ఊహకు అందని కథతో...

ABN , First Publish Date - 2023-01-30T00:42:28+05:30 IST

శివ కందుకూరి టైటిల్‌ పాత్ర పోషించిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’. రాశీ సింగ్‌ కథానాయిక. పురుషోత్తం రాజ్‌ దర్శకుడు...

ఊహకు అందని కథతో...

శివ కందుకూరి టైటిల్‌ పాత్ర పోషించిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’. రాశీ సింగ్‌ కథానాయిక. పురుషోత్తం రాజ్‌ దర్శకుడు. స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై నిర్మాతలు. శనివారం హైదరాబాద్‌లో టీజర్‌ విడుదలైంది. ‘‘పోలీసులకు చుక్కలు చూపించే ఓ సీరియల్‌ కిల్లర్‌ని పట్టుకోవడానికి డిటెక్టీవ్‌ భాస్కర్‌ నారాయణ రంగంలోకి దిగుతాడు. ఆ తరవాత ఏమైందన్నదే కథ. ప్రతీ సన్నివేశం ఉత్కంఠ కలిగిస్తుంది. ఊహకు అందరి కథ, కథనాలతో ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. టీజర్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. మార్చి 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌.

Updated Date - 2023-01-30T00:46:09+05:30 IST