ఇలాంటి పాట రావాలంటే గట్స్ ఉండాలి
ABN, First Publish Date - 2023-11-29T00:50:08+05:30
బాబీ సింహా, వేదిక అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘రజాకార్’. యాటా సత్యనారాయణ దర్శకుడు. గూడూరు నారాయణ రెడ్డి నిర్మాత...
బాబీ సింహా, వేదిక అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘రజాకార్’. యాటా సత్యనారాయణ దర్శకుడు. గూడూరు నారాయణ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘పోతుగడ్డ మీద’ అనే గీతాన్ని మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ ‘‘రజాకార్ ఉద్యమంలో మా తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. వాళ్ల బిడ్డగా ఈ పాట రాశాను కాబట్టే, ఇందులో ఇంత ఎమోషన్ ఉందేమో? సంగీత దర్శకుడు భీమ్స్, నృత్య దర్శకురాలు స్వర్ణ.. ఇలా మేమంతా కలిసి ఏకాత్మగా ఈ పాటని రూపొందించాం. ఇలాంటి పాట తీయాలంటే డబ్బులు ఉంటే సరిపోదు. గట్స్ కూడా కావాలి’’ అన్నారు. ‘‘మా తాతగారు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనకు నివాళిగా నేను ఈ సినిమా చేశానని అనుకొంటున్నా’’నని భీమ్స్ తెలిపారు. ‘‘మన పూర్వీకులను గుర్తు చేసుకొంటూ మేం ఇస్తున్న నివాళి ఈ సినిమా. నా ఎమోషన్‌ని అర్థం చేసుకొని భీమ్స్ స్వరాలు సమకూర్చారు. సుద్దాల వాటికి అక్షరాలు పొదిగార’’న్నారు దర్శకుడు.