ఈ మిషన్‌ ఎందుకోసం?

ABN , First Publish Date - 2023-04-04T03:47:58+05:30 IST

అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మిషన్‌: చాప్టర్‌ 1’. ఎమీ జాక్సన్‌ కథానాయిక. సుభాస్కరన్‌, ఎం.రాజశేఖర్‌, ఎస్‌.స్వాతి నిర్మాతలు. విజయ్‌ దర్శకత్వం వహించారు...

ఈ మిషన్‌ ఎందుకోసం?

అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మిషన్‌: చాప్టర్‌ 1’. ఎమీ జాక్సన్‌ కథానాయిక. సుభాస్కరన్‌, ఎం.రాజశేఖర్‌, ఎస్‌.స్వాతి నిర్మాతలు. విజయ్‌ దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తయింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ‘‘సాంకేతికంగా భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందించాం. కేవలం 70 రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది. విలక్షణ దర్శకుడు విజయ్‌ మరో వినూత్నమైన కథతో అలరిస్తారు. ఈ సినిమాతో అరుణ్‌ విజయ్‌ పేరు అగ్ర కథానాయకుల జాబితాలో చేరుతుంది. ఈ సినిమా కోసం ఓ భారీ జైల్‌ సెట్‌ రూపొందించాం. ఆ సెట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలస్తుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు నిర్మాతలు. నిమిషా సజయన్‌, అబి హాసన్‌, భరత్‌ బోపన్న తదితరులు నటించారు. సంగీతం: జి.వి.ప్రకాశ్‌ కుమార్‌.

Updated Date - 2023-04-04T09:30:53+05:30 IST