నిన్న కేరళ స్టోరీ... ఇప్పుడు నక్సల్‌ కథ

ABN , First Publish Date - 2023-10-20T02:40:56+05:30 IST

దేశం దృష్టిని ఆకర్షించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రబృందం మరో సంచలన కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అదాశర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘బస్తర్‌:ద నక్సల్‌ స్టోరీ’ అనే టైటిల్‌ను...

నిన్న కేరళ స్టోరీ... ఇప్పుడు నక్సల్‌ కథ

దేశం దృష్టిని ఆకర్షించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రబృందం మరో సంచలన కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అదాశర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘బస్తర్‌:ద నక్సల్‌ స్టోరీ’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. ‘ది కేరళ స్టోరీ’ దర్శక నిర్మాతలు సుదీప్తోసేన్‌, విపుల్‌ అమృత్‌లాల్‌ షా కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ గురువారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని అదాశర్మ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.‘‘బస్తర్‌’ చిత్రం కోసం వందమంది ముందు ఆడిషన్‌ ఇచ్చాను. ‘ది కేరళ స్టోరీ’ చిత్రంలానే ఈ చిత్రాన్ని కూడా ఆదరించాల’ని ఆమె ప్రేక్షకులను కోరారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-10-20T02:40:56+05:30 IST