ఊహకందని మలుపులతో...

ABN , First Publish Date - 2023-10-02T01:28:05+05:30 IST

హన్సిక నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది...

ఊహకందని మలుపులతో...

హన్సిక నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఊహకందని మలుపులతో సాగే కథ ఇది. హన్సిక కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది. ఇప్పటి వరకూ గ్లామర్‌ నాయికగానే చూసిన హన్సికతో తొలిసారి పూర్తి స్థాయిలో యాక్షన్‌ చేయించామ’’న్నారు. మురళీ శర్మ, జయ ప్రకాశ్‌, వినోదిని, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం: మార్క్‌ కె.రాబిన్‌.

Updated Date - 2023-10-02T01:28:05+05:30 IST