అనుకుంటే జరిగిపోతాయా?

ABN , First Publish Date - 2023-08-08T03:36:42+05:30 IST

కృష్ణ మడుపు, ఫణి భార్గవ్‌, నర్సింగ్‌ వాడేకర్‌ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘1134’. శరత్‌ చంద్ర తడిమేటి దర్శకత్వం వహించారు...

అనుకుంటే జరిగిపోతాయా?

కృష్ణ మడుపు, ఫణి భార్గవ్‌, నర్సింగ్‌ వాడేకర్‌ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘1134’. శరత్‌ చంద్ర తడిమేటి దర్శకత్వం వహించారు. రాంఽధుని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ఇటీవల హైదరాబాద్‌లో హీరో నందు చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదలైంది. ‘అన్నీ నువ్వనుకొనేలా జరిగితే.. మరి నేనెందుకురా ఇక్కడ’ అనే డైలాగ్‌ ట్రైలర్‌లో ఆకట్టుకొంటోంది. నందు మాట్లాడుతూ ‘‘ఎంత బడ్జెట్‌తో తీశామన్నది కాదు. కంటెంట్‌ ఉందా? లేదా? అనేదే ముఖ్యం. ‘1134’లో ఆ కంటెంట్‌ కనిపిస్తోంద’’న్నారు. ‘‘దోపిడీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేద’’న్నారు దర్శకుడు.

Updated Date - 2023-08-08T03:36:42+05:30 IST