టైగర్ పోరాటాలతో...
ABN , First Publish Date - 2023-10-11T05:09:16+05:30 IST
టైగర్ ష్రాఫ్, కృతీసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గణపధ్’. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషించారు. వికాస్ బహ్లా దర్శకుడు. ఈ యాక్షన్ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది...

టైగర్ ష్రాఫ్, కృతీసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గణపధ్’. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషించారు. వికాస్ బహ్లా దర్శకుడు. ఈ యాక్షన్ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది. మంగళవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. స్టన్నింగ్ విజువల్స్, ఉత్కంఠ రేపే పోరాటాలతో ట్రైలర్ ఆద్యంతం అలరించింది. ఈ సందర్భంగా నిర్మాత జాకీ భగ్నానీ మాట్లాడుతూ ‘గణపధ్ ప్రచార చిత్రాలకు వస్తున్న స్పందనతో చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల అంచనాలను అందుకుంటామనే నమ్మకం ఉంద’న్నారు.