కార్తికేయతో మళ్లీ సినిమా తీస్తా

ABN , First Publish Date - 2023-08-22T00:33:47+05:30 IST

ఏదైనా ఓ కొత్త పాయింట్‌ లేకపోతే నేను సినిమా చూడను. నేను సినిమా చేసినా అదే ఆలోచిస్తా. ఆ కొత్తదనం ‘బెదురులంక’లో ఉంద’’న్నారు బెన్నీ ముప్పానేని. ఆయన నిర్మించిన చిత్రమిది. కార్తికేయ కథానాయకుడు...

కార్తికేయతో   మళ్లీ సినిమా తీస్తా

ఏదైనా ఓ కొత్త పాయింట్‌ లేకపోతే నేను సినిమా చూడను. నేను సినిమా చేసినా అదే ఆలోచిస్తా. ఆ కొత్తదనం ‘బెదురులంక’లో ఉంద’’న్నారు బెన్నీ ముప్పానేని. ఆయన నిర్మించిన చిత్రమిది. కార్తికేయ కథానాయకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బెన్నీ మాట్లాడుతూ ‘‘ఓ ఊహాజనిత గ్రామంలో జరిగే కథ ఇది. 2012 నేపథ్యంలో సాగుతుంది. కథలో చాలా పాత్రలు ఉంటాయి. అయితే ఒక్క పాత్ర కూడా అనవసరం అనిపించదు. వినోదాత్మకంగా సాగుతూనే, భావోద్వేగాలు పండించేలా తీర్చిదిద్దాం. కార్తికేయ సహకారం మర్చిపోలేనిది. తనతో మరో సినిమా చేస్తా. నేహా శెట్టి కూడా చక్కగా నటించింది. ఎటువంటి పాత్రకైనా తను సరిపోతుందని ఈ సినిమాతో నిరూపిస్తుంది. మణిశర్మ సంగీతం మాకు కొండంత బలం. సిరివెన్నెల సీతారామశాస్ర్తి గారితో ఓ పాట రాయించాం. ఆయన సగం పాట రాసి శివైక్యం చెందారు. మిగిలిన సగం పాటని చైతన్య ప్రసాద్‌ రాశారు. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రేక్షకులు మంచి ఫలితాన్ని ఇస్తారన్న నమ్మకం ఉంద’’న్నారు

Updated Date - 2023-08-22T00:33:47+05:30 IST