సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావ్‌?

ABN, First Publish Date - 2023-03-01T01:07:57+05:30

రోడ్డుపై ఆకతాయి ఎవరో.. అమ్మాయిని టీజ్‌ చేస్తుంటాడు. మరింత శ్రుతి మించి చేయి చేసుకొంటే... సరిగ్గా అప్పుడే హీరో రంగ ప్రవేశం చేసి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడిరోడ్డుపై నిలదీసిన నాగశౌర్య

రోడ్డుపై ఆకతాయి ఎవరో.. అమ్మాయిని టీజ్‌ చేస్తుంటాడు. మరింత శ్రుతి మించి చేయి చేసుకొంటే... సరిగ్గా అప్పుడే హీరో రంగ ప్రవేశం చేసి, అతనికి బుద్ది చెబుతాడు. ఇలాంటి సీన్‌ని చాలా సినిమాల్లో చూసేశాం. కానీ.. ఇప్పుడు నిజంగా జరిగింది. అమ్మాయిపై చేయి చేసుకొన్న ఓ కుర్రాడిని.. నడిరోడ్డుపై నిలదీసి ‘రియల్‌ హీరో’ అనిపించుకొన్నాడు నాగశౌర్య. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. నాగశౌర్య కారులో సినిమా షూటింగ్‌కి వెళ్తున్నప్పుడు.. ఓ అబ్బాయి, అమ్మాయిపై చేయి చేసుకోవడం తన దృష్టిలో పడింది. దాంతో నాగశౌర్య కారు దిగి.. ‘ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావ్‌’ అంటూ నిలదీశాడు. ‘తను నా ప్రియురాలు.. కొడితే తప్పేంటి’ అని ఆ అబ్బాయి సమాధానం ఇచ్చినా నాగశౌర్య వినిపించుకోలేదు. ‘అయితే మాత్రం ఆ అమ్మాయిని నడిరోడ్డుపై కొడతావా.. ముందు సారీ చెప్పు..’ అంటూ ఆ అబ్బాయితో అమ్మాయికి క్షమాపణలు చెప్పించాడు. ఈ తతంగమంతా అక్కడున్నవాళ్లు సెల్‌ఫోన్‌లో బంధించారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నాగశౌర్య మంచి పని చేశాడంటూ.. నెటిజన్లు ఈ కథానాయకుడ్ని మెచ్చుకొంటున్నారు. ఎంత ప్రేమించిన అమ్మాయి అయినా సరే, అలా చేయి చేసుకొనే హక్కు అబ్బాయిలకు లేదంటూ, ఈ విషయంలో నాగశౌర్య రియల్‌ హీరో అనిపించుకొన్నాడని అమ్మాయిలు శౌర్యకు కితాబు ఇస్తున్నారు.

Updated Date - 2023-03-01T01:07:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!