అల్లు అర్జున్ ‘జవాన్’ చిత్రంలో నటిస్తారా?
ABN , First Publish Date - 2023-02-14T03:18:35+05:30 IST
‘పఠాన్’ చిత్రం సంచలన విజయం సాధించడంతో షారుఖ్ ఖాన్ మంచి జోరు మీదున్నారు. మూడో వారంలోకి అడుగు పెట్టిన ఈ సినిమా మంచి వసూళ్లతో ముందుకు...
‘పఠాన్’ చిత్రం సంచలన విజయం సాధించడంతో షారుఖ్ ఖాన్ మంచి జోరు మీదున్నారు. మూడో వారంలోకి అడుగు పెట్టిన ఈ సినిమా మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ‘పఠాన్’కు అదే ఆదరణ, అదే కలెక్షన్ల జోరు! ఈ సక్సె్‌సను ఎంజాయ్ చేస్తూనే తన తదుపరి చిత్రం ‘జవాన్’ మీద దృష్టి పెట్టారు షారుఖ్. ఈ యాక్షన్ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయిక. ప్రియమణి మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాను త్వరితగతిన పూర్తి చేసి ఈ ఏడాది జూన్‌లో విడుదల చేయానుకుంటున్నారు. ఇదిలా ఉంటే హీరో అల్లు అర్జున్ ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరవడంతో ఈ వార్త అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ఈ చిత్రంలో నటించడానికి అల్లు అర్జున్ అంగీకరిస్తే ‘జవాన్’ హిందీలో ఆయనకు తొలి సినిమా అవుతుంది. ‘జవాన్’ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర ఉంది. మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఆ పాత్ర పోషిస్తే సినిమా అదిరి పోతుంది. ఆ హీరో కూడా ఇంతవరకూ షారుఖ్ తో కలసి నటించి ఉండకూడదు అని దర్శకుడు అట్లీ అనుకున్నప్పుడు ఆయన మదిలో అల్లు అర్జున్ మెదిలారనీ, వెంటనే ఆయన కలసి కథ గురించి, ఆ పాత్ర గురించి వివరించారని వినిపిస్తోంది. అయితే అల్లు అర్జున్ అవునని కానీ, కాదని కానీ హోల్డ్‌లో పెట్టారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమీ రాకపోయినా ఈ వార్త మాత్రం బాగా వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ చిత్రంతో బాగా బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతుంది.