‘కాంతార’ స్వర కర్తతో...
ABN , First Publish Date - 2023-01-21T05:32:33+05:30 IST
‘ఆర్.ఎక్స్ 100’తో ఆకట్టుకొన్న దర్శకుడు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం ‘మహా సముద్రం’ నిరాశ పరిచింది...
‘ఆర్.ఎక్స్ 100’తో ఆకట్టుకొన్న దర్శకుడు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం ‘మహా సముద్రం’ నిరాశ పరిచింది. ఇప్పుడు ఆయన మూడో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘ఎ క్రియేటీవ్ వర్క్స్’, ‘ముద్ర మీడియా వర్క్స్’ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీత దర్శకుడిగా ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌ని ఎంచుకొన్నారు. నటీనటుల ఎంపిక కూడా పూర్తయింది. ఇదో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రమని సమాచారం. అజయ్ భూపతి ప్రస్తుతం స్ర్కిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడవుతాయి.