమా. పిండం అనేది నెగెటివ్ టైటిల్ కాదు. ఓ మనిషి జీవితం పిండంతో మొదలై.. పిండంతోనే సమాప్తం అవుతుంది. ఈ కథకు ఈ టైటిల్ ఎందుకు పెట్టామో.. సినిమా చూశాకే తెలుస్తుంద’’న్నారు దర్శకుడు. ‘‘ఈ ప్రాజెక్ట్ గురించి తెలిశాక.. సాయి కిరణ్‌గారు తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. దాంతో ఆయనతో పని చేయాలన్న కోరిక పెరిగింద’’న్నారు అవసరాల శ్రీనివాస్.