లేడీ ఓరియెంటెడ్ కథతో...
ABN , First Publish Date - 2023-09-17T02:11:59+05:30 IST
‘భీమ్లానాయక్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోనికా రెడ్డి ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం రూపొందుతోంది...

‘భీమ్లానాయక్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోనికా రెడ్డి ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం రూపొందుతోంది. రాకేశ్‌రెడ్డి యాస దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభించారు. దేవి ప్రసాద్ బలివాడ క్లాప్ ఇచ్చారు. అంజిరెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు తన పాత్రను డిఫరెంట్‌గా డిజైన్ చేశారని మోనికా రెడ్డి చెప్పారు. ఇదొక పీరియాడికల్ మైథాలజీ ఫిల్మ్ అని దర్శకుడు చెప్పారు. టైటిల్‌తో పాటు ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భాస్కర్‌రెడ్డి చెప్పారు.