టైమ్‌ ట్రావెల్‌ థీమ్‌తో ...

ABN , First Publish Date - 2023-08-26T05:23:22+05:30 IST

విశాల్‌ హీరోగా రూపుదిద్దుకుంటున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మార్క్‌ ఆంటోనీ’ సెప్టెంబర్‌ 15న విడుదల కానుంది. ఇందులో విశాల్‌కు జోడీగా రీతూ వర్మ నటిస్తున్నారు...

టైమ్‌ ట్రావెల్‌ థీమ్‌తో ...

విశాల్‌ హీరోగా రూపుదిద్దుకుంటున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మార్క్‌ ఆంటోనీ’ సెప్టెంబర్‌ 15న విడుదల కానుంది. ఇందులో విశాల్‌కు జోడీగా రీతూ వర్మ నటిస్తున్నారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఎస్‌.వినోద్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. దర్శకుడు, నటుడు ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుంతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ‘ఐ లవ్‌ యూ నే’ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. హీరోహీరోయిన్ల మాస్‌ స్టెప్స్‌, ఫాస్ట్‌ బీట్‌ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో విశాల్‌ గెటప్‌ విభిన్నంగా ఉంది. వినాయకచవితి సందర్బంగా సెప్టెంబర్‌ 15న సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. టైమ్‌ ట్రావెల్‌ థీమ్‌ చుట్టూ తిరిగే కథతో ‘మార్క్‌ ఆంటోనీ’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. విశాల్‌, సూర్య ఫుల్‌ ఎనర్జీతో రంగంలోకి దిగిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీత దర్శకుడు.

Updated Date - 2023-08-26T05:23:22+05:30 IST