ఆ ఒక్కడి కథతో

ABN , First Publish Date - 2023-08-20T01:55:47+05:30 IST

పారిశ్రామిక వేత్త తల్లాడ వెంకన్న హీరోగా శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఒక్కడే 1’. తల్లాడ శ్రీలక్ష్మి, సునీల్‌ నిర్మాతలు...

ఆ ఒక్కడి కథతో

పారిశ్రామిక వేత్త తల్లాడ వెంకన్న హీరోగా శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఒక్కడే 1’. తల్లాడ శ్రీలక్ష్మి, సునీల్‌ నిర్మాతలు. సునీత, శృతిక, మధువని కథానాయికలు. ఇటీవలే ఈ చిత్రం టీజర్‌, పోస్టర్‌ను మాజీ ఐపీఎస్‌ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ‘నాకు పోలీసాఫీసర్‌ అవ్వాలనే కోరిక ఉన్నా కొన్ని కారణాల వల్ల సాధించలేకపోయాను. ఈ సినిమా ద్వారా ఆ కోరిక తీరింది. సినిమాలో మంచి కథ, మలుపులు ఉన్నాయి’ అన్నారు.

Updated Date - 2023-08-20T01:55:47+05:30 IST