ఎన్టీఆర్‌కి జోడీగా...
ABN , First Publish Date - 2023-05-10T00:38:45+05:30 IST
బాలీవుడ్ భామలు ఈమధ్య టాలీవుడ్‌కి వరుస కడుతున్నారు. దీపికా పదుకొణె, అలియాభట్, జాన్వీ కపూర్.. వీళ్లంతా టాలీవుడ్‌లో మెరుస్తున్నారు. శ్రద్దాకపూర్ కూడా ‘సాహో’తో తెలుగు ప్రేక్షకుల్ని...

బాలీవుడ్ భామలు ఈమధ్య టాలీవుడ్‌కి వరుస కడుతున్నారు. దీపికా పదుకొణె, అలియాభట్, జాన్వీ కపూర్.. వీళ్లంతా టాలీవుడ్‌లో మెరుస్తున్నారు. శ్రద్దాకపూర్ కూడా ‘సాహో’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. తాజాగా మరో సినిమా కూడా ఒప్పుకొందని సమాచారం. ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా శ్రద్దాకపూర్ అయితే బాగుంటుందని ప్రశాంత్ భావిస్తున్నాడట. అయితే ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు పనులు ఇంకా పూర్తి కాలేదు. అదయ్యాక.. శ్రద్దా విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ‘సలార్’తో బిజీగా ఉన్నారు ప్రశాంత్. అది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా మొదలెడతారు. ఈలోగా కొరటాల శివతో సినిమాని పూర్తి చేస్తారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.