చంద్రబాబు అరెస్ట్‌పై పరిశ్రమ ఎందుకు స్పందించడం లేదు?

ABN , First Publish Date - 2023-09-13T00:11:53+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ పై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం పట్ల నిర్మాత నట్టి కుమార్‌ విచారం వ్యక్తం చేశారు...

చంద్రబాబు అరెస్ట్‌పై పరిశ్రమ ఎందుకు స్పందించడం లేదు?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ పై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం పట్ల నిర్మాత నట్టి కుమార్‌ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ‘‘మొదటి నుంచి నేను కాంగ్రెస్‌ వాదిని. తెలుగుదేశం పార్టీని ఏ రోజూ సపోర్ట్‌ చేయలేదు. అయినా చంద్రబాబు నాయుడు అరె్‌స్టను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతిపక్షంలో కానీ, అధికార పక్షంలో కానీ చంద్రబాబునాయుడు లాంటి అనుభవజ్ఞుడు ఉండడం మంచిది. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అలా జైలులో ఉండకూడదు. ఆయనపై పెట్టిన కేసులలో నిజాలు ఉన్నాయా? లేవా? అన్న అంశాలను కోర్టులు చూసుకుంటాయి. అయితే చంద్రబాబు అరెస్టుపై తెలుగు సినీ పరిశ్రమ స్పందించకపోవడం మాత్రం నాకు బాధ కలిగిస్తోంది. వాస్తవానికి పరిశ్రమలో చంద్రబాబు అభిమానులు, మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీళ్లంతా చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు లబ్ది పొందిన వారే. ప్రతీ సందర్భంలోనూ సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తిగా చంద్రబాబు పేరు సంపాదించుకున్నారు. ఓ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడుగా అండగా ఉండటం మానవత్వం. చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే వైఎస్‌ జగన్‌ ఏమన్నా ఉరితీస్తాడా? లేక కేసులు పెడతారని వీరందరికీ భయమా? నాకు అర్థం కావడం లేదు’ అన్నారు.

Updated Date - 2023-09-13T00:11:53+05:30 IST