కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటు విలువ చెప్పే కథతో...

ABN, First Publish Date - 2023-08-27T02:27:17+05:30

హృతిక్‌ శౌర్య హీరోగా నటించిన చిత్రం ‘ఓటు’. చాలా విలువైనది అనేది ఉపశీర్షిక. తన్వి నేగి కథానాయిక. రవి దర్శకత్వం వహించారు...

హృతిక్‌ శౌర్య హీరోగా నటించిన చిత్రం ‘ఓటు’. చాలా విలువైనది అనేది ఉపశీర్షిక. తన్వి నేగి కథానాయిక. రవి దర్శకత్వం వహించారు. ఫ్లిక్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మించింది. శనివారం హైదరాబాద్‌లో సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ టీజర్‌ ఆవిష్కరించారు. ‘‘ఓటుకు డబ్బుల్ని అడుక్కొంటున్న స్థాయికి దిగజారిపోయిన సమాజాన్ని తట్టి లేపాల్సిన అవసరం ఉంది. ఓ మంచి ఉద్దేశంతో తీసిన ఈ చిత్ర బృందానికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఓటు విలువ చెబుతూనే కమర్షియల్‌ టచ్‌ ఇచ్చిన కథ ఇది. తప్పకుండా అన్ని వర్గాలకూ నచ్చుతుంద’’ని దర్శకుడు తెలిపారు.

Updated Date - 2023-08-27T02:27:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!