కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యాక్షన్‌ సీన్ల కోసం బాగా కష్టపడ్డా

ABN, First Publish Date - 2023-10-11T05:12:38+05:30

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఇంతకుముందు ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలు వచ్చాయి. ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా ‘టైగర్‌ 3’. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌...

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఇంతకుముందు ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలు వచ్చాయి. ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా ‘టైగర్‌ 3’. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ పోషించిన టైగర్‌ పాత్రకు దీటుగా ఉండే జోయా పాత్రను కట్రీనా కైఫ్‌ పోషించారు. ఆ పాత్రలో ఆమె నటించిన తీరుకు పలువరి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ‘టైగర్‌ 3’లో లేడీ స్పైగా కట్రీనా నటించిన జోయా లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఒక చేత్తో రోప్‌ని, మరో చేత్తో గన్‌ని పట్టుకుని యాక్షన్‌ మోడ్‌లో ఆమె కనిపించారు. ఈ సందర్భంగా కట్రీనా మాట్లాడుతూ ‘ఈ సినిమాలో జోయా పాత్ర పోషించడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోయే ఆ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ పాత్ర పోషించడం ఒకరకంగా నాకు ఛాలెంజ్‌. ఎందుకంటే ‘టైగర్‌ 3’లో యాక్షన్‌ సన్నివేశాలు నెక్స్ట్‌ లెవెల్‌లో ఉండాలని ముందే అనుకున్నాం. నేను పాల్గొన్న యాక్షన్‌ సన్నివేశాలు గొప్పగా ఉండాలని ఎంతో కష్టపడ్డా. నేను యాక్షన్‌ సినిమాలకు అభిమానిని. అందుకే ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొనడం ఎంతో ఎగ్జయిటింగ్‌ గా అనిపించింది. నా పాత్ర చూసి ప్రేక్షకులు ఎలా రియాక్ట్‌ అవుతారో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అన్నారు. మనీష్‌ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం దీపావళికి విడుదలవుతుంది.

Updated Date - 2023-10-11T05:12:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!