With more entertainment than the first part :తొలి భాగాన్ని మించే వినోదంతో

ABN , First Publish Date - 2023-10-15T04:08:34+05:30 IST

సత్యం రాజేశ్‌, డాక్టర్‌ కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, బాలాదిత్య ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. గతంలో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి ఇది సీక్వెల్‌...

With more entertainment than the first part :తొలి భాగాన్ని మించే వినోదంతో

సత్యం రాజేశ్‌, డాక్టర్‌ కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, బాలాదిత్య ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. గతంలో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి ఇది సీక్వెల్‌. డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించారు. నవంబర్‌ 3న ఈ చిత్రం విడుదలవుతోంది. శనివారం చిత్రబృందం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. దర్శకుడు హరీశ్‌ శంకర్‌, హీరో కార్తికేయ, నిర్మాత బన్నీవాస్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించి సినిమా ఘన విజయం సాఽధించాలని ఆకాంక్షించారు. నిర్మాత మాట్లాడుతూ ‘దర్శకుడు నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంద’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘పార్ట్‌ 1కు మించి పార్ట్‌ 2 ఉండబోతోంది. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’ చెప్పారు. సినిమాలో ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంటుందని బాలాదిత్య తెలిపారు. ఈ సినిమాతో మొదలైన ప్రయాణం ఇక్కడ వరకూ రావడం ఆనందంగా ఉందని సత్యం రాజేశ్‌ చెప్పారు.

Updated Date - 2023-10-15T04:08:34+05:30 IST