సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రావణాసురుడిని దాటాల్సిందే!

ABN, First Publish Date - 2023-03-07T00:44:37+05:30

‘‘సీతని తీసుకెళ్లాలంటే సముద్రాన్ని దాటితే సరిపోదు... ఈ రావణాసురుడిని దాటాలి’’ అంటూ పవర్‌ ఫుల్‌ డైలాగులతో ఆకట్టుకొంటున్నారు రవితేజ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘సీతని తీసుకెళ్లాలంటే సముద్రాన్ని దాటితే సరిపోదు... ఈ రావణాసురుడిని దాటాలి’’ అంటూ పవర్‌ ఫుల్‌ డైలాగులతో ఆకట్టుకొంటున్నారు రవితేజ. ఆయన తాజా చిత్రం ‘రావణాసుర’లోని డైలాగ్‌ ఇది. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అభిషేక్‌నామాతో కలిసి రవితేజ ఈ చిత్రాన్ని నిర్మించారు. అను ఇమ్మానియేల్‌, మేఘా ఆకాశ్‌, ఫరియా అబ్దుల్లా కథానాయికలు. సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్‌ 7న విడుదల అవుతోంది. సోమవారం టీజర్‌ విడుదల చేశారు. ఇదో యాక్షన్‌ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ అనే సంగతి టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. రవితేజ పాత్రని పాజిటివ్‌గా చూపిస్తున్నారా? నెగెటివ్‌ కోణంలో సాగుతుందా? అనే ఆసక్తి నెలకొంది. సుశాంత్‌ పాత్రని సైతం చాలా కొత్తగా తీర్చిదిద్దారు. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ నేపథ్య సంగీతం, విజయ్‌ కార్తీక్‌ కెమెరా పనితనం ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. శ్రీకాంత్‌ విస్సా సంభాషణలు అందించారు.

Updated Date - 2023-03-07T00:44:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!